అఖిల్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Akhil Kumar
Akhil Kumar at Jhalak Dikhla Jaa Bash
Akhil Kumar at Jhalak Dikhla Jaa Bash
జననం (1981-03-27) 1981 మార్చి 27 (వయస్సు: 37  సంవత్సరాలు)
భారతదేశం Faizabad, Uttar Pradesh, India [1]
నివాసంRohtak, Haryana, India
జాతీయతIndian
పౌరసత్వంIndian
వృత్తిBoxer Bantamweight
ఎత్తు168 cm (5 ft 6 in)
Medal record
Men's Boxing
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
Commonwealth Games
స్వర్ణము 2006 Melbourne Bantamweight
Asian Championships
కాంస్యము 2007 Ulan Bator Bantamweight

అఖిల్ కుమార్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్న భారతీయ బాక్సర్. అఖిల్ కుమార్ ‘ఓపెన్ గార్డెడ్’ బాక్సింగ్ స్టైల్లో సాధన చేసేవారు. అంతర్జాతీయ బాక్సింగ్ లో ఆయన సాధించిన విజయాలకు భారత ప్రభుత్వము 2005లో అర్జున అవార్డును ప్రధానం చేసింది. అర్జున అవార్డు అనేది క్రీడాకారులకు భారత ప్రభుత్వము ఇచ్చే అత్యున్నత గుర్తింపు.

1981 మార్చి 27న ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో అఖిల్ కుమార్ జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే ఆయన బాక్సింగ్ ను ప్రారంభించారు. హర్యానాలో ‘స్కూల్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ’తో ఆయన మొదటి యుద్ధం ప్రారంభమైంది.

క్రీడా జీవితం[మార్చు]

2004–2005[మార్చు]

చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన మొదటి ఎ.ఐ.బి.ఎ. ఆసియన్ 2004 ఒలింపిక్ అర్హత టోర్నమెంట్ లో రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఏథెన్స్ గేమ్స్ కు అర్హత సాధించారు. ఫైనల్ లో ఉజ్బెకిస్తాన్ కు చెందిన తులష్ బాయ్ దొనియోరొవ్ చేతిలో ఓడిపోయారు. 2004 ఒలింపిక్స్ లో జెరొమ్ థామస్ చేతిలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయారు.

2005లో స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన నాలుగవ కామన్ వెల్త్ ఫెడరేషన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ లో కుమార్ బంగారు పతకం సాధించారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన బొంగానీ మహలంగుని చాలా తక్కువ తేడా 54కేజీలో 18-17 తేడాతో ఓడించారు.[1]

2006 మెల్ బోర్న్ కామన్వెల్త్ గేమ్స్[మార్చు]

2006 కామన్వెల్త్ గేమ్స్ లో బాంటమ్ వెయిట్ 54 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. నైజీరియన్ అయిన నెస్టర్ బోలమ్ ని దాటి, ఫైనల్లో మారుటియన్ బ్రూనో జులీని ఓడించారు.

ఫైనల్ ప్రారంభ రౌండ్ లో సమాధానం చెప్పలేని ఆరు బ్లోస్ ని సాధించారు. రెండో రౌండ్ లో మామూలు తేడాతో అంటే 5-4 తో కుమార్ విజయం సాధించారు. మూడో రౌండ్ లో ఆయన కొంత మెరుగనిపించున్నారు. 6-4తో విజయము సాధించారు. కాని 3-4 తేడాతో ఫైనల్ రౌండ్ లో ఓడిపోయారు. సింగిల్ పంచ్ ని దూరం చేయడంతో, అది టైకి దారితీసింది.[2]

2008 బీజింగ్ ఒలింపిక్స్[మార్చు]

అందర్నీ వెనక్కు నెట్టి కుమార్ 2008 ఒలింపిక్ క్రీడలకు ఎంపికయ్యారు. 2004 వేసవి ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించారు. బ్యాంకాక్ లోని ఏసియన్ బాక్సింగ్ అర్హత టోర్నమెంట్ లో వరపోజ్ పెచ్ కూమ్ ని ఓడించారు. ఒలింపిక్ పోటీల్లో బాంటమ్ వెయిట్ 54 కేజీల విభాగంలో రెండో రౌండ్ లో ఫ్రెంచ్ దేశస్థుడు అలి హల్లాబ్ ని 12-5 పాయింట్ల తేడాతో ఓడించారు.[ఆధారం కోరబడింది]16వ రౌండ్ లో, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ సెర్గీ ఒడొప్యానవ్ తో వివాదం నెలకొంది. రెండో రౌండ్ లో 2-6 తేడాతో ఆడారు. నాలుగో రౌండు పూర్తయ్యేసరికీ ఇద్దరి స్కోరులు 9-9 తో సమమయ్యాయి. కాని న్యాయనిర్ణేతలు మాత్రం కుమార్ ను విజేతగా ప్రకటించారు. దీనికి కారణం ఆయన లెక్కలేనన్ని పంచ్ లు విసిరారు.[3] 2008, ఆగస్టు 18న జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాల్దోవాకు చెందిన వీసెస్లెవ్ గోజాన్ చేతిలో 3-10 తేడాతో ఓడిపోయారు.

పురస్కారాలు[మార్చు]

కుమార్ 2005లో అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.

1994–2004[మార్చు]

1999లో కుమార్ తొలిసారిగా అంతర్జాతీయ బాక్సింగ్ ఆడడం ప్రారంభించారు. జూనియర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, 6వ వై.ఎమ్.సి.ఎ.లో బంగారు పతకం సాధించారు. రష్యాలో 2001లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మరో బంగారుపతకాన్ని సాధించారు. 2003లో, ఫ్లైవెయిట్ విభాగంలో విలిటో ఎం పైలా (పీహెచ్ పీ) ను 20-16 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని సాధించారు. మూడు సార్లు ఉత్తమ బాక్సర్ గా పురస్కారాన్ని అందుకున్నారు. దీనికి అదనంగా 12 బంగారు పతకాలను కూడా సాధించారు. ఒక వెండి, నాలుగు రజత పతకాలను గెలిచారు.

2004–2006[మార్చు]

2004 ఒలింపిక్స్ లో మొదటి రౌండ్ లో జిరోమ్ థామస్ చేతిలో ఓడిపోయారు. 2005లో స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన 4వ కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ లో బంగారు పతకాన్ని సాధించారు. దక్షిణాఫ్రికాకు చెందిన బొంగానీ మహాలంగు చేతిలో 54 కేజీల విభాగంలో 18-17 అంటే చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. కుమార్ 2005లో అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.

2006 కామన్వెల్త్ గేమ్స్ లో బాంటమ్ వెయిట్ 54 కేజీల విభాగంలో ఆయనకు దగ్గరలో ఉన్న నైజీరియా దేశస్థుడు నెస్టర్ బొలమ్ ను మరియు ఫైనల్లో మారిషియన్ బ్రూనో జులీని ఓడించి బంగారు పతకాన్ని సాధించారు.

2008 బీజింగ్ ఒలింపిక్స్ మరియు ఎ.ఐ.బి.ఎ. ప్రపంచ కప్

అందర్నీ వెనక్కు నెట్టి కుమార్ 2008 ఒలింపిక్ క్రీడలకు ఎంపికయ్యారు. 2004 వేసవి ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించారు. బ్యాంకాక్ లోని ఏసియన్ బాక్సింగ్ అర్హత టోర్నమెంట్ లో వరపోజ్ పెచ్ కూమ్ ని ఓడించారు.

ఒలింపిక్ పోటీల్లో బాంటమ్ వెయిట్ 54 కేజీల విభాగంలో రెండో రౌండ్ లో ఫ్రెంచ్ దేశస్థుడు అలి హల్లాబ్ ని 12-5 పాయింట్ల తేడాతో ఓడించారు. 16వ రౌండ్ లో, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ సెర్గీ ఒడొప్యానవ్ తో వివాదం నెలకొంది. మ్యాచ్ లో రెండో రౌండ్ లో 2-6 తేడాతో ఆడారు. నాలుగో రౌండు పూర్తయ్యేసరికీ ఇద్దరి స్కోరులు 9-9 తో సమమయ్యాయి. కాని న్యాయనిర్ణేతలు మాత్రం కుమార్ ను విజేతగా ప్రకటించారు. దీనికి కారణం ఆయన లెక్కలేనన్ని పంచ్ లు విసిరారు. 2008, ఆగస్టు 18న జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాల్దోవాకు చెందిన వీసెస్లెవ్ గోజాన్ చేతిలో 3-10 తేడాతో ఓడిపోయారు.

మాస్కోలో 2008లో జరిగిన ఎ.ఐ.బి.ఎ. ప్రపంచకప్ పోటీలో క్వార్టర్ ఫైనల్స్ లో జర్మనీకి చెందిన మార్కెల్ షిండర్ ని కళ్లు చెదిరేలా 15-6 తేడాతో విజయం సాధించారు. సెమీఫైనల్లో ఆఖరి స్కోరు 4-4తో సమానమైంది. కానీ, ఈసారి న్యాయనిర్ణేతలు పురస్కరాన్ని కుమార్ ప్రత్యర్థికి ఇచ్చారు. కుమార్ కాంస్య పతకం గెలుచుకున్నారు[4]

సాధనలు[మార్చు]

పోటీలు జరిగిన వేదికలో కనపరచిన ప్రతిభ ఛాంపియన్స్ ఆఫ్ చాంపియన్ టోర్నమెంట్ ఫిబ్రవరి 2009, చైనా కాంస్యం

ప్రపంచ పురుషుల అమెచ్యుర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, మిలాన్, ఇటలీ, సెప్టెంబరు 2009, పాల్గొన్నారు.

ప్రపంచ కప్ 2008, మాస్కో, కాంస్యం

2008 బీజింగ్ ఒలింపిక్ బాక్సింగ్, చైనా, క్వార్టర్ ఫైనల్ కు వెళ్లారు.

బీజింగ్ ఒలింపిక్ బాక్సింగ్ కు అర్హత సాధించారు, ఫిబ్రవరి 2008 బ్యాంకాక్ లో బంగారు పతకాన్ని సాధించారు (ఉత్తమ బాక్సర్)

24వ సీనియర్ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, జూన్ 2007, మంగోలియా, కాంస్యం

15వ ఆసియన్ గేమ్స్, డిసెంబరు 2006, దోహా, పాల్గొన్నారు.

ఎస్.ఎ.ఎఫ్. గేమ్స్ డిసెంబరు 2006, కొలంబో, బంగారుపతకం

18వ కామన్వెల్త్ గేమ్స్, మార్చి 2006, మెల్ బోర్న్, బంగారుపతకం

13వ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, నవంబరు, 2005 చైనా, పాల్గొన్నారు

4వ కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, ఆగస్టు 2005 స్కాట్లాండ్, బంగారు పతకం

ఏథెన్స్ ఒలింపిక్స్, ఆగస్టు, 2004 ఏథెన్స్, పాల్గొన్నారు

ప్రి ఒలింపిక్స్, ఆగస్టు, మే 2004 ఏథెన్స్, కాంస్యం

చైనా యునికామ్’, మార్చి 2004(ఏథెన్స్ ఒలింపిక్ బాక్సింగ్ కు అర్హత), చైనా, వెండిపతకం

మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్, నవంబర్ 2003, హైదరాబాద్, బంగారుపతకం

3వ కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, సెప్టెంబర్ 2003, మలేసియా, కాంస్యం

12వ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, జూలై 2003, థాయ్ లాండ్, పాల్గొన్నారు.

సీనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, ఉజ్బెకిస్తాన్, బంగారుపతకం

2వ ఇడురాడో గార్సియా ప్రపంచ టోర్నమెంట్, జూన్ 2003, క్యూబా బంగారు పతకం ( ఉత్తమ బాక్సర్)

36వ గెరాల్డో కార్డొవా కార్డిన్ బాక్సింగ్ టోర్నమెంట్ , మే 2003, క్యూబా, పాల్గొన్నారు.

ఫెలీసియా స్టామ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ , ఏప్రిల్ 2002, పోలాండ్, పాల్గొన్నారు.

రెగట్టా బాక్సింగ్ ఛాంపియన్ షిప్, సెప్టెంబర్ 2002, సెచెల్లస్, బంగారుపతకం, (ఉత్తమ బాక్సర్)

21వ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, జూన్ 2002, మలేషియా, పాల్గొన్నారు

25వ కింగ్స్ కప్, ఏప్రిల్ 2002, థాయ్ లాండ్, పాల్గొన్నారు

ప్రొఫెసర్. డాక్టర్. అన్వర్ చౌదరి కప్, మార్చి 2002, అజేర్ బైజిన్ , పాల్గొన్నారు.

11వ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్, సెప్టెంబర్ 2002, రష్యా, బంగారుపతకం

4వ బ్రాండెన్ బర్గ్ కప్, ఆగస్టు 1999, జర్మనీ, కాంస్య పతకం

6వ వై.ఎమ్.సి.ఎ. ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ , మార్చి 1999 ఢిల్లీ గోల్డ్ (ref: http://www.akhilkumarboxer.com/achi.htm)


విజయం కోసం , “మీ ప్రత్యర్థిని చాలా గట్టిగా కొట్టాలి. కాని మీరు కూడా దెబ్బతింటే... విజయమో లేదా ఓటమో, రెండు నొప్పిగానే ఉంటాయి” అని కుమార్ చెప్పారు.

బాక్సింగ్ రింగ్ కు అవతల కుమార్ చాలా సాధారణ జీవితం గడుపుతారు. ప్రపంచంలో టాప్ బాంటమ్ వెయిట్ బాక్సర్ పై గెలవడం ద్వారా, కుమార్ భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయినప్పటికి తరువాతి మ్యాచ్ లో ఓడిపోయారు. ఆయన వైఖరి చాలామందిని ఆకట్టుకునేది, మనం నిద్రలో చూసినట్టుగా మాత్రం “కలలు ఉండవు' అని విజయం సాధించిన తరువాత చెప్పారు. అటువంటి కలలు మనల్ని నిద్ర నుంచి మేల్కోనివ్వవు.” (1) కార్వర్ట్ ఫైనల్స్ కుమార్ ఓడిపోయారు. కాని పేరుప్రఖ్యాతలు మాత్రం తగ్గలేదు. కొద్దివారాల తరువాత ఒలింపిక్ పోటీలు ముగింపు దశలో, ఓటమి తాలూకా నొప్పి ఇంకా తనను బాధిస్తుందని కుమార్ తెలిపారు. కాని ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం అలాగే ఉంది. మనిషి తనను తాను ఆరాధించుకోవాలి అని కుమార్ చెప్పారు. “నిజానికి నేను ఓడిపోయిన వ్యక్తిని, నేను బంగారు పతకాన్ని గెలవలేదు. ” అయినా, భారతీయ హృదయాలను గెలుచుకున్నారు అని కుమార్ చెప్పారు. కుమార్ చెప్పేదాని ప్రకారం, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్స్, వీటిలో బంగారు పతకం గెలవడం ద్వారానే పోయింది తిరిగి సంపాదించుకోగలం. “కేవలం ఒకే ఒక్క పతకం - అది బంగారు పతకం. ఇతరులు అదృష్టం మరియు ఏదైనా మహిమ వల్ల గెలుస్తారు.” అభినవ్ బింద్రా భారతదేశపు హీరో అనేది అయన చెప్పే ముఖ్య కారణాలలో ఒకటి. ఓడిపోయిన తరువాత మిగిలిన దానిగురించి సానుకూలంగా మాట్లాడుతూ, సమాచారానికి సంబంధించి నేను చాలా ఎంపికగా ఉంటాను. నా చుట్టుపక్కల ఉన్న సంస్థలు, ప్రజల నుంచి సేకరిస్తాను. అది చాలా తేడాను కలిగి ఉంటుంది.” కోరుకోని విషయాలను విడిచిపెట్టేసే సుగుణం తనకు ఉందని చెబుతారు. “స్ఫూర్తిదాయకమైన మరియు అంకితభావంతో ఉన్న కథలను చదవడానికి, చూడడానికి నేను ఇష్టపడతాను. నేను దేనినైనా ఆ మార్గంలో చూస్తాను” అంటారు కుమార్.

బాక్సింగ్ అనేది వ్యసనం లాంటిది అని ఫైజాబాద్ లో పుట్టిన ఈ అథ్లెట్ చెబుతారు. కాని వరుస సంఘటనల ప్రకారం: “గెలుపు కోసం మీ ప్రత్యర్థిని చాలా గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. కాని మీరు కూడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. విజయం లేదా ఓటమి రెండూ బాధతోనే వస్తాయి.” భారత ఖండంలో ఒక సీనియర్ బాక్సర్ గా, బాధలో ఉన్నా అఖిల్ తన గడ్డాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు: “నేను వెళ్లే క్రమంలో నాకు నేనుగా జూనియర్ కొలీగ్స్ ను చూస్తాను.” భారత బాక్సింగ్ చివరకు పతకాలు సాధించే దానిగా తయరైనందుకు ఆయన సంతోషిస్తారు. జితేందర్ మరియు విజేందర్ లాంటి యువ బాక్సర్లకు ఆయన చెప్పేది : “పతకాన్ని గెలవద్దు, దానిని సాధించించండి.” భారతదేశంలో బాక్సింగ్ అంటే కొత్త ఆసక్తి నెలకొంది. “మాలో చాలామంది వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, మేమెంత సమర్థులమో ఎవరికీ తెలియదు” అని కుమార్ చెబుతారు.

2012 లండన్ ఒలింపిక్స్ లో మహిళల బాక్సింగ్ ను కూడా చేర్చినందుకు కుమార్ చాలా సంతోషించారు. "మహిళల బాక్సింగ్ లో మనకు చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. లండన్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించగలరు... కాని మహిళలను చేర్చడానికి పురుషులకు సంబంధించి నాలుగు బంగారు పతకాల విభాగాలను కోల్పోతాం."

స్కోరింగ్ వ్యవస్థలో మార్పుల మీద కుమార్ ఆవేదన చెందుతున్నారు మరియు ఇది ఆటను సులభతరం చేసినా, అంత ఆకర్షణీయంగా మార్చలేకపోయిందని అన్నారు. "గతంలో మహామహుల స్టైల్ కు సంబంధంచి బాక్సింగ్ గుర్తుండేది. కాని, మార్పుల వల్ల ప్రతీ ఒక్కరు మ్యాచ్ లో వారి యొక్క గార్డుపై ఉండాల్సిందే."

షూటింగ్ ( బింద్రా) లో ట్రైల్ సిస్టమ్ వల్ల నెలకొన్న తాజా వివాదానికి సంబంధించి కుమార్ మాట్లాడినప్పుడు, ఇరు వర్గాల వారి వాదనలు వారి కారణాల ప్రకారం సరైనవే అని చెప్పారు. "ప్రయత్నాలు ఎప్పటికీ ముఖ్యమైనవే, ఇవి వెనుకబడిన క్రీడాకారులకి వాళ్ల ప్రతిభను చూపడానికి, జాతీయ జట్టులో చోటు సంపాదించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కాని, బింద్రాకు సంబంధించిన కారణం ప్రత్యేకమైనది. ఆయన ఒలింపిక్ ఛాంపియన్, అంతర్జాతీయ స్థాయిలో చాలా మంచి ప్రతిభ కనబరిచారు. అందువల్ల జట్టుకు సంబంధించి ఆయనను కాదనలేం."

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]


ఒక మంచి పంచ్ బాక్సర్ జీవితాన్ని మార్చగలదు : అఖిల్ కుమార్ ; హిజమ్ రాజు సింగ్, టిఎన్ ఎన్, 2010 ఫిబ్రవరి 11, 06.41 పీఎం ఐఎస్ టి ; http://timesofindia.indiatimes.com/sports/more-sports/boxing/One-good-punch-can-change-boxers-life-Akhil-Kumar/articleshow/5561242.cms

మూస:Footer Commonwealth Champions Bantamweight