అక్టోబర్ స్కై (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్టోబర్ స్కై
దర్శకత్వంజో జాస్టన్
స్క్రీన్ ప్లేలెవిస్ కోల్క్
నిర్మాతచార్లెస్ గోర్డాన్, లారీ జె. ఫ్రాంకో
తారాగణంజేక్ గైలెన్హాల్, క్రిస్ కూపర్, క్రిస్ ఓవెన్, లారా డెర్న్
ఛాయాగ్రహణంఫ్రెడ్ ముర్ఫీ
కూర్పురాబర్ట్ దల్వా
సంగీతంమార్క్ ఇషామ్
నిర్మాణ
సంస్థ
యూనివర్సల్ స్టూడియోస్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీ
1999 ఫిబ్రవరి 19 (1999-02-19)(యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
107 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఆంగ్లం
బడ్జెట్$25 మిలియన్
బాక్సాఫీసు$34.7 మిలియన్

అక్టోబర్ స్కై 1999లో విడుదలైన అమెరికా చలనచిత్రం. బొగ్గుగనుల కొడుకు హోమర్ హెచ్. హికామ్ (జూనియర్) రచించిన కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రానికి జో జాస్టన్ దర్శకత్వం వహించగా జేక్ గైలెన్హాల్, క్రిస్ కూపర్, క్రిస్ ఓవెన్, లారా డెర్న్ తదితరులు నటించారు. వెస్ట్ వర్జీనియాలోని కోల్వాడ్లో పెరిగిన నలుగురు యువకుల జీవితాలపై తీసిన ఈ చిత్రం ఈస్ట్ టెన్నెస్సీలోని ఒలివర్ స్ప్రింగ్స్, హర్రిమన్, కింగ్ స్టన్, మోర్గాన్, రోనే కౌంటీల్లో చిత్రీకరించబడింది.[1]

కథ[మార్చు]

1950లో మైనింగ్ టౌన్ గా పిలువబడిన కోల్వాడ్ లో హోమర్ హికాం అనే పిల్లవాడు నివసిస్తుండేవాడు. తన తండ్రిలాగా తానుకూడా స్థానిక బొగ్గు గనులలో పనిచేయడమే తన భవిష్యత్తుగా భావిస్తుండేవాడు. 1957 అక్టోబరులో మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 కక్ష్యలోకి ప్రవేశించిన సంఘటనను చూసిన హోమర్ రాకెట్లను తయారుచేసే ఇంజనీరు అవ్వాలనుకుంటాడు.

హోమర్ ప్రతిభను తండ్రి, స్నేహితులు గుర్తించకపోడడం చూసిన టీచర్ హోమర్ ను ప్రోత్సహించి పాఠశాలనుండి జాతీయ సైన్స్ ఫెయిర్లో పాల్గొనేందుకు సహకరిస్తుంది. హోమర్ ఆ సైన్స్ ఫెయిర్లో రాకెట్ ను తయారుచేసి పోటీలో విజయం సాధిస్తాడు.

నటవర్గం[మార్చు]

  • జేక్ గైలెన్హాల్
  • క్రిస్ కూపర్
  • క్రిస్ ఓవెన్
  • లారా డెర్న్
  • విలియం లీ స్కాట్
  • చాద్ లిండ్బర్గ్
  • నటాలీ కెనరాడే
  • రాండి స్ట్రిప్లింగ్
  • క్రిస్ ఎల్లిస్
  • ఎలియా బాస్సిన్
  • ఓ. విన్స్టన్ లింక్
  • ఆండీ స్టాల్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: జో జాస్టన్
  • నిర్మాత: చార్లెస్ గోర్డాన్, లారీ జె. ఫ్రాంకో
  • స్క్రీన్ ప్లే: లెవిస్ కోల్క్
  • ఆధారం: హోమర్ హిక్కాం రాసిన అక్టోబర్ స్కై నవల
  • సంగీతం: మార్క్ ఇషామ్
  • ఛాయాగ్రహణం: ఫ్రెడ్ ముర్ఫీ
  • కూర్పు: రాబర్ట్ దల్వా
  • నిర్మాణ సంస్థ: యూనివర్సల్ స్టూడియోస్
  • పంపిణీదారు: యూనివర్సల్ పిక్చర్స్

మూలాలు[మార్చు]

  1. "Coalwood, West Virginia Web Site". www.coalwoodwestvirginia.com. Retrieved 6 September 2018.

ఇతర లంకెలు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.