అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ వై.కె. నాగేశ్వరరావు సహాయంతో సారిపల్లి కొండలరావు సారథ్యంలో 1995లో ఈ కళా పరిషత్తు నాటక పోటీలను నిర్వహించింది. ఆచంట వెంకటరత్నం నాయుడు నాటక సప్తాహం చేశారు. ఈ పరిషత్తు ద్వారా 11 నాటకాల ప్రచురణలు వెలువడ్డాయి. దుగ్గిరాల సోమేశ్వరరావు, సి.ఎస్.రావు, డి.ఎస్.ఎన్. మూర్తి, నెమలికంటి తారక రామారావు, ఆర్. నాగేశ్వరరావు తదితరులు సత్కారాన్ని అందుకున్నారు.

2012 నాటకోత్సవం (17వ)[మార్చు]

2012 సంవత్సరం యువకళావాహిని ఆధ్వర్యంలో సారిపల్లి కొండలరావు సారథ్యంలో 17వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు అయిదు రోజులపాటు జరిగాయి.

మల్లాది క్రియేషన్స్, హైదరాబాదు వారు ప్రదర్శించిన ‘బావిలో కప్ప’ నాటిక, బాలి రామారావు రచించగా మల్లాది భాస్కర్ దర్శకత్వంలో హాస్యభరితంగా నడచి ప్రేక్షకుల నవ్వుల పువ్వులు వికసింప చేసింది.

కళాదర్శిని, హైదరాబాదు వారిచే ‘మనిషి మంచోడే’ నాటిక కాటా సుబ్బారావు రచించగా, కె. హరిబాబు దర్శకత్వంలో ప్రదర్శించారు.

రెండవ నాటికగా, కోమలి కళాసమితి నల్గొండ వారి నాటిక ‘ఆత్మగీతం’ శిష్టా చంద్రశేఖర్ రచించగా ఎస్.ఎం. భాషా దర్శకత్వంలో ప్రదర్శించారు.

అడవికీ, నగరానికీ మధ్యన ఉన్న లక్ష్మణరేఖ తుడిచివేయబడితే, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా పోతే, తమ అస్తిత్వం కోసం అవి పాడుతున్న విషాద గీతమే ఈ ఆత్మగీతం కథ. వన్య ప్రాణులను నిర్లక్ష్యం చేసి, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే ఆధునిక మానవుని చర్యలు ఎలాంటి విపత్కర పరిస్థితులను కొని తెచ్చి పెడుతుందో అని చెప్పడమే ఈ నాటిక ఉద్దేశం. ఇరవై మంది కళాకారులు గిరిజన పాత్రలలోను, పక్షులు, జంతువుల పాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు.

తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్, వరంగల్ వారి ‘ముసుగు’ నాటిక, స్నిగ్ధ రచించగా, పందిళ్ళ శేఖర్‌బాబు దర్శకత్వంలో ప్రదర్శించి సమాజంలోని వైవిధ్యమైన మనుష్యులను వారి కుట్రపూరిత బద్ధులను కనిపెట్టి ఉండవలసిందిగా హెచ్చరించిందీ నాటిక.

‘బొమ్మ సముద్రం’, ఉదయ్ భాగవతుల రచన దర్శకత్వంలో ప్రదర్శించారు.

‘కాలుష్యం’ నాటికను కళాభారతి ప్రొద్దుటూరువారు, ఉషోదయ కళానికేతన్, హైదరాబాదు వారు ‘గారడీ’ నాటికను ప్రదర్శించారు.

‘నెంబరు లేని ఖైదీ’ ఆకెళ్ళ రచించగా, గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు.

‘ఓ లచ్చీ… గుమ్మడి’ ఎం.ఎస్. చౌదరి రచన చేయగా డా. సి.ఎస్. ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. అద్దాల దుస్తులు ధరించి, వయ్యారాలను ఒలకబోస్తూనే చెమటోడ్చి, గంజినీళ్ళు మాత్రమే తాగి బ్రతికే ఆజాతి ఆడపడుచుల ఆక్రందనలకు ప్రతిబింబమే ఈ నాటిక.

గంగోత్రి పెదకాకాని వారి ‘నువ్వు+నేను, ప్రేమ= పెళ్ళాం’ నాయుడు గోపి దర్శకత్వంలో ప్రదర్శించారు.

విప్లవరచయిత రావిశాస్త్రి మూలకథని ఎం.ఎస్. చౌదరి వేదిక నెక్కించిన ‘పిపీలికం’ పరిషత్ ‘వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’ సుఖమంచి కోటేశ్వర రావు రచించగా, జయప్రకాశ్ రెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించి శుభప్రదం చేశారు.

విజేతలు[మార్చు]

నల్గొండ కోమలి కళాసమితివారి ‘ఆత్మగీతం’ ప్రథమ బహుమతి పొందగా, మోడరన్ థియేటర్ విజయవాడ వారి ‘పిపీలికం’ ద్వితీయ బహుమతి పొందింది.

ఉత్తమ రచన: ఆకెళ్ళ రచించిన ‘నెంబరు లేని ఖైదీ’, ఉత్తమ దర్శకత్వం: ‘ఆత్మగీతం’ దర్శకుడు ఎస్.ఎం. భాషా.

2015 నాటకోత్సవం[మార్చు]

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్-2015 కరపత్రం మొదటి పేజి

21 వ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు రవీంద్రభారతిలో సెప్టెంబరు 11,12,13 తేదీల్లో నిర్వహించారు.[1][2]

  • ఇందులో మొదటి రోజు.... నిజామాబాద్ వారి 'పొద్దు పొడిచింది', హైదరాబాదు వారి 'మరో దేవాలయం', హైదరాబాదు వారి 'చెంగల్వ పూదండ' ప్రదర్శించారు. ఈ రోజు పరుచూరి సోదరులను సన్మానించారు. కుమారి ప్రణతి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.
  • రెండవరోజు.... నంద్యాల వారి 'సైకత శిల్పం', కాకినాడ వారి 'సౌందర్య భారతం', కొలకలూరు వారి 'పెళ్లి చేసి చూడు', విజయవాడ వారి 'అనగనగా ' ప్రదర్శించారు. ఈ రోజు నల్లూరి వెంకటేశ్వర్లు, కాకరాల, కళ్యాణి లను సన్మానించారు.
  • మూడవ రోజు.... విజయవాడ వారి 'దత్త స్వీకారం', కొప్పోలు వారి 'నిర్ణయం', గుంటూరు వారి 'రెండు నిశ్శభ్దాల మధ్య' ప్రదర్శించారు. ఈ రోజు సాయికుమార్ ను అక్కినేని నాగేశ్వర రావు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కుమారి గౌరవి రెడ్డి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.
అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్-2015 కరపత్రం లోపలి పేజి

2016 నాటకోత్సవం[మార్చు]

22 వ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు రవీంద్రభారతిలో సెప్టెంబరు 18,19 తేదీల్లో నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (9/13/2015). "పోటాపోటీగా నాటికలు". Retrieved 24 September 2016. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
  2. నమస్తే తెలంగాణ (9/12/2015). "అక్కినేని నాటికల పోటీలు షురూ". Retrieved 24 September 2016. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)