Jump to content

అఖిల భారత మహిళా కాంగ్రెస్

వికీపీడియా నుండి
అఖిల భారత మహిళా కాంగ్రెస్
సంకేతాక్షరంAIMC
స్థాపన15 సెప్టెంబర్ 1984
వ్యవస్థాపకులుsసుచేతా కృపలానీ,
భారత జాతీయ కాంగ్రెస్
Extinctiony
ప్రధాన
కార్యాలయాలు
24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110001
జాతీయ అధ్యక్షురాలునెట్టా డిసౌజా
జాతీయ కార్యదర్శిఐశ్వర్య మహదేవ్
మాతృ సంస్థభారత జాతీయ కాంగ్రెస్
జాలగూడుwww.aimc.in[dead link]

అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఆంగ్లం: All India Mahila Congress) దీనిని మహిళా కాంగ్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది భారత జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీ మహిళా విభాగం.[1] 2021 ఆగస్టు 17న ఎఐఎంసి తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టా డిసౌజా (Netta D'Souza) ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారు. [2]

చరిత్ర

[మార్చు]

1984లో బెంగళూరులో జరిగిన ఒక సదస్సుతో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లతో పాటు 30 వేల పై చిలుకు ప్రతినిధులు హాజరైయ్యారు.[3]

ఆర్గనైజేషన్

[మార్చు]

అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రాంతీయ శాఖలుగా విభజించబడింది. ఇది భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎఐఎంసికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[4] ఇది ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ (రాష్ట్ర మహిళా కాంగ్రెస్) గా పేర్కొనబడింది. ఎ.ఐ.ఎం.సి.సి.లో భారత జాతీయ కాంగ్రెస్ కార్డు కలిగి ఉన్న మహిళా సభ్యులు ఉంటారు. ఇది కార్యనిర్వాహక కమిటీని, ప్రతి పి.ఎం.సి.సి రాష్ట్ర అధ్యక్షురాలిని ఎన్నుకుంటుంది.[5]

అధ్యక్షుల జాబితా

[మార్చు]
అధ్యక్షురాలు పదవీకాలం
బేగం అబిదా అహ్మద్ 1983–1988
జయంతి పట్నాయక్ 1988–1990[6]
కుముద్బెన్ జోషి 1990–1993
గిరిజా వ్యాస్ 1993–1998
అంబికా సోనీ 1998–1999
చంద్రేష్ కుమారి కటోచ్ 1999–2003
రీటా బహుగుణ జోషి 2003–2008
ప్రభా ఠాకూర్ 2008–2011
అనితా వర్మ 2011–2013
శోభా ఓజా 2013–2017
సుస్మితా దేవ్ 2017–2021[7]
నెట్టా డిసౌజా ప్రస్తుతం

ప్రధాన కార్యదర్శి

[మార్చు]

సినీ నటి నగ్మా 2015 అక్టోబరులో కార్యాలయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.[8] 2019 జనవరిలో ఐఎన్సి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్సర రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్సర రెడ్డి ఎఐఎంసిలో మొదటి ట్రాన్స్జెండర్ అధికారిగా గుర్తించబడ్డారు.[9] 2020 మార్చిలో ఐశ్వర్య మహదేవ్ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టులో నేతా డిసౌజా జాతీయ అధ్యక్ష పదవిలో నియమితులయ్యారు.[10]

ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీల జాబితా

[మార్చు]
పి.ఎం.సి.సి ప్రెసిడెంట్
అండమాన్ నికోబార్ దీవులు TMCC
ఆంధ్రప్రదేశ్ PMCC కె. ప్రమీలమ్మ
అరుణాచల్ ప్రదేశ్ PMCC
Assam PMCC
బీహార్ PMCC
చండీగఢ్ TMCC దీపా అస్ధీర్ దూబే
ఛత్తీస్‌గఢ్ PMCC ఫూలో దేవి నేతమ్
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ TMCC
ఢిల్లీ PMCC అమృత ధావన్
గోవా PMCC
గుజరాత్ PMCC
హర్యానా PMCC సుమిత్రా చౌహాన్
హిమాచల్ ప్రదేశ్ PMCC
జమ్మూ కాశ్మీర్ PMCC
జార్ఖండ్ PMCC
కర్ణాటక PMCC
కేరళ PMCC జెబి మాథర్
లడఖ్ TMCC
లక్షద్వీప్ TMCC
మధ్యప్రదేశ్ PMCC మాండవీ చౌహాన్
మహారాష్ట్ర PMCC చారులత టోకాస్
మణిపూర్ PMCC
మేఘాలయ PMCC
మిజోరం PMCC
ముంబై RMCC అనీషా బగుల్
నాగాలాండ్ PMCC
ఒడిశా PMCC బందిత పరిదా
పుదుచ్చేరి PMCC
పంజాబ్ PMCC బల్వీర్ సోధి (రాణి)
రాజస్థాన్ PMCC రెహనా రాయజ్ చిస్తీ
సిక్కిం PMCC
తమిళనాడు PMCC
తెలంగాణ PMCC సునీత రావు
త్రిపుర PMCC
ఉత్తరాఖండ్ PMCC సరిత ఆర్య
ఉత్తర ప్రదేశ్ PMCC
పశ్చిమ బెంగాల్ PMCC

మూలాలు

[మార్చు]
  1. Singh (2003), p. 69.
  2. The New Indian Express (2019).
  3. Badhwar (2014).
  4. Kumar (1990), pp. 48–49.
  5. AICC (2013).
  6. PoI (2014).
  7. "Sushmita Dev, Who Backed CAA, Quits Cong; Kapil Sibal Says 'Party Moves on with Eyes Wide Open'". News18. 16 August 2021.
  8. PTI (2015).
  9. Newsd (2019).
  10. CTBUREAU NTB (2020).