అక్షరయాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరయాన్
Aksharayan Logo.jpg
అక్షరయాన్ లోగో
సంకేతాక్షరంటిడబ్ల్యూడబ్ల్యూఎఫ్
స్థాపన2019 జూలై 14 (2019-07-14) (2 సంవత్సరాల క్రితం)
కేంద్రీకరణసాహితీ, సామాజిక కార్యక్రమాలు
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాదు, తెలంగాణ
సేవా ప్రాంతాలుప్రపంచవ్యాప్తంగా
అధికారిక భాషతెలుగు
జాలగూడు‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌

అక్షరయాన్ (అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరం) తెలుగు రచయిత్రుల ఫోరం. వినూత్న సాహితీ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోన్న ఈ ఫోరంలో ప్రస్తుతం 700మంది రచయిత్రులు సభ్యులుగా ఉన్నారు. సమాజంలో మార్పు సాధించాలనే సంకల్పంతో ఒకవైపు సాహితీ సేవ చేస్తూ మరోవైపు ఈ సంస్థ తరపున ఆడవారికి అండగా నిలిచేలా అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు.[1]

‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రారంభం[మార్చు]

పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా 2019లో అక్షరయాన్ ఫోరం ఏర్పాటయింది. రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి నేతృత్వంలో 40 మంది సభ్యుల తెలుగు రచయిత్రుల సమూహంగా ఏర్పడిన ఈ ఫోరం తెలుగు రాష్ర్టాల్లోనేకాకుండా దేశ, విదేశాల్లోని తెలుగు రచయిత్రులకు వేదికగా నిలుస్తున్నది.[2] హైదరాబాదులోని రవీంద్రభారతిలో అక్షరయాన్‌ ప్రారంభ సమావేశం జరుగగా, 2019 జూలై 14న మొయినాబాద్‌లో 40మంది రచయిత్రులతో తొలి సాహితీ సదస్సు జరిగింది. 2021, జనవరి 15న అక్షరయాన్ వెబ్​సైట్​ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించింది.[3]

ఫోరం కార్యకలాపాలు[మార్చు]

 1. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ‘పసి మొగ్గలు’ పేరిట 20 మంది రచయిత్రులతో ఆకాశవాణి రేడియో ద్వారా కవి సమ్మేళనం నిర్వహించింది.
 2. 2019, అక్టోబరు 17న హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ విమెన్‌ వింగ్‌ కార్యాలయంలో 'భరోసా' ద్వారా అక్షరయాన్‌ రచయిత్రులు అత్యాచార బాధితులతో సమావేశమై, సొంత డబ్బుతో 6 కుట్టుమిషిన్లు ఇప్పించి, కుట్టుపనిలో వారికి తర్ఫీదు నిప్పించే ఏర్పాటు చేసింది.
 3. 2020, జనవరిలో కస్తూరిబా కళాశాలలో అతివలకు రక్షణ కవచంగా నిలుస్తున్న షి టీమ్స్ గొప్పదనాన్ని చాటుతూ 76 మంది రచయిత్రులు రాసిన కవితలను తెలంగాణ పోలీస్‌ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో 'హితై‘షి' పేరుతో ముద్రించింది.
 4. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్ర గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్తో బతుకమ్మ సంబురాలలో 100 మంది రచయిత్రులు పాల్గొని పుస్తకాలన్ని పేర్చి పుస్తక బతుకమ్మను పూలబతుకమ్మతో జత చేర్చి గవర్నర్ తో కలిసి తొలిసారిగా రచయిత్రులు బతుకమ్మను ఆడారు.
 5. 2020, డిసెంబరు 21వతేది రెడ్ హిల్స్ లోని ఫాప్సీ భవన్ లో దాదాపు 300 మంది రచయిత్రులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రచయిత్రులతో విత్తనంపై సాహితీ సదస్సు నిర్వహించి, విత్తనోత్పత్తి, ధ్రువీకరణ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ సాహితీ సదస్సులో వెల్లువెత్తిన కవితలను, కథలను 'బీజ స్వరాలు' పేరిట పుస్తక రూపంలో వెలువరించింది.
 6. తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్.టి.ఆర్ స్టేడియం) జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అక్షరయాన్ రచయిత్రులు రాసిన పుస్తకాలతో 204 నెంబరు స్టాలును ఏర్పాటు చేసింది.
 7. కరోనా 19పై శ్రీలక్ష్మి రాసిన కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్[4] అనే కవిత 2020, మార్చి 23న నమస్తే తెలంగాణ పత్రికలోని చెలిమె విభాగంలో ప్రచురితమయింది. ఆ కవితను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ లో స్వయంగా శ్రీలక్ష్మిని అభినందించడమేకాకుండా ఆరోజు జరిగిన పత్రికా సమావేశంలో ప్రశంసలు అందజేశాడు.[5] అక్షరయాన్ తరపున కరోనా పై 700లకు పైగా వీడియో కవితలని యూట్యూబులో అప్ లోడ్ చేశారు.
 8. 2020, నవంబరు 25న 'నింగిని గెలిచిన నేల' భరోసా కథల పుస్తకాన్ని జూమ్ మీటింగ్ ద్వారా అవిష్కరించారు.

మూలాలు[మార్చు]

 1. నమస్తే తెలంగాణ, జిందగీ (24 November 2020). "అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా." ntnews. Archived from the original on 24 November 2020. Retrieved 19 May 2021.
 2. Andhrajyothy (24 April 2021). "సమాజం కోసం అక్షరయాన్‌". Archived from the original on 5 మే 2021. Retrieved 19 May 2021. Check date values in: |archivedate= (help)
 3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (16 January 2021). "'అక్షరయాన్‌' వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కవిత". www.andhrajyothy.com. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
 4. గ్రేట్ తెలంగాణ, టాప్ స్టోరీస్ (26 March 2020). "ఈ కవిత కేసీఆర్‌ కూ నచ్ఛేసింది." Great Telangaana. Archived from the original on 26 February 2020. Retrieved 19 May 2021.
 5. సాక్షి, ఫ్యామిలీ (29 June 2020). "కవిత్వమూ కరోనా". Sakshi. Archived from the original on 7 August 2020. Retrieved 19 May 2021.

బయటి లంకెలు[మార్చు]