Jump to content

అక్బర్‌పూర్ (అంబేద్కర్ నగర్)

అక్షాంశ రేఖాంశాలు: 26°26′00″N 82°32′25″E / 26.43333°N 82.54028°E / 26.43333; 82.54028
వికీపీడియా నుండి
అక్బర్‌పూర్
అంబేద్కర్ నగర్
పట్టణం
అక్బర్‌పూర్ పట్టణ దృశ్యం
అక్బర్‌పూర్ పట్టణ దృశ్యం
అక్బర్‌పూర్ is located in Uttar Pradesh
అక్బర్‌పూర్
అక్బర్‌పూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°26′00″N 82°32′25″E / 26.43333°N 82.54028°E / 26.43333; 82.54028
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఅంబేద్కర్ నగర్
Elevation
133 మీ (436 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,11,594
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
224122
టెలిఫోన్ కోడ్915271
Vehicle registrationUP-45
లింగ నిష్పత్తి1000/937 /

అక్బర్పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది అంబేద్కర్ నగర్ జిల్లాకు ముఖ్య పట్టణం

చరిత్ర

[మార్చు]

రామాయణంలో, దశరథుడు శ్రావణ కుమారుని మృగమనుకుని చంపేసిన ప్రదేశం అక్బర్పూర్ అని ఇక్కడి నమ్మకం. దీన్ని శ్రావణ క్షేత్రం అని పిలుస్తారు. ఋష్యశ్రింగ మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉంది. రామాయణం ప్రకారం, సీతారాముల కుమారుడు కుశుడు శ్రావస్తిని పాలించాడు. దానికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని రాజ్‌భార్ రాజులు పాలించారు. రాముడు అనేక రాజ్‌భర్ రాజులతో పోరాడాడని రామాయణంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

అక్బర్పూర్, తమసా నది ఒడ్డున ఉంది (దీనిని టోన్స్ నది అని కూడా పిలుస్తారు). తమసా నది అంబేద్కర్ నగర్ నగరాన్ని అక్బర్పూర్, షాజాద్‌పూర్ అని రెండు భాగాలుగా విభజిస్తుంది. షాజాద్‌పూర్ వాణిజ్య కేంద్రం. అక్బర్పూర్ నగరంలో భాగమైన లోరేపూర్‌లో పాత రాజభవనం, లోరేపూర్ ఇమాంబర్గాలు ఉన్నాయి.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, అక్బర్పూర్ మొత్తం జనాభా 1,11,447, వీరిలో పురుషులు 57,330 మంది, స్త్రీలు 54,117 మంది. ఆరేళ్ళ లోపు వయసు పిల్లాలు 14,726 ఉన్నారు. అక్బర్‌పూర్లో మొత్తం అక్షరాస్యత 72,049, ఇది జనాభాలో 64.6%, పురుసుల్లో అక్షరాస్యత 70.9% కాగా, స్త్రీలలో 58.1% ఉంది. అక్బర్పూర్ ఏడేళ్ళ వయసుకు పైబడిన జనాభాలో అక్షరాస్యత 74.5% కాగా ఇందులో పురుషుల అక్షరాస్యత 81.7%, స్త్రీ అక్షరాస్యత 66.9%. షెడ్యూల్డ్ కులాల జనాభా 15,310, షెడ్యూల్డ్ తెగల జనాభా 50. 2011 లో అక్బర్పూర్‌లో 17,720 ఇళ్ళున్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Akbarpur". www.censusindia.gov.in. Retrieved 3 November 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.