అక్కివారి పల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్కివారి పల్లె, వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలానికి చెందిన గ్రామము. ఇది కలసపాడు పంచాయితీలో భాగము.ఇది కలసపాడుకు తూర్పు వైపు ఉంది. ముసల్ రెడ్డిపల్లెకు ఏడమ వైపు పుల్లారెడ్డి పల్లె అనుకుంటే కుడి వైపు అరకిలో మీటరు దూరంలో అక్కివారిపల్లె ఉంది. దీనికి కుడి వైపున మహానంది పల్లె, మామిల్ల పల్లె గ్రామాలు ఉన్నాయిఈ గ్రామములో అక్కి అను ఇంటి పేరు కలవారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ గ్రామములో రెడ్డి కులస్తులు తొంభై శాతం కలరు.ముస్లింలు 2కుటుంబాల వారు ఉండేవారు, ప్రస్తుతం వారు కూడా బ్రతుకు తెరువు కొరకు కలసపాడు వలసపోయారు. 4 నుండి 5 కుటుంబాల వారు బట్టలు నేసేవారు ఉన్నారు, వీరిలో కూడా 2కుటుంబాల వారు మాత్రమే ప్రస్తుతం ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అక్కివారి పల్లెకు 1కి.మీ. దూరమున తూర్పు వైపు చిన్న కొండ మీద శ్రీ తిరుమల కొండస్వామి దేవస్థానం ఉంది. ఇచటకు చుట్టుపక్కల గ్రామల వారు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనుటకు వచ్చేదరు. ప్రతీ సంవత్సరం ఇచట వేడుకగా తిరుణాల కూడా జరుపుతారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]