Jump to content

అఖిలేష్ పతి త్రిపాఠి

వికీపీడియా నుండి
అఖిలేష్ పతి త్రిపాఠి

పదవీ కాలం
2013 డిసెంబర్ 8 – 2025 ఫిబ్రవరి 8
ముందు కన్వర్ కరణ్ సింగ్
తరువాత అశోక్ గోయెల్
నియోజకవర్గం మోడల్ టౌన్

వ్యక్తిగత వివరాలు

జననం 1984 జనవరి 20
మెహదావాల్, కబీర్ నగర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం ఆజాద్‌పూర్‌, ఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

అఖిలేష్ పతి త్రిపాఠి ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఢిల్లీ శాసనసభకు మోడల్ టౌన్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అఖిలేష్ పతి త్రిపాఠి 1984 జనవరి 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా మెహదావాల్‌లో జన్మించాడు. ఆయన తండ్రి అభయ్ నందన్ త్రిపాఠి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు.

అఖిలేష్ పతి త్రిపాఠి మెహదావాల్‌లోని పాఠశాల విద్యను అభ్యసించి, అలహాబాద్‌లోని ఈసీసీ కళాశాల నుండి పట్టభద్రుడై, 2008లో ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) పూర్తి చేశాడు. ఆయన 26 ఏప్రిల్ 2016న ప్రతిమా త్రిపాఠి పాండేను వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

త్రిపాఠి 2009లో ఐఏఎస్ అధికారి కావాలనే ఆకాంక్షతో ఢిల్లీకి వెళ్లి ప్రిలిమినరీ, మెయిన్ ఐఏఎస్ పరీక్షలలో రెండుసార్లు ఉత్తీర్ణులయ్యారు కానీ ఇంటర్వ్యూ రౌండ్‌లో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

అఖిలేష్ పతి త్రిపాఠి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముండ్కా నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ గోయెల్ పై 7,875 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వివేక్ గార్గ్ పై 16,706 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

అఖిలేష్ పతి త్రిపాఠి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముండ్కా నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రాపై 11,133 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ గోయెల్ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Small-town man with IAS dreams becomes AAP winner". Hindustan Times. 10 December 2013. Archived from the original on 20 February 2015. Retrieved 20 February 2015.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  6. "Delhi Assembly Elections Results 2025 - Model Town" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  7. "Model Town Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.