అక్బరుద్దీన్ ఒవైసీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్బరుద్దీన్ ఒవైసీ

పదవీ కాలము
1999 – 2004
ముందు అమానుల్లా ఖాన్
నియోజకవర్గం చాంద్రాయణగుట్ట హైదరాబాదు
పదవీ కాలము
2004 – 2009
పదవీ కాలము
2009 – 2014
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-14) 1970 జూన్ 14 (వయస్సు: 49  సంవత్సరాలు)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
సంతానము నూరుద్దీన్ ఒవైసీ , ఒక కుమార్తె
పూర్వ విద్యార్థి సెయింట్ మేరీ జూనియర్ కాలేజి
వృత్తి రాజకీయాలు
మతం ఇస్లాం
1 December, 2013నాటికి

అక్బరుద్దీన్ ఒవైసీ (జననం 1970 జూన్ 14) హైదరాబాదు-చాంద్రాయణగుట్టకు చెందిన శాసన సభ్యుడు.[1] ఇతను ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన వాడు. ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడరు.[1] అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన వాడు. ఇతని తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, అన్న అసదుద్దీన్ ఒవైసీ.

ఒవైసీ వివాస్పాద ప్రసంగాలకు ప్రసిద్ధి.[2][3][4] 2007 లో సల్మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్ లకు వ్యతిరేక ఫత్వాను పురస్కరించుకుని వారు హైదరాబాదుకు వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని ప్రకటించాడు.[2][4][5][6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అక్బరుద్దిన్ 1970 జూన్ 14 లో జన్మించాడు. విద్యాభ్యాసం హైదరాబాదు లోనే జరిగింది. వైద్యశాస్త్రం చదువుతూ మధ్యలోనే, రాజకీయాలలో చేరుటకు, వదిలేశాడు. ఇతడు ఒవైసీ హాస్పిటల్ కు డైరక్టరు కూడా. ఇతను ఒక క్రైస్తవ మతస్తురాలైన స్త్రీని వివాహమాడాడు.

రాజకీయ రంగం[మార్చు]

1999, 2004, 2009, 2014 సం.లలో వరుసగా నాలుగు సార్లు హైదరాబాదు చాంద్రాయణ గుట్ట నుండి శాసన సభకు పోటీ చేసి గెలిచాడు.[7]

ప్రత్యర్ధుల దాడి[మార్చు]

30 2011 ఏప్రిల్ 1 వ తారీఖున ఎమ్మే ల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పై ప్రత్యర్గివర్గం దాడికి పాల్ప డింది. ప్రత్యర్థులు ముందుగా కత్తులతో దాడిచేసి తర్వాత కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యేల గన్‌మెన్‌ కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డాడు. అక్బరుద్దీన్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకుపో యాయి. 17 కత్తిపోట్లు ఉన్నాయి.[8]

వివాదాస్పద ప్రసంగాలు[మార్చు]

24 డిశెంబరు 2012 లో ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ పట్టణంలో చేసిన ప్రసంగం తీవ్ర వివాదాలకు గురైంది. ఈ ప్రసంగం కారణాన ఇతడిపై కేసు నమోదయింది. హిందువుల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. పోలీసుల వైఖరిని తూర్పారబట్టాడు.

విమర్శ[మార్చు]

ఎందరో సాహితీకారులు, సామాజిక కార్యకర్తలు ఇతడిని విమర్శించారు. అస్గర్ అలీ ఇంజనీర్, స్వామి అగ్నివేష్, మహేశ్ భట్, హామిద్ ముహమ్మద్ ఖాన్, సందీప్ పాండే, రాం పుణ్యాని మొదలగువారు ఇతడిని విమర్శించిన వారిలో ఉన్నారు.[9]

పాదపీఠికలు[మార్చు]

  1. 1.0 1.1 "Owaisi's brother shot at, critical; Hyderabad tense". Indian Express. 1 May 2011. Retrieved 3 January 2012.
  2. 2.0 2.1 "Owaisi hate speech: This is not the first time". Firstpost. 3 January 2012. Retrieved 4 January 2013.
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ncjan42013 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 4.0 4.1 Lakshman, Ganesh S (5 January 2012). "Akbar Owaisi has a history of hate speeches". Times of India. Retrieved 6 January 2012.
  5. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; thehinduaug112007 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; wdprofile అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Chandrayangutta Assembly Constituency Details". మూలం నుండి 12 సెప్టెంబర్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 19 July 2013. Cite web requires |website= (help)
  8. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-01. Cite web requires |website= (help)
  9. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; thehindu31dec2012 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు