అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2019

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యువకళావాహిని గత 25 సంవత్సరాలుగా డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ పేరిట ప్రతి సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 25వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను గుంటూరు లోని అన్నమయ్య కళావేదికపై 2019, సెప్టెంబరు 9వ తేది నుండి 13వ తేది వరకు నిర్వహించారు. పరిషత్ కన్వీనర్ వై.కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నాటిక పోటీ ప్రదర్శనలో పాల్గొన్న నాటక సంస్థల నిర్వాహకులకు 15 వేల రూపాయల ప్రదర్శనా పారితోషికం, పరిషత్ జ్ఞాపిక, గురు ప్రసాద్ మీడియా డైరెక్టరీ ప్రదానం చేయబడింది.

పురస్కారాలు

[మార్చు]
 • అక్కినేని జన్మదిన పురస్కారం: జమున (సినిమా నటి)
 • అక్కినేని రంగస్థల పురస్కారం: ఎ. వేంకటేశ్వరరావు, శివపార్వతి

కార్యక్రమాలు

[మార్చు]

మొదటి రోజు

[మార్చు]

కళాభారతి ప్రజానటి డా. జమునకి డా. అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన పురస్కారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురు ప్రసాద్ మీడియా డైరెక్టరీ (2019) ఆవిష్కరించి జమునను సన్మానించాడు. ఈ కార్యక్రమంలో సారిపల్లి కొండలరావు, డా. కొలకలూరి ఇనాక్, దాము ఆర్ గేదెల, నూతలపాటి సాంబయ్య పాల్గొన్నారు.[1][2][3]

రెండవ రోజు

[మార్చు]

రెండవ రోజు కార్యక్రమంలో జి. సత్యవాణి, నూతలపాటి సాంబయ్య, సిహెచ్. మస్తానయ్య, బొప్పన నరసింహారావు, జి. మల్లికార్జునరావు, త్యాగరాజు పాల్గొని కళాకారులను అభినందించారు.[4][5]

మూడవ రోజు

[మార్చు]

మూడవ రోజు కార్యక్రమంలో ఆలాపన వేంకటేశ్వరరావు, యస్.పి. త్యాగరాజు భక్తిగీతాలు ఆలపించారు. డా. రామరాజు శ్రీనివాసరావు, పరిషత్ నిర్వాహకులు పాల్గొని కళాకారులను అభినందించారు.[6]

నాలుగవ రోజు

[మార్చు]

తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, పరిషత్ నిర్వాహకులు పాల్గొని కళాకారులను అభినందించారు. రంగస్థల నటులు ఆరాధ్యుల కోటేశ్వరరావు, ఆరాధన కృష్ణయ్యలను సత్కరించారు.[7]

ఐదవ రోజు

[మార్చు]

నాటిక పోటీలు చివరిరోజు బహుమతి జరిగింది. డా అక్కినేని పరిషత్ రంగస్థల పురస్కారాలు ఏ. వేంకటేశ్వరరావు, శివపార్వతిలకు గార్లకు అందించారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జానపద రంగస్థల కళల నగదు పురస్కారాలు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు నగదు 20 మంది కళాకారులకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోన రఘుపతి, సారిపల్లి కొండలరావు, రాయపాటి శ్రీనివాస్, డా. రామరాజు శ్రీనివాసరావు, డా. మహమ్మద్ రఫీ, జి. నెహ్రూ, పండిట్ అంజుబాబు, డోగిపర్తి శంకరరావు, సిహెచ్. మస్తానయ్య, వై.కె. నాగేశ్వరరావు పాల్గొన్నారు.[8][9]

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
09.09.2019 సా. 6 గం.లకు ఒప్పులకుప్ప (నాటిక) గంగోత్రి, పెదకాకాని డా. చింతికింది శ్రీనివాస్‌రావ్ నాయుడు గోపి
10.09.2019 సా. 6 గం.లకు అనుబంధం (నాటిక) హర్ష క్రియేషన్స్, విజయవాడ షేక్ హుస్సేన్ కత్తి శ్యాంప్రసాద్
10.09.2019 రా. 8 గం.లకు చేజారితే (నాటిక) స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు జి.వి.ఆర్. శర్మ గణపవరపు సాంబశివరావు
11.09.2019 సా. 6 గం.లకు జరుగుతున్న కథ (నాటిక) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ళ గంగోత్రి సాయి
11.09.2019 రా. 8 గం.లకు శుభలగ్నం (నాటిక) మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్, వరంగల్ అంకం లింగమూర్తి శతపతి శ్యామలరావు
12.09.2019 సా. 6 గం.లకు నిర్జీవ నినాదం (నాటిక) శర్వాణి గ్రామీణ & గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ, శ్రీకాకుళం అడపా సూరిబాబు కె.కె.ఎల్. స్వామి
12.09.2019 రా. 8 గం.లకు ఇది కాకూడదు ముగింపు (నాటిక) సుమిత్రా కళాసమితి, శ్రీకాకుళం కంచర్ల సూర్యప్రకాష్ ఎన్.పి. ప్రసాద్
13.09.2019 సా. 6 గం.లకు అమ్మకానికో అమ్మ (నాటిక) జస్ట్ స్మైల్, తిరుపతి విద్యాధ‌ర్ మునిప‌ల్లె డా. జలదంకి రవీంద్ర

బహుమతుల వివరాలు

[మార్చు]
 • ఉత్తమ ప్రదర్శన: జరుగుతున్న కథ
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: అనుబంధం
 • ఉత్తమ నటుడు: నాయుడు గోపి (ఒప్పులకుప్ప)
 • ఉత్తమ నటి: అమృతవర్షిణి (అనుబంధం)
 • ఉత్తమ ప్రతినాయకుడు: మాలి విజయరాజ్ (శుభలగ్నం)
 • ఉత్తమ దర్శకుడు: గంగోత్రి సాయి (జరుగుతున్న కథ)
 • ఉత్తమ రచయిత: అడపా సూరిబాబు (నిర్జీవ నినాదం)
 • ఉత్తమ సాంకేతికవర్గం: శ్రీధర్ పైడి (ఇది కాకూడదు ముగింపు)
 • ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్: గంగోత్రి సాయి (జరుగుతున్న కథ)
 • ప్రత్యేక బహుమతులు: అమ్మకానికో అమ్మ

న్యాయ నిర్ణేతలు

[మార్చు]
 1. కావూరి సత్యనారాయణ
 2. నుసుమ నాగభూషణం
 3. డా. పి.వి. రామ్‌కుమార్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. ప్రజాశక్తి, సంగమం (11 September 2019). "నన్ను నడిపించింది గరికపాటి". www.prajasakti.com. ఆకుల మల్లేశ్వరరావు. Archived from the original on 19 సెప్టెంబరు 2019. Retrieved 19 September 2019.
 2. అక్కినేని పురస్కారం.. మహాభాగ్యం, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 10 సెప్టెంబరు 2019, పుట. 15.
 3. కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం, సాక్షి, గుంటూరు ఎడిషన్, 10 సెప్టెంబరు 2019, పుట. 6.
 4. సందేశాత్మకంగా నాటికల ప్రదర్శన, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 11 సెప్టెంబరు 2019, పుట. 17.
 5. సందేశాత్మకంగా నాటిక పోటీలు, సాక్షి, గుంటూరు ఎడిషన్, 11 సెప్టెంబరు 2019, పుట. 20.
 6. సామాజిక సమస్యలకు దర్పణంగా నాటికలు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 12 సెప్టెంబరు 2019, పుట. 16.
 7. సందేశాత్మకంగా సాగిన నాటికలు, సాక్షి, గుంటూరు ఎడిషన్, 13 సెప్టెంబరు 2019, పుట. 20.
 8. రంగస్థల కళల అభివృద్ధికి కృషి చేస్తా, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 14 సెప్టెంబరు 2019, పుట. 19.
 9. నటులకు పురస్కార ప్రదానం, సాక్షి, గుంటూరు ఎడిషన్, 14 సెప్టెంబరు 2019, పుట. 20.