అక్షర తత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉపనిషత్తులును బ్రహ్మసూత్రములును పరమాత్మనే అక్షరునిగను బ్రహ్మముగను చెప్పును. కానీ గీతలో ఈ విషయమును రెండు విరుద్ధములుగా చూపెట్టును. గీతకారుడు ఉపనిషాదుల మతమును మొదటగా వివరించి అక్షరతత్త్వమునకు రెండవ స్థానము ఇచ్చెను.

భగవద్గీత-అక్షరతత్త్వం[మార్చు]

8వ అధ్యాయమున అక్షరతత్వము చెప్పబడినది. "అక్షరం బ్రహ్మపరమ్" అని మూడవ శ్లోకము.అక్షరము పరబ్రహ్మము (అనగా ఈ రెండును ఒకటి).నశించు స్వభావము కలది గాని మారు స్వభావము కలదికాని మారు స్వభావము కలదికాని క్షరమనబడును.క్షరము కానిదక్షరము.అక్షరమనగా అవ్యయము, అవినాశి. (మారినది, నశించనిది). 11వ శ్లోకమునందు అక్షర పరము. వేదవేత్తలు దేనిని అక్షరమని యందురో, వీతరాగులగు సన్యాసులెందు జొత్తురో, దేనిని కోరుకొరుచు బ్రహ్మచర్యము నడుపుదురో ,ఆపదమునకు నీకు నేను సంక్షేపముగా చెప్పుదురు.17, 18, 19వ శ్లోకములందు బ్రహ్మము యొక్క దినమును, రాత్రిని గురించియు, సృష్టిని ప్రళయమును గురించియు తెలుపబడెను.ప్రళయ కాలమున సమస్తమును అవ్యక్తమున లీనమగును.ఈ అవ్యక్తము ప్రకృతికే అక్షర బ్రహ్మము అని పేరు. అక్షరప్రాప్తి కలిగినచో పునరావృత్తి లేదు కావున అక్షరుడే పరమత్మ. ఈ అక్షరుడే పరమగతి.కావున అక్షరుని కంటె పైమెట్టులేదు.అక్షరుని పొందినచో తిరిగి పుట్టుక లేదు. అక్షరుడే పరమగతి.అక్షరుడే పరబ్రహ్మము, పరంపురుషుడు.11వ అధ్యాయమునందు అక్షర విషయమున రెండు శ్లోకములున్నవి. అర్జునుడు కృష్ణుని ఈవిధముగా సంబోధించుచున్నాడు: తెలిసికొనదగిన పరమాక్షరుడవు నీవు, నీవు ఈజగతి కాశ్రయుడవు, నీవు అవ్యయుడవు, నిత్యమగు ధర్మమునకు రక్షకుడవు, నీవు సనాతుడవగు పురుషుడవని నాఅభిప్రాయము. ఎవడు పరమాత్మో అతడే అక్షరుడు. సత-వ్యక్తము, అసత్- అవ్యక్తము. అక్షరుడు సత్తుకంటేను అసత్తుకంటేను శ్రేష్ఠుడు.కావున అక్షరుడే పరమాత్మ.

క్షరాక్షరవాదం[మార్చు]

మహాభారతమున కొన్ని శ్లోకములలో క్షరాక్షరతత్త్వము కలదు. క్షరమనియు అక్షరమనియు ఆత్మ రెండు తెగలు. భూతములందు క్షరము-దివ్యలోకమునందు అక్షరము.ఎవడు చరాచరములకు ప్రభువో, అచలుడో, వశియో అతడు తొమ్మిది గుమ్మములుగల నగరుచొచ్చి, అనగా మానవదేహమున ప్రవేశించి హంసయను పేరు దాల్చును.ఎవడు హంసయనబడు అక్షరుడో అతడే కూటస్థుడగు అక్షరుడు.జ్ఞానవంతుడీ అక్షరుని బడసి ప్రాణజన్మములను ఉత్తరించును.ఇచట కూటస్థుడు, అక్షరుడు, పరమాథయు ఒక్కడే. శాంతపర్వమునందు క్షరాక్షర తత్త్వము అద్వైత తత్త్వము.

బ్రహ్మ తత్త్వం[మార్చు]

ఆత్మతత్వము అక్షరతత్త్వమును ఆలోచించిన పిదప, బ్రహ్మతత్త్వమును గురించి ఆలోచించవలసిన పని ఉండదు. ఏలనగా ఆత్మయు అక్షరుడును బ్రహ్మమును ఏకమే. కాని గీతలో బ్రహ్మతత్త్వమనెడి మతబేధమున్నది. బ్రహ్మ విషయమున ముఖ్యాంశాలివి: దేనిని తెలిసినచో మోక్షము లభించునో అదియే బ్రహ్మము. దానిని ఎటు చూచినను కాలు చేతులు చెవులు కన్నులు మోము తలలు కలవు. అది యెల్లయు ఆవరించి లోకంధ్యమున వున్నది. దానికి అన్ని ఇంద్రియ ధర్మముల అభాసము కలదు. అయినను అది సకలేంద్రియ వివర్జితము.అది అసక్తము, అన్నిటిని భరించును, అది నిర్గుణము, అయినను గుణములను భోగించును.అది భూతముల లోపలను, బయాను కలదు. అది అచరమును చరమును.అతి సూక్ష్మమగుటచేత తెలియరానిది.అది దవ్వులను దాపులను కలదు.అది భూత గణముల నడుమ అవిభక్తముగా ఉన్నను విభక్తముగా ఉన్నటులు కనిపించును.తెలియదగిన ఆ వస్తువు భూతములను ఏలును,, దాని స్వభావము పుట్టుట.

మూలాలు[మార్చు]

1980 భారతి మాసపత్రిక: వ్యాసం: అక్షర తత్త్వము, వ్యాసకర్త: వేలూరి శివరామశాస్త్రి.