Jump to content

అఖిల భారతీయ బంజారా సేవా సంఘం

వికీపీడియా నుండి

అఖిల భారతీయ బంజారా సేవా సంఘం
(AIBSS)
స్థాపన1953 జనవరి 30 (73 సంవత్సరాల క్రితం) (1953-01-30)
రకంబంజారా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ (Banjara Community organisation)
చట్టబద్ధతActive
కేంద్రీకరణబంజారా సమాజ సంక్షేమ కోసం
ప్రధాన
కార్యాలయాలు
ముంబై 295-1999/ GBBSD&F-21647,భారతదేశం, దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధాని నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది.
సేవా ప్రాంతాలుభారతదేశం
National President తొలి అధ్యక్షుడుఉత్తమరావు రాథోడ్ (మాజీ పార్లమెంటు సభ్యుడు హింగోలి లోక్ సభ)
National General Secretary తొలి ప్రధాన కార్యదర్శిఆడే‌ ప్రతాప్ సింగ్
తొలి గౌరవ అధ్యక్షుడువసంత్‌రావ్ నాయిక్ (మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర)
మాతృ సంస్థబంజారా సేవా సంఘం (BSS)
సిబ్బంది రామ్ సింగ్ భానావత్ (తొలి బంజారా పద్మశ్రీ), ముడ్ రంజిత్ నాయక్, స్వామి నాయక్, ప్రకాశ్ సింగ్ రాథోడ్,రాజు నాయక్,పుజారీ ముడ్ చంద్రకళ,డి. రవీంద్ర నాయక్,అమర్ సింగ్ తిలావత్,

అఖిల భారతీయ బంజారా సేవా సంఘం అనేది ఒక బంజారా సముహపు జాతీయ వాద సంస్థ.All Indian Banjara Seva Sangh (AIBSS) 30 జనవరి 1953లో స్థాపించబడింది. ఇది భారతదేశం లోని పురాతన సంస్థలలో ఒకటి. దేశంలోని గోర్ బంజారా, లంబాడీ, సుగాలీ, లమ్మాని, గిరిజనుల, దళితుల సామాజిక వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న సంఘం[1][2][3].

చరిత్ర

[మార్చు]

1952లో అఖిల భారతీయ బంజారా సేవా సంఘం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా డిగ్రీస్ తాలుకా లోని ఒక ప్రైవేటు వసతి గృహంలో చదువుతున్న బంజారా విద్యార్థులు కలిసి విద్యార్థి సంఘం నాయకుడైన ఆడే ప్రతాప్ సింగ్ నాయకత్వంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక సంవత్సరం కాలం పని చేసిన ఈ సంఘాన్ని ఆడే ప్రతాప్ సింగ్ అఖిల భారతీయ బంజారా సేవా సంఘం లో విలీనం చేశారు. ఆ తర్వాత అఖిల భారతీయ బంజారా సేవా సంఘం 30 జనవరి 1953 లో మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లా లోని డిగ్రేశ్ తాలుకా లో దేశ నలుమూలల నుండి వచ్చిన బంజారాలు తొలి సారిగా రెండు రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు . అనంతరం దేశంలోని బంజారా ప్రముఖుల సూచనలు సలహాలు పాటిస్తూ అఖిల భారతీయ బంజారా సేవా సంఘాన్ని స్థాపించారు.

ఈ సంఘానికి మహారాష్ట్ర లోని మాండ్వి గ్రామం కిన్వట్ తాలుకా నాందేడ్ జిల్లాకు చెందిన తొలి బంజారా హింగోలీ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు ఉత్తమరావు బలిరాం రాథోడ్ ని సంఘం తొలి అధ్యక్షుడిగా, ఆడే ప్రతాప్ సింగ్ ని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు. బంజారా సమాజ ముఖ్యులు 1952లో తొలిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన బంజారా తొలి శాసన సభ్యులు, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రివర్యులు వసంత్‌రావ్ నాయిక్ అధ్యక్షతన జరిగిన సభలో తొలి బంజారా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సింగ్ భానావత్ గౌరవ సలహాదారుల నాయకత్వంలో బంజారా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఉద్దేశ్యం

[మార్చు]

బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల హక్కులు, సంక్షేమం, కోసం పాటుపడి వారి రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ. ఇది దేశ వ్యాప్తంగా బంజారాల పై జరుగుతున్న అన్యాయాన్ని, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంఘానికి బలోపేతం చేయడం. జాతి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించడం. వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం[4].

ఏ.ఐ.బి.ఎస్.ఎస్ అధినేతలుగా పనిచేసినవారు

[మార్చు]

తిర్మానాలు

[మార్చు]

1) భూరియా కమిటీ నివేదికను మైదాన ప్రాంతపు బంజారా,తాండ లకు వర్తింపజేయాలి. 100 మంది జనాభా గల తాండ ను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి.బంజారాలను మధ్య దళారులనుండి పూర్తి రక్షణ కల్పించాలి.

2) బంజారా , లంబాడీ గిరిజనులపై పోలీసుల ఎక్సైజ్ అధికారులు,అటవిశాఖ అధికారుల దాడులు దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలి.

3) ప్రతి బంజారా తాండ కు రోడ్డు, ఆరోగ్యం, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలి.

4) మైదాన ప్రాంతపు బంజారా, లంబాడీలకు ప్రతి మండల కేంద్రమునందు 5 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలు కళాశాలలు ఏర్పాటు చేయాలి.

5) బంజారా లంబాడీ గిరిజనులకు 100 శాతం సబ్సిడీపై బావులు, బోర్వెల్స మంజూరు చేసి త్రవ్వించాలి. ఎలక్ట్రానిక్ మోటార్లు సమకూర్చాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు బంజారా లంబాడీ రైతులకు ఉచితముగా అందించాలి.

6) విద్యావంతులైన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు పరిశ్రమలు స్థాపించి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలి.

7) మైదానం ప్రాంతపు గిరిజన బంజారా లంబాడీలకు వారి అభివృద్ధి కై ప్రత్యేకమైన ఆర్ధిక సహకార సంస్థ ఏర్పాటు చేయాలి.

8) బంజారా లంబాడీ గిరిజన ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి[5].

9) విద్యావంతులైన బంజారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కేంద్రం కల్పించే ఏడున్నర శాతం రాష్ట్రం యొక్క 6 శాతం ఖాళీలను బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

10) రాష్ట్రంలో వసతిగృహాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులను కించపరిచే, అవమానం పరిచే ఇతర ఉద్యోగస్తులను శిక్షించాలి.

11) బంజారా లంబాడీల బంజారా భాష - (గోర్ బోలి) ని రాజ్యాంగములోని 8వ షెడ్యూల్ ఆధారంగా గుర్తించాలి.

12) దేశంలోని నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యమంలో చలామణి అవుతూ బంజారా హక్కులను కాలరాస్తున్న వారిని గుర్తించి శిక్షించాలి.

13) వివిధ విద్యా సంస్థలో విద్యనభ్యసిస్తున్న బంజారా లంబాడీ సుగాలీ లమ్మాని గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని కమిటీ తీర్మానించింది.

14) ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆసక్తి కనబరిచే ఉద్యోగులకు అవకాశం కల్పించాలి.

మూలాలు

[మార్చు]
  1. ↑ "ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు..." udyamatelangana.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 మే 2025. Retrieved 14 మే 2025.
  2. ↑ "Banjaras want case booked against Bellampalli MLA". The Hindu (in Indian English). 16 అక్టోబరు 2015. ISSN 0971-751X. Retrieved 6 మే 2025.
  3. ↑ India, The Hans (25 ఆగస్టు 2024). "Banjara Seva Sangh appeals to CM to solve their problems". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 6 మే 2025.
  4. ↑ India, The Hans (25 ఆగస్టు 2024). "Banjara Seva Sangh appeals to CM to solve their problems". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 6 మే 2025.
  5. ↑ Bureau, The Hindu (3 ఏప్రిల్ 2023). "Akhil Bharat Banjara Seva Sangh opposes internal reservation". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 6 మే 2025. {{cite news}}: |last= has generic name (help)