అక్షర హాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షర హాసన్
ఫిలింఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డులు 2016లో అక్షర హాసన్
జననం
అక్షర హాసన్

(1991-10-12) 1991 అక్టోబరు 12 (వయసు 32)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
తల్లిదండ్రులుకమల్ హాసన్
సారిక(నటి)

అక్షర హాసన్ (జననం 12 అక్టోబరు 1991), భారతీయ సినీ నటి, సహాయ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్, అతని మొదటి భార్య సారికల  రెండో కుమార్తె ఆమె. హిందీ  సినిమా షమితాబ్(2015)తో తెరంగేట్రం చేసింది అక్షర. ఆమె ప్రముఖ  నటి శృతి హాసన్ చెల్లెలు.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

12 అక్టోబరు 1991న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది అక్షర.  ఆమె తల్లిదండ్రులు ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్, నటి  సారికలు. ఆమె తండ్రి తమిళ అయ్యంగార్ కాగా, తల్లి మహారాష్ట్రీయురాలు.[1][2] ఆమె అక్క శృతి హాసన్ ప్రముఖ నటి. చెన్నైలోని అబాకస్ మాంటిస్సోరి స్కూల్, లేడీ ఆండాల్ లోనూ, ముంబైలోని బేకాన్ హై, బెంగుళూరులోని ఇండస్ అంతర్జాతీయ పాఠశాలలోనూ చదువుకుంది అక్షర. 

కెరీర్[మార్చు]

ఆమె తల్లి సారిక 2010లో రాహుల్ ఢోలకియా దర్శకత్వంలో  నటించిన సొసైటీ సినిమాకు సహాయ దర్శకురాలిగా పని చేసింది అక్షర.[3] ముంబైలో నిర్మించిన ఎన్నో యాడ్ ఫిలింలకు రాంమూర్తీ, ఉజెర్  ఖాన్, ఇ.నివాస్, రుచి నరైన్ వంటి దర్శకుల వద్ద సహాయ  దర్శకురాలిగా పనిచేసిందామె.[3] ఆమె సహాయ దర్శకురాలిగా పని చేసేటప్పుడు ఎన్నో సినిమాల్లో కథానాయికగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. అలా ఆమె నిరాకరించిన వాటిలో మణిరత్నం తీసిన కడలి సినిమా కూడా ఒకటి.[4]

ధనుష్ సరసన షమితాబ్ సినిమాలో కథానాయికగా ఆమె తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించాడు.[5][6][7][8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

2015లో తన తండ్రి కమల్ హాసన్, అక్క శృతి హాసన్లతో అక్షర.

తన తండ్రీ, తల్లీ ఆమె చిన్నప్పుడే విడిపోవడంతో అక్షర తన తల్లితో కలసి ముంబైలో జీవిస్తోంది.[9]

ఆమె సినిమాల్లో కొన్ని[మార్చు]

నటిగా
సంవత్సరం టైటిల్ భాష పాత్ర నోట్స్
2015 షమితాబ్ హిందీ అక్షర పాండే
2017 వివేగం తమిళం
లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా హిందీ పోస్ట్ ప్రొడక్షన్
సహాదర్శకురాలిగా
సంవత్సరం టైటిల్ భాష నోట్స్
2016 శభాష్ నాయుడు తమిళం
తెలుగు
హిందీ
చిత్రీకరణ దశలో ఉంది.[10]

మూలాలు[మార్చు]

  1. "Girl Interrupted". 13 July 2010. Retrieved 26 December 2016.
  2. Gupta, Priya (17 May 2013). "I get devastated at the idea of marriage: Shruti Haasan". Times of India. Retrieved 7 April 2014.
  3. 3.0 3.1 "Kamal Haasan's 'Vishwaroopam' will be released on October 12". CNN-IBN. Archived from the original on 12 మే 2014. Retrieved 9 May 2014.
  4. Reluctant actor Akshara Haasan gets to work : Bollywood, News - India Today.
  5. "I'm Working With Dhanush-Akshara Hassan: Amitabh Bachchan". tamilwire. 21 November 2013. Retrieved 28 January 2014.
  6. "Dhanush ecstatic to work with Amitabh Bachchan, Akshara Haasan in R. Balki's next". glamsham. 21 November 2013. Archived from the original on 23 జనవరి 2015. Retrieved 28 January 2014.
  7. "Akshara Haasan to make Bollywood debut opposite Dhanush". CNN-IBN. 12 November 2013. Archived from the original on 31 జనవరి 2015. Retrieved 28 January 2014.
  8. "IT'S OFFICIAL! Dhanush, Akshara, Big B In R Balki's Next". businessofcinema. 20 November 2013. Retrieved 28 January 2014.
  9. "Shruti Haasan's sister Akshara lives in Mumbai with mom". The Times of India. Retrieved 9 May 2014.
  10. "Kamal Haasan to work with daughters Shruti, Akshara in Sabaash Naidu". Hindustan Times. 2016-04-30. Retrieved 2016-05-20.