అఖిల్ గొగోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అఖిల్ గొగోయ్
Akhil Gogoi by Vikramjit Kakati.jpg
జననం
అఖిల్ గొగోయ్

1975
నిజారాపర్, గువహాటి, అస్సాం రాష్ట్రం
జాతీయత భారతదేశం
సంస్థక్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్)
భారత అవినీతి వ్యతిరేక ఉద్యమం
సమాచార హక్కు చట్టం కార్యకర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అవినీతి వ్యతిరేక పోరాటం
సీఏఏ వ్యతిరేక ఉద్యమం
సమాచార హక్కు చట్టం కార్యకర్త
రాజకీయ పార్టీరైజోర్ దళ్ , గణ ముక్తి సంగ్రామ్ అసోం
ఉద్యమం2011 భారత అవినీతి వ్యతిరేక ఉద్యమం
జీవిత భాగస్వామిగీతాశ్రీ తములై
తల్లిదండ్రులుప్రియదా గొగోయ్ (తల్లి) , కి.శే.బోలురామ్ గొగోయ్

అఖిల్‌ గొగోయ్‌ అస్సాం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రైతు నాయకుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త . ఆయన 2021 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]ఆయన శాసనసభ్యుడిగా 21 మే 2021న ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

జననం & విద్యాభాస్యం[మార్చు]

అఖిల్ గొగోయ్ 1975లో అస్సాంలో జన్మించాడు. ఆయన గువహాటిలోని కాటన్ కాలేజి నుంచి 1996లో పట్టభద్రుడయ్యాడు. 1990 నాటి నుంచి సోషియో పొలిటిక్ ఆర్గనైజేషన్ లో సభ్యుడిగా, సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) తో కలిసి పనిచేస్తున్నాడు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌‌ను అరెస్ట్ చేశారు.[4] అఖిల్ గొగోయ్ 2020 అక్టోబరులో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్‌ను స్థాపించాడు. ఆయన 2021 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొంది, ఎమ్మెల్యే అయ్యాడు.[5][6][7]అఖిల్‌ తరఫున అతని తల్లి ప్రియదా గొగోయ్‌ (85) ప్రచారం చేసింది.[8]

2011 అవినీతి వ్యతిరేక ఉద్యమం[మార్చు]

అఖిల్‌ గొగోయ్‌ 2011 మే 20లో గువాహటిలో 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టాడు.ఈ ఉద్యమానికి అన్న హజారే, స్వామి అగ్నివేశ్ మరియు కిరణ్ బేడీ పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు. [9]

మూలాలు[మార్చు]

  1. Sakshi (3 మే 2021). "తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి". Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.
  2. TV9 Telugu (3 మే 2021). "అస్సాం ఎన్నికలు, జైల్లో ఉన్నా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై గెలిచాడు, ప్రచారం చేసిందెవరో మరి ? - jailed activist akhil gogoi wins polls in assam sivasagar constituency". TV9 Telugu. Archived from the original on 5 మే 2021. Retrieved 5 మే 2021.
  3. Namasthe Telangana (21 మే 2021). "జైలు నుంచి వ‌చ్చి ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం". Namasthe Telangana. Archived from the original on 21 మే 2021. Retrieved 21 మే 2021.
  4. TheQuint (15 సెప్టెంబరు 2017). "Activist for Many Causes: Akhil Gogoi Now Arrested for Sedition". Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.
  5. Andhrajyothy (3 మే 2021). "అసోం: జైలు నుంచే జయభేరి మోగించిన అఖిల్ గొగోయ్!". Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.
  6. 10TV (3 మే 2021). "Akhil Gogoi: రెండేళ్లుగా జైలులో ఉంటూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన అఖిల్ గోగొయ్ | Akhil Gogoi wins Sibsagar from jail" (in telugu). Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. Sakshi (4 మే 2021). "Akhil Gogoi: జైలు నుంచి అసెంబ్లీకి." Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.
  8. Sakshi (5 మే 2021). "Assam: కొడుకు బెయిల్‌ కోసం ఎన్నికల్లో గెలిపించిన తల్లి". Archived from the original on 5 మే 2021. Retrieved 5 మే 2021.
  9. India Today (7 జూలై 2012). "Who is Akhil Gogoi?". Archived from the original on 4 మే 2021. Retrieved 4 మే 2021.