Jump to content

అక్బర్ సమాధి

అక్బర్ సమాధి
అక్బర్ సమాధి యొక్క బాహ్య ప్రవేశద్వారం, ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజాను అనుకరించేలా నిర్మించబడింది. ఫతేపూర్ సిక్రీ నగరాన్ని అక్బర్ స్థాపించాడు.
మతం
అనుబంధంఇస్లాం
జిల్లాసికంద్రా
Provinceఆగ్రా
Ecclesiastical or organizational statusసమాధి
Leadershipజహంగీర్
Year consecrated1605
స్థానం
ప్రదేశంIndia సికంద్రా, భారతదేశం
పటం
Interactive map of అక్బర్ సమాధి
Territoryసికంద్రా
భౌగోళిక నిర్దేశాంకాలు27°13′14″N 77°57′01″E / 27.22044°N 77.95031°E / 27.22044; 77.95031
నిర్మాణ శైలి
Typeసమాధి
Styleమొఘల్ వాస్తుశిల్పం
పూర్తయింది1613లో
Specifications
Direction of façadeనాలుగు అంతస్తుల పిరమిడ్
గరిష్ట ఎత్తు100 అడుగులు
Materialsఎర్ర ఇసుకరాయి
తెల్ల పాలరాయి

అక్బర్ సమాధి అనేది మూడవ, అత్యంత గొప్ప మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ యొక్క సమాధి మందిరం. ఈ సమాధిని 1605–1613 మధ్యకాలంలో అతని కుమారుడు జహంగీర్ నిర్మించాడు. ఇది భారతదేశం, ఉత్తర ప్రదేశ్, ఆగ్రా ఉపనగరమైన సికంద్రాలో 119 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నిర్మాణాలు ప్రధానంగా గాఢ ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించబడి, వాటిని తెల్ల పాలరాయి అలంకారాలతో సుసంపన్నం చేశారు.[1][2] ఈ సమాధిని 1688లో హిందూ జాట్ దళాలు దోచుకొని తీవ్రంగా ధ్వంసం చేశాయి.[3]

ప్రాంతం

[మార్చు]

ఇది ఆగ్రా నగర శివారులోని సికంద్రాలో, మథుర రహదారి పాత NH-2 (ప్రస్తుత NH-19) పై, నగర కేంద్రానికి 8 కి.మీ. పశ్చిమ-వాయవ్య దిశలో ఉంది. ఈ సమాధికి సుమారు 1 కి.మీ. దూరంలో అక్బర్‌కు అత్యంత ప్రియమైన భార్య మరియం-ఉజ్-జమాని సమాధి ఉంది.[4] అక్బర్ మరణానంతరం ఆమె అతని సమాధి చుట్టూ విస్తారమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆమెను ఆమె కుమారుడు జహంగీర్ అక్కడే సమాధి చేశాడు.[5]

చరిత్ర

[మార్చు]
అక్బర్ తన రాజసభలో.

అక్బర్ మొదటి (అక్బర్ I) మూడవ మొఘల్ చక్రవర్తి. అతను 1556 నుండి 1605 వరకు పాలించాడు. అక్బర్ తన తండ్రి హుమాయూన్ తరువాత సింహాసనం అధిష్ఠించాడు. ప్రారంభంలో అతనికి ప్రతినిధిగా బైరమ్ ఖాన్ సహకరించాడు. అతడు యువ చక్రవర్తికి మొఘల్ ఆధిపత్యాన్ని భారత ఉపఖండంలో విస్తరించడంలో, బలపరచడంలో సహాయపడ్డాడు.[6][7]

అక్బర్ సైనిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ఆధిపత్యం ద్వారా మొఘల్ సామ్రాజ్యాన్ని క్రమంగా భారత ఉపఖండంలోని విస్తార ప్రాంతాలకు విస్తరించాడు. అతని పాలనలో మొఘల్ భారతదేశం బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. దాని సంపద, పరిమాణం మూడింతలు పెరిగి, వాణిజ్య విస్తరణకు, ఇండో-పర్షియన్ సంస్కృతికి అధిక ప్రోత్సాహం లభించింది.[8][9]

అక్బర్ యొక్క ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ రాజసభలు వివిధ మతాల పుణ్యపురుషులు, కవులు, వాస్తుశిల్పులు, కళాకారులను ఆకర్షించాయి. ఈ కేంద్రాలు కళలు, సాహిత్యం, విద్యకు ప్రసిద్ధి చెందాయి.[10] 1605 అక్టోబర్ 3న అక్బర్ అతిసారం వ్యాధికి గురయ్యాడు. ఆ వ్యాధి నుండి అతను ఎప్పటికీ కోలుకోలేదని భావిస్తారు. అతను 1605 అక్టోబర్ 26న మరణించినట్లు నమ్ముతారు.[11][12] అక్బర్ మరణానంతరం అతని కుమారుడు జహంగీర్ తన తండ్రి సమాధి నిర్మాణాన్ని 1605–1613 మధ్యకాలంలో ప్రణాళికబద్ధంగా పూర్తి చేశాడు. దీని నిర్మాణానికి 15,00,000 రూపాయలు ఖర్చయ్యాయి. దీన్ని పూర్తిచేయడానికి 3 లేదా 4 సంవత్సరాలు పట్టింది.[13][14]

సమాధి మందిరం లోపల అక్బర్ యొక్క ప్రతీక సమాధి; సంప్రదాయం ప్రకారం అసలు సమాధి దీనికి క్రింద ఉంది

భారత వైస్రాయ్‌గా ఉన్నప్పుడు జార్జ్ కర్జన్ అక్బర్ సమాధి పునరుద్ధరణ, మరమ్మతులను విస్తృతంగా చేపట్టాడు. ఈ పనులు 1905లో పూర్తయ్యాయి. 1904లో ప్రాచీన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం ఆమోదానికి సంబంధించిన సందర్భంలో, కర్జన్ ఆగ్రాలోని ఈ సమాధి, ఇతర చారిత్రక కట్టడాల పునరుద్ధరణ గురించి చర్చించాడు. అప్పుడు ఈ ప్రాజెక్టును "గతానికి గౌరవార్పణగా, భవిష్యత్తుకు పునరుద్ధరించబడిన సౌందర్య బహుమతిగా" అభివర్ణించాడు. ఈ పరిరక్షణ కార్యక్రమం వల్ల యాత్రికులు, సమీప నివాసులు సమాధిని ఆరాధించే సంప్రదాయం తగ్గిపోయి ఉండవచ్చు.[15]

వాస్తుశిల్పం, అలంకరణ

[మార్చు]
అక్బర్ సమాధి ప్రక్క భాగం

దక్షిణ ద్వారం అత్యంత పెద్దది. దీనిపై నాలుగు తెల్లని పాలరాయితో నిర్మించిన ఛత్రిలతో కూడిన మినార్లు ఉన్నాయి. ఇవి తాజ్ మహల్లోని మినార్లను పోలి ఉంటాయి, వాటికంటే ముందుగా నిర్మించబడ్డాయి. ఇది సమాధికి సాధారణ ప్రవేశద్వారం. సమాధి చుట్టూ 105 మీటర్ల చదరపు విస్తీర్ణంలో గోడలతో కూడిన ప్రాకారం ఉంది. సమాధి నిర్మాణం నాలుగు అంతస్తుల పిరమిడ్ ఆకారంలో ఉండి, పైభాగంలో ప్రతీక సమాధి ఉన్న పాలరాయి మండపం ఉంది. ఇతర సమాధి మందిరాల మాదిరిగానే అసలు సమాధి భూగర్భ అంతస్తులో ఉంది.[16]

ఈ నిర్మాణాలు ప్రధానంగా గాఢ ఎరుపు ఇసుకరాయితో నిర్మించబడి, వాటిపై తెల్ల పాలరాయి అలంకరణలు ఉన్నాయి. నలుపు రంగు స్లేట్తో పాటు ఈ పదార్థాలతో చేసిన అలంకార ఇన్‌లే పలకలు సమాధి, ప్రధాన ద్వారాన్ని అలంకరిస్తాయి. ఈ అలంకరణల రూపకల్పనలో జ్యామితీయ, పుష్ప, కళిగ్రఫీ నమూనాలు కనిపిస్తాయి. ఇవి తరువాత ఇతిమాద్-ఉద్-దౌలా సమాధిలో మరింత సున్నితమైన, క్లిష్టమైన రూపకల్పనలకు పూర్వ రూపాలుగా నిలిచాయి.[17]

సమాధికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఇవి ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడి, పాలరాయి అలంకరణలతో ముస్తాబయ్యాయి. ప్రతి ద్వారం పైకప్పుపై నాలుగు చిన్న మండపాలు ఉన్నాయి. ఈ ద్వారాల వైభవం బులంద్ దర్వాజా ప్రభావంతో రూపుదిద్దుకుంది.[18]

సమాధి చుట్టూ ఉన్న ఉద్యానవనం దృశ్యం

మరియం-ఉజ్-జమాని, తన భర్త అక్బర్ మరణానంతరం, అతని సమాధి చుట్టూ విస్తారమైన ఉద్యానవనాన్ని నిర్మించింది. అక్కడ ముందుగా సికందర్ లోడి పాలనలో 1495లో నిర్మించబడిన ఓపెన్ బారాదరీ (విహార మండపం) ఉండేది.[5] 1623 మేలో ఆమె మరణించిన తర్వాత, ఆమెను తన భర్త సమాధి సమీపంలో సమాధి చేశారు. అనంతరం ఆమె కుమారుడు జహంగీర్ ఆ బారాదరీని అద్భుతమైన సమాధి మందిరంగా మార్చించాడు.[19] అక్బర్ సమీపంలో సమాధి చేయబడిన అతని ఏకైక భార్యగా ఆమె నిలిచింది.[20]

సమాధి మొదటి అంతస్తులో నాలుగు వైపులా ఖిలానాలతో కూడిన ప్రాకార మార్గాలు ఉన్నాయి. అక్కడ ఒక మందిరం ఉండి, అందులో అక్బర్ సమాధి శిలాఫలకం ఉంది. ఆ మందిరంలోనే అక్బర్ కుమార్తెలైన షకర్-ఉన్-నిస్సా బేగం, ఆరమ్ బాను బేగం సమాధి శిలాఫలకాలు కూడా ఉన్నాయి.[21][22]

సమాధి అపవిత్రీకరణ

[మార్చు]

1688 మార్చి 28న, ఔరంగజేబు పాలన సమయంలో, రాజా రామ్ జాట్ నాయకత్వంలో జాట్లు తిరుగుబాటు చేశారు. జాట్లు అక్బర్ సమాధిని దోచుకొని, అక్కడి బంగారం, ఆభరణాలు, వెండి, కార్పెట్లు మొదలైనవాటిని లూటీ చేయడంతో మొఘల్ ప్రతిష్ఠకు గట్టి దెబ్బ తగిలింది.[3] సమాధిని తెరిచి, అక్బర్ అవశేషాలను దహనం చేశారు.[23][24] ఈ విజయవంతమైన దాడికి ముందు 1685లో ఒక విఫలయత్నం జరిగింది. ఈ సంఘటన మొఘలులు, జాట్ల మధ్య సంఘర్షణను మరింత తీవ్రమయ్యేలా చేసింది.[25][26]

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Smith, Vincent Arthur (1917). Akbar the Great Mogul. Oxford, Clarendon Press. p. 58. ISBN 0895634716. ఒరిజినల్ నుండి 6 August 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2019. {{cite book}}: ISBN / Date incompatibility (help)
  2. Eraly, Abraham (2000). Emperors of the Peacock Throne, The Saga of the Great Mughals. Penguin Books India. p. 136. ISBN 0141001437.
  3. 1 2 Catherine Blanshard Asher, Catherine Ella Blanshard Asher, 1992, "Architecture of Mughal India - Part 1", Cambridge University Press, Volume 4, Page 108.
  4. Hindu Shah, Muhammad Qasim (1595–1612). Gulshan-I-Ibrahimi. Vol. 2. p. 143. Akbur, after this conquest, made a pilgrimage to Khwaja Moyin-ood-Deen Chishty at Ajmere and returned to Agra; from whence he proceeded to visit the venerable Sheikh Sulim Chishty, in the village of Seekry. As all the king's children had hitherto died, he solicited the Sheikh's prayers, who consoled him, by assuring him he would soon have a son, who would live to a good old age. Shortly after, his favourite sooltana, being then pregnant, on Wednesday the 17th of Rubbee-ool-Awul, in the year 997 was delivered of a son, who was called Sulim.
  5. 1 2 Aziz, Al (12 August 1905). Selections from the Native Newspapers Published in the United Provinces of Agra & Oudh. p. 262. JSTOR saoa.crl.25922623.
  6. Chandra, Satish (2005). Medieval India: from Sultanate to the Mughals (Revised ed.). New Delhi: Har-Anand Publications. pp. 111–112. ISBN 978-81-241-1066-9.
  7. Srivastava. A.l. (1957). A Short History Of The Akbar The Great. p. 22.
  8. Vogel, Dr. J. Ph. (1910). Annual Report Archaeological Survey Of India 1910-II. Superintendent Government Printing, Calcutta, India. p. 94.
  9. Smith, Edmund W. (1973). Mughal Architecture of Fatehpur Sikri. Vol. I. Delhi: Indological Book. p. 31.
  10. Lal, Muni (1980). Akbar.
  11. "Remembering Akbar the Great: Facts about the most liberal Mughal emperor". India Today.
  12. The Fatehpur Sikri Chronicles
  13. "The Tuzuk-i-Jahangiri; or, Memoirs of Jahangir. Translated by Alexander Rogers. Edited by Henry Beveridge".
  14. Havell, E. B. (Ernest Binfield) (1918). The history of Aryan rule in India from the earliest times to the death of Akbar. The Library of Congress. New York, Frederick A. Stokes company. p. 463.
  15. Rajagopalan, Mrinalini (Summer 2011). "From loot to trophy: the vexed history of architectural heritage in imperial India" (PDF). International Institute for Asian Studies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 January 2019.
  16. "Fascinating monuments, timeless tales". The Hindu. Chennai, India. 22 September 2003. the original నుండి 29 October 2003 న ఆర్కైవు చెయ్యబడింది.
  17. Akbar's Tomb Archived 2010-06-19 at the Wayback Machine Archnet.org.
  18. Akbar's Tomb Architecture of Mughal India, Part 1, Volume 4, by Catherine Ella Blanshard Asher. Cambridge University Press, 1992. ISBN 0-521-26728-5. p. 107.
  19. Mehta, J.L. (1981). Advance Study in the history of Medieval India. Vol. III. Sterling Publisher Private Limited. ISBN 8120704320. Bihari Mal gave rich dowry to his daughter and sent his son Bhagwan Das with a contingent of Rajput soldiers to escort his newly married sister to Agra as per Hindu custom. Akbar was deeply impressed by the highly dignified, sincere and princely conduct of his Rajput relations. He took Man Singh, the youthful son of Bhagwant Das into the royal service. Akbar was fascinated by the charm and accomplishments of his Rajput wife; he developed real love for her and raised her to the status of chief queen. She came to exercise a profound impact on the socio-cultural environment of the entire royal household and changed the lifestyle of Akbar. Salim (later Jahangir), the heir to the throne, was born of this wedlock on 30th August 1569.
  20. "Mariam's Tomb, Sikandara, Agra - Ticketed Monument - Archaeological Survey of India". Asi.nic.in. the original నుండి 16 September 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-12-08.
  21. Kanbo, Muhammad Saleh. Amal e Saleh al-Mausoom Ba Shahjahan Nama (Persian) - Volume 3. p. 117.
  22. Fazl, Abul. The Akbarnama. Vol. III. అనువాదకులు: Beveridge, Henry. Calcutta: ASIATIC SOCIETY OF BENGAL. p. 661. One of the occurrences was the birth of Ārām Bānū Begam.* On 12 Dai, 22 December 1584, divine month, and the 19th degree of Sagittarius, and according to the calculation of the Indians, one degree and 54 minutes, that night-gleaming jewel of fortune appeared, and glorified the harem of the Shāhinshāh.
  23. Edward James Rap; son, Sir Wolseley Haig and Sir Richard, 1937, "The Cambridge History of India", Cambridge University Press, Volume 4, pp.305.
  24. Waldemar Hansen, 1986, "The Peacock Throne: The Drama of Mogul India", Page 454.
  25. Manucci, Niccolao (2010). Mogul India (1653–1708): Or Storia Do Mogor. Low Price Publication.
  26. Dwivedi, Girish Chandra (1989). The Jats: Their Role in the Mughal Empire. Arnold Publishers. p. 36. ISBN 978-81-7031-150-8.

మరింత పఠనం

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

Media related to అక్బర్ సమాధి at Wikimedia Commons