Jump to content

అక్బర్ సలీమ్ అనార్కలి

వికీపీడియా నుండి
అక్బర్ సలీమ్ అనార్కలి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
నందమూరి బాలకృష్ణ,
దీప
సంగీతం సి.రామచంద్ర
నిర్మాణ సంస్థ తారకరామా ఫిల్మ్ యూనిట్
విడుదల తేదీ మే 9, 1978
భాష తెలుగు

అక్బర్ సలీమ్ అనార్కలి 1978లో విడుదలైన తెలుగుచిత్రం. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం. చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన (సంభాషణలు, పాటలు), సి.రామచంద్ర సంగీతం (హిందీ అనార్కలి సంగీత దర్శకులు), రఫీ నేపథ్యగానం (తారలెంతగా మెరిసేనో, సిపాయీ ఓ సిపాయీ, తానే మేలిముసుగు తీసి మొదలైనవి.)

సలీమ్, అనార్కలి యొక్క అద్భుత ప్రేమ కథ

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు - నందమూరి తారక రామారావు
  • నేపథ్య గానం : మహ్మద్ రఫి, యస్ పి బాలసుబ్రమణ్యం, పి సుశీల , వాణి జయరాం , ముస్తపా ఖాన్
  • సంగీతం: సి.రామచంద్ర
  • మాటలు, పాటలు: సి నారాయణ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: తారకరామాా ఫిలిం యూనిట్
  • విడుదల:09:05:1978 .

పాటలు

[మార్చు]

అక్బర్ సలీమ్ అనార్కలీకి సంగీత దర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు సి.రామచంద్ర వహించారు. ఇదే ఆయన సంగీత దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం.[1]

  1. కలుసుకున్న గుబులాయే కలవనున్న దిగులాయే, రచన : సింగిరెడ్డి నారాయణరెడ్డి ,గానం . మహమ్మద్ రఫీ, పులపాక సుశీల
  2. మదన మొహనుడే మదిలో ఒదిగే ఉన్నాడు కనరాడే , రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల , ముస్తాపా ఖాన్
  3. ప్రేమిస్తే తప్పంటారా పూలు పూచినా గాలి వీచినా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల
  4. రేయి ఆగిపోనీ రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహినీ ఇలా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల, మహమ్మద్ రఫీ
  5. సిపాయి ఒ సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో,రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల, మహమ్మద్ రఫీ
  6. తానే మేలిముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే, రచన: సి నారాయణ రెడ్డి, గానం. మహమ్మద్ రఫీ, పి సుశీల
  7. వెల యెరిగిన .. తారలేంతగా మెరిసేనూ చందురుని కోసం రేయీ ఎంతగా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. మహమ్మద్ రఫీ
  8. ఓ దేవా ఎందుకు ఎందుకు ఈ మౌనం,రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
  9. అందించుకొనా యవ్వనం అందించుకోనా యవ్వనం, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, వాణి జయరాం బృందం
  10. ఇది తండ్రీకొడుకుల నడుమ కేంద్రీకరించిన (సాకీ) రచన: సి నారాయణ రెడ్డి, గానం.మహమ్మద్ రఫీ కోరస్
  11. ఈమాయని గురుతు కోసం ఈగాయం,(సాకీ) రచన: సి నారాయణ రెడ్డి, గానం.మహమ్మద్ రఫీ.

మూలాలు

[మార్చు]
  1. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన

బయటి లంకెలు

[మార్చు]