Jump to content

అగట్టి ద్వీపం

వికీపీడియా నుండి
అగట్టి
అగట్టి విమానాశ్రయం
అగట్టి is located in India
అగట్టి
అగట్టి
లక్షద్వీప్‌లో అగట్టి అటాల్ స్థానం
భూగోళశాస్త్రం
ప్రదేశంఅరేబియా సముద్రం
అక్షాంశ,రేఖాంశాలు10°51′N 72°11′E / 10.85°N 72.19°E / 10.85; 72.19
రకంఅటాల్
ద్వీపసమూహంలక్షద్వీప్
ప్రక్కన గల జలాశయాలుహిందూ మహాసముద్రం
మొత్తం ద్వీపాలు2
ముఖ్యమైన ద్వీపాలు
విస్తీర్ణం3.226 km2 (1.246 sq mi)[1]
పొడవు7.6 km (4.72 mi)
వెడల్పు0.85 km (0.528 mi)
తీరరేఖ17 km (10.6 mi)
అత్యధిక ఎత్తు2 m (7 ft)
నిర్వహణ
ప్రాంతంలక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం
జిల్లాలక్షద్వీప్
ద్వీపాల సమూహంలక్కదీవ్ దీవులు
తహసీల్కవరత్తి
ఉపవిభాగంఅగట్టి ద్వీపం
అతిపెద్ద ప్రాంతముఅగట్టి (pop. 7500)
జనాభా వివరాలు
జనాభా7700 (2014)
జన సాంద్రత2,386 /km2 (6,180 /sq mi)
జాతి సమూహాలుమలయాళీలు, మాల్ ప్రజలు
అదనపు సమాచారం
సమయం జోన్
పిన్ (PIN)682553
టెలిఫోన్ కోడ్04894
ISO కోడ్IN-LD-06[2]
అక్షరాస్యత84.4%
సగటు వేసవి ఉష్ణోగ్రత32.0 °C (89.6 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత28.0 °C (82.4 °F)
లింగ నిష్పత్తి1.059/

 

అగట్టి ద్వీపం 7.6 కి.మీ. పొడవైన ద్వీపం, ఇది భారతదేశం, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలోని అగట్టి అటాల్ అనే పగడపు అటాల్‌పై ఉంది. ఇది కొచ్చి నగరానికి పశ్చిమాన 459 కి.మీ. దూరంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

అగట్టి ప్రధాన భూభాగంలోని కన్నూర్ నుండి 364 కి.మీ., కోజికోడ్ నుండి 394 కి.మీ., కొచ్చి నుండి 459 కి.మీ. (285 మైళ్లు) దూరంలో, సమీప ద్వీపమైన బంగారం నుండి నైరుతి దిశలో 7 కి.మీ. దూరంలో ఉంది. అగట్టి కొల్లం నుండి 531 కి.మీ., కొల్లం ఓడరేవు నుండి 529 కి.మీ. దూరంలో ఉంది.[3] సమీపంలో జనావాసాలు ఉన్న ద్వీపం కవరత్తి ఆగ్నేయంగా 54 కి.మీ. దూరంలో, సుహేలి పర్ అటాల్ దక్షిణాన 76 కి.మీ. దూరంలో ఉన్నాయి. అగట్టి అటాల్ మొత్తం భూభాగం 3.226 చ.కి.మీ. (దీనిలో ప్రధాన ద్వీపం 3.141 చ.కి.మీ., చిన్నదైన కల్పట్టి ద్వీపం 0.085 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి). కల్పట్టి ఇదే పగడపు దిబ్బ దక్షిణ కొనలో ఉంది.[4] సరస్సు (మడుగు) వైశాల్యం 24.84 చ.కి.మీ.

శీతోష్ణస్థితి

[మార్చు]
Climate data for అగట్టి ద్వీపం (అగట్టి విమానాశ్రయం) 1991–2020, తీవ్రతలు 1996–2012
Month Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec Year
Record high °C (°F) 35.3
(95.5)
35.3
(95.5)
38.0
(100.4)
37.8
(100.0)
37.0
(98.6)
37.8
(100.0)
32.7
(90.9)
34.8
(94.6)
33.3
(91.9)
35.0
(95.0)
35.0
(95.0)
36.3
(97.3)
38.0
(100.4)
Mean daily maximum °C (°F) 31.2
(88.2)
31.5
(88.7)
32.4
(90.3)
33.2
(91.8)
33.0
(91.4)
31.3
(88.3)
30.6
(87.1)
30.6
(87.1)
30.6
(87.1)
31.0
(87.8)
31.5
(88.7)
31.4
(88.5)
31.5
(88.7)
Mean daily minimum °C (°F) 25.8
(78.4)
26.0
(78.8)
26.9
(80.4)
28.0
(82.4)
27.8
(82.0)
26.0
(78.8)
25.8
(78.4)
25.7
(78.3)
25.7
(78.3)
26.1
(79.0)
26.3
(79.3)
26.1
(79.0)
26.4
(79.5)
Record low °C (°F) 22.5
(72.5)
23.5
(74.3)
24.2
(75.6)
23.2
(73.8)
22.1
(71.8)
22.3
(72.1)
22.7
(72.9)
22.5
(72.5)
22.7
(72.9)
22.2
(72.0)
22.1
(71.8)
22.8
(73.0)
22.1
(71.8)
Average rainfall mm (inches) 11.0
(0.43)
3.4
(0.13)
5.6
(0.22)
8.0
(0.31)
155.9
(6.14)
340.1
(13.39)
315.3
(12.41)
229.3
(9.03)
172.4
(6.79)
167.4
(6.59)
95.8
(3.77)
68.7
(2.70)
1,572.9
(61.93)
Average rainy days 0.7 0.2 0.6 0.9 6.0 16.1 15.5 12.8 10.6 9.4 5.0 2.8 80.4
Average relative humidity (%) (at 17:30 IST) 69 69 68 68 71 80 80 79 78 76 75 71 74
Source: భారత వాతావరణ శాఖ (India Meteorological Department)[5][6]

జనాభా

[మార్చు]

అగట్టి ద్వీపంలో మతాలు (2011)[7]

  ఇస్లాం (96.8%)
  చెప్పనివారు (0.24%)

2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 7,560, ఇస్లాం ద్వీపవాసుల ప్రధాన మతం.[8] అరబ్ యాత్రికుడు ఇబ్న్ బటూటా ఇస్లామిక్ మతాన్ని తీసుకువచ్చాడని చెబుతారు. చాలా మంది ప్రజలు మలయాళం, ఆంగ్లం, తమిళం మాట్లాడతారు. అగట్టి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఇంధనాన్ని ఉపయోగించే సొంత 100 kW పవర్‌హౌస్‌ను కలిగి ఉంది. ద్వీపవాసులకు లవణాలు తొలగించిన నీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్ ఉంది.

రవాణా

[మార్చు]

సముద్ర మార్గం

[మార్చు]

లక్షద్వీప్ సముద్ర మార్గం ద్వారా కొచ్చికి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు ఓడరేవుల మధ్య ఏడు ప్రయాణీకుల ఓడలు నడుస్తాయి, ప్రయాణానికి 14–20 గంటల సమయం పడుతుంది.[9]

వాయు మార్గం

[మార్చు]

1400 మీటర్ల అగట్టి విమానాశ్రయం (IATA: AGX, ICAO: VOAT) లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం.[10][11]

పర్యాటకం

[మార్చు]

పర్యాటకానికి అనుమతించబడిన లక్షద్వీప్ దీవులలో అగట్టి ఒకటి. అయితే, సందర్శకులు కొన్ని ఆంక్షల కింద ద్వీపంలోకి అనుమతించబడతారు. ద్వీపంలోకి ప్రవేశించడానికి లేదా సందర్శించడానికి వారు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రవేశ అనుమతి (ఎంట్రీ పర్మిట్) పొందాలి. సందర్శకులకు బస చేయడానికి ధృవీకరించబడిన ప్రదేశం ఉన్న ప్రాతిపదికన ప్రవేశ అనుమతి జారీ చేయబడుతుంది. అగట్టిలో కేవలం రెండు హోటళ్లు లేదా రిసార్ట్‌లు మాత్రమే ఉన్నాయి: అగట్టి ఐలాండ్ బీచ్ రిసార్ట్ (AIBER)[12], మరొకటి సీ షెల్స్ బీచ్ రిసార్ట్.[13][14] ద్వీపం గుండా ఒక రహదారి వెళుతుంది, ఇక్కడ అనేక ప్రదేశాలలో సైకిల్ అద్దెకు తీసుకుని ఆనందించవచ్చు.

అగట్టిలో స్కూబా డైవింగ్

స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్కెలింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కానోయింగ్, వాటర్ స్కీయింగ్, స్పోర్ట్ ఫిషింగ్, యాచింగ్, రాత్రి పూట సముద్ర ప్రయాణాలు వంటి వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు పర్యాటకులలో ప్రసిద్ధి చెందాయి. సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా ఉండే నైరుతి రుతుపవనాల నెలలలో మినహా, సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ ద్వీపాలకు తరలివస్తారు.

పరిపాలన

[మార్చు]

ఈ ద్వీపం కవరత్తి తహసీల్‌లోని అగట్టి దీవి టౌన్‌షిప్‌కు చెందింది.[15]

మూలాలు

[మార్చు]
  1. "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Lakshadweep. Archived from the original (PDF) on 2016-07-22.
  2. Registration Plate Numbers added to ISO Code
  3. Kollam to Agatti
  4. "Oceandots - Agatti". Archived from the original on 2010-12-23. Retrieved 2011-11-08.
  5. "Station: Agatti Climatological Table 1991–2020" (PDF). Climatological Normals 1991–2020. India Meteorological Department. Archived from the original (PDF) on 8 April 2024. Retrieved 7 July 2024.
  6. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M112. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 February 2020.
  7. "Agatti Island population". Census India 2011. Retrieved 15 January 2024.
  8. Web123India
  9. "How to reach Lakshadweep". Official Website of Union Territory of Lakshwadeep. Archived from the original on 31 డిసెంబరు 2014. Retrieved 29 డిసెంబరు 2014.
  10. "Alliance Air". Retrieved 29 December 2014.
  11. "How to reach Lakshadweep". Official Website of Union Territory of Lakshadweep. Archived from the original on 31 డిసెంబరు 2014. Retrieved 29 డిసెంబరు 2014.
  12. Resort Archived 6 మే 2016 at the Wayback Machine
  13. Resort
  14. Resort Archived 6 అక్టోబరు 2015 at the Wayback Machine
  15. Tehsils info

బాహ్య లింకులు

[మార్చు]