అగ్గలయ్య గుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైన మత ప్రతీక చిహ్నం

తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా, హన్మకొండ పట్టణంలోని చారిత్రక ప్రదేశం ఇది. పెద్ద దిగంబర జైన విగ్రహం ఉన్న ఈ గుట్ట పద్మాక్షి గుట్టకు వెళ్ళే మార్గం పక్కనే వుంటుంది. ప్రాచీన వైద్యుడు అగ్గలయ్య పేరు మీద ఈ గుట్టను అగ్గలయ్య గుట్ట అంటారు. ప్రముఖ చరిత్రకారుడు ఘంటా జవహర్ లాల్ గారు ‘ఎగ్గలయ్య’ గుట్ట అన్నాడు. సమీపంలో విశ్రాంతి కోసం విశాలమైన గుహలు కూడా ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన, మధ్య యుగ చరిత్రల్లో జైన సంప్రదాయనువర్తనులైన పలువురు గురువులు వైద్యవిద్యలో ఆరితేరినవారుగా కనిపిస్తున్నారు. ఇంకా ఫణిగిరి, ఏలేశ్వరం, నాగార్జునకొండ శాసనాల్లో వైద్యుల గురించి, పశువైద్యుల గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి.[1]

ప్రదేశం వివరాలు

[మార్చు]

హన్మకొండ చౌరస్తా సమీపంలో పద్మాక్షి, సిద్ధుల గుట్టలకు ఉత్తరంగా ఉన్న ఈ అగ్గలయ్య గుట్ట ఉంది. ఈ గుట్టకు అతని పేరు పెట్టడానికి ముఖ్య కారణం వైద్యునిగా అతనికి ఉన్న ప్రాచుర్యమే. 16 వ జైన తీర్ధంకరుడైన శాంతినాధుని దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో ఈ గుట్టపై ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది.

అగ్గలయ్య గుట్ట చారిత్రక విశేషాలు

[మార్చు]

హన్మకొండలోని అగ్గలయ్యగుట్టపై తొమ్మిదో శతాబ్దానికి చెందిన ధ్యాన ముద్రలో ఉన్న జైనుడి తలపై త్రిస్తర ఛత్రం, ఇరువైపులా పరిచారకులు, కింది భాగంలో ఏనుగు తొండాలు, సింహాలు వున్న జైన విగ్రహం వెలుగులోకి వచ్చింది. అది ఈ గుట్టపై ఒక గుహలో నాలుగున్నర ఎత్తులో ఉన్న ఈ విగ్రహం కనిపించింది. రాజ్‌పుట్‌వాడకు చెందిన శంభు దయాల్‌ సింగ్‌ ఠాకూర్‌ ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్య, మరికొందరు ఔత్సాహికులు గుట్టపైకి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ విగ్రహం 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడిదిగా చరిత్రకారుడు చెబుతున్నారు. గుహలో ఈ విగ్రహం బయటపడటం ద్వారా ఈ ప్రదేశాన్ని జైనులు తపస్సు కోసం ఉపయోగించుకున్న చోటు కావచ్చని.. దీన్ని జైన ఆరామం (జ్ఞాన మందిరం) కూడా కావచ్చని భావిస్తున్నారు. కాగా.. హన్మకొండ చౌరస్తా సమీపంలో పద్మాక్షి, సిద్ధుల గుట్టలకు ఉత్తరంగా ఉన్న ఈ అగ్గలయ్య గుట్టపై ఉత్తరాభిముఖాన 30 అడుగుల ఎత్తులో ఉల్బణ (అర్ధ) శిల్పం కూడా ఉంది.

ఇదే గుట్టపై ఏడు జైన తీర్థంకుల అర్ధశిల్పాలున్నాయి. వీటిలో పార్శ్వనాథున్ని తేలిగ్గా గుర్తించవచ్చు. తలపై ఏడు పడగల సర్పం గొడుగుపట్టి నేలదాక మెలికలు తిరిగి నిలిచి ఉంటుంది. ఈ శిల్పాలు రాష్ట్ర కూటులు, కళ్యాణ చాళుక్యులు పాలించిన 9,10వ శతాబ్దాలనాటివి.

అగ్గలయ్య

[మార్చు]

అగ్గలయ్య సా.శ. 1000 ప్రాంతానికి చెందినవాడు. పశ్చిమ చాళుక్య రాజైన జగదేకమల్ల జయసింహుడి (1015-1042) మహారాజు వైద్యాచార్యుడే అగ్గలాచార్యుడు, లేదా అగ్గలయ్య. ఈయన మనుషులకే కాక పశువులకు కూడా వైద్యం చేసేవాడు. శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించేవాడు. జైన మతాచార్యుడిగా ఉన్నాడు. 1034 జూన్ 4 న పొట్లకెరె (నేటి పఠాన్ చెరువు-ప్రసిద్ద జైన కేంద్రము నిర్మింపజేసాడు. ముప్పనపల్లిలో ఉన్న బుద్ధసేన జినాలయం నిర్మించాడు. ఇక్కురికిలోని వైద్యరత్నాకర జినాలయానికి దానం చేసాడు. రేకవ్వ (తైలపుని భార్య) కట్టించిన ‘కట్ట బసది యొక్క ఖండస్ఫుటిత నవ సుధాకర్మాదులకు...’అంటే మరమత్తులు చేయించి దేవుని భోగమునకు బుద్ధిపాకలోను, ముప్పనపళ్ళిలోను కొంత దానం ఇప్పించాడు. గురువులను తృప్తి పరిచేవిధంగా, జైన సిద్ధాంతాలను బోధిస్తూ, వైద్యులకు వచ్చే సందేహాలను తీర్చేవాడిగా పేరు పొందాడు. అంతేకాక జగదేకమల్లుడి (జయసింహుడు) ఆస్థానంలో ఉండే ఇతర వైద్యులందరిలో కూడా ఇతడు అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇతడు ఆయుర్వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు శాస్ర్తాన్ని బోధించడం, శచికిత్సలు, తత్సబంధిత కర్మలు చేసినట్లు తెలుస్తుంది. ఇతర భిషక్కులు (వైద్యులు) నయం చేయలేని అనేక రుగ్మతలను నయం చేసేవాడని శాసనవాక్యం. అతడు నయం చేస్తే ఏ రోగం కూడా మళ్ళీ రాదు, అసలు రోగమే లేకుండా చేయగలడు (పునరూహ దక్షం, నిరూహ దక్షం). ఇంకా ఇతడు ఉమా తంత్రంలోను, సంగ్రహ పరిచ్ఛేద క్రియలోను కౌశల్యం కలవాడుగాను, శస్త్ర శాస్త్ర విషయంలో ప్రావీణ్యుడుగా కీర్తించబడ్డాడు.అగ్గలయ్య తన వైద్య నిపుణత్వం ద్వారా అనేక శస్త్ర చికిత్సలు చేసినట్లు, ఆ విద్య అతని కీర్తిని నాటి చాళుక్యరాజ్యంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించేట్లు చేసిందని చెప్పవచ్చు. ఇతడు ఎల్లప్పుడు ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్య పరిరక్షణకోసం పరితపిస్తూ ఉండేవాడు. అంతే కాదు తాను చేసే సత్కార్యాలతో రాజులను మెప్పించి వారితో కూడా దానధర్మాలు చేయించేవాడు.

అగ్గలాంగే గగ్గలమ్‌ ‘‘నేను చికిత్స చేసే క్రమంలో మందులతో జబ్బును తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అవసరమైతే శస్త్రచికిత్స చేస్తా’’11వ శతాబ్దంలో చాళుక్యుల హయాంలో ప్రముఖ వైద్యుడిగా వెలుగొందిన అగ్గలయ్య మాట ఇది. ఈయన ఫిజీషియన్‌గా, సర్జన్‌గా అప్పట్లో వెలుగొందాడు. ఏ వైద్యుడూ నయం చేయలేని జబ్బు మాయం చేస్తాడన్నది అప్పట్లో అతని ఘనతను చెప్పుకొనేవారట.‘అగ్గలాంగే గగ్గలమ్‌’ అంటూ అతనిని పిలిచేవారు.ఇతను తొలుత ఓ గ్రామ పెద్దగా ‘గౌండ్‌’ హోదాను, ఆ తర్వాత సామంత రాజు హోదాను దక్కిం చుకున్నాడు. ఈ విషయాలు సైదాపురంలో వెలుగుచూసిన ఓ శాసనం వెల్లడిస్తోంది. అతను ‘వైద్య రత్నాకర ప్రాణాచార్య’ బిరుదు కూడా అందుకున్నాడు. నాటి ఓ జైన ఆలయానికి వైద్య రత్నాకర జినాలయం అనే పేరు పెట్టారు. అతని పేరుతో స్తూపంపై నాటి రాజు జయసింహ–2 శాసనమే చెక్కించారు.

అగ్గలయ్య బిరుదులు

[మార్చు]
 • వైద్యరత్నాకర,
 • ప్రాణాచార్య,
 • నరవైద్య

జైన తీర్ధంకరుల జాబితా

[మార్చు]

అగ్గలయ్య శాసన ఆధారాలు

[మార్చు]

సైదాపురం శాసన వివరాలు

[మార్చు]

నల్గొండ జిల్లా భువనగిరి తాలుకాలోని సైదాపురం గ్రామంలోని ఒక పొలంలో 1979 లో బయల్పడిన శాసనం ద్వారా తెలుస్తున్నాయి.శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరేజాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః

వ్యాధిగ్రస్థుడైన రోగికి వైద్యుడు నారాయణుడితో సమానం. అటువంటి ఓ వైద్యుడికి సర్వోత్కృష్ట స్థానం కల్పించిన దాఖలా మనకు శాసనాల్లో కనిపిస్తుంది. అతని మాటను గౌరవించి మహారాజు అనేక దానధర్మాలు చేసినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. అదే సైదాపూర్‌ శాసనం. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజైన జగదేకమల్ల జయసింహుడి (1015-1042) కాలంలో వేయించింది. శాసన కాలం సా.శ. 1034. శాసనం తెలుగు కన్నడ భాషల్లో మూడు వైపుల మొత్తం 81 పంక్తుల్లో చెక్కి ఉంది. జయసింహ మహారాజు వైద్యాచార్యుడైన అగ్గలార్యుని కోరిక మేరకు భావ సంవత్సరం, జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి మంగళవారం నాడు పొట్టళకెఱె శిబిరం (పొట్లచెర్వు పటన్‌చెరు) లో ఉండగా ముప్పనపల్లిలో ఉన్న బుద్ధసేన జినాలయానికి, ఇక్కురికిలోని వైద్యరత్నాకర జినాలయానికి దానం చేసిన సందర్భంలో వేయించింది. ఈ రెండు ఆలయాలు అగ్గలయ్య స్వయంగా కట్టించాడు. ఈ రెండూ కూడా ఆలేరు, కొల్లిపాక పరిధిలో ఉన్నాయి. శాసనంలో రెండవ ప్రక్క ఉన్న సంస్కృత భాగంలో అగ్గలయ్య ప్రశస్తి మనకు కనబడుతుంది. మూడవ పక్క దాన విషయం భూమికి సంబంధించిన సరిహద్దులు పేర్కొనబడ్డాయి. అదేవిధంగా రేకవ్వ (తైలపుని భార్య) కట్టించిన ‘కట్ట బసది ఖండస్ఫుటిత నవ సుధాకర్మాదులకు...’అంటే మరమత్తులు చేయించి దేవుని భోగమునకు బుద్ధిపాకలోను, ముప్పనపళ్ళిలోను కొంత దానం ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.

శాసనంలో అగ్గలార్యుడు విశేషంగా కీర్తించబడ్డాడు. ఇతనికి వైద్యరత్నాకర, ప్రాణాచార్య, నరవైద్య అనే విశేషణాలు ఉన్నట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ప్రజలందరు ఆరోగ్య వంతులుగా ఉండేటట్లుగా, మిత్రుల క్షేమం కోరుకునేవాడుగా పేర్కొనబడ్డాడు. గురువులను తృప్తి పరిచేవిధంగా, జైన సిద్ధాంతాలను బోధిస్తూ, వైద్యులకు వచ్చే సందేహాలను తీర్చేవాడిగా పేరు పొందాడు. అంతేకాక జగదేకమల్లుడి (జయసింహుడు) ఆస్థానంలో ఉండే ఇతర వైద్యులందరిలో కూడా ఇతడు అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇతడు ఆయుర్వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు శాస్ర్తాన్ని బోధించడం, శచికిత్సలు, తత్సబంధిత కర్మలు చేసినట్లు తెలుస్తుంది. ఇతర భిషక్కులు (వైద్యులు) నయం చేయలేని అనేక రుగ్మతలను నయం చేసేవాడని శాసనవాక్యం. అతడు నయం చేస్తే ఏ రోగం కూడా మళ్ళీ రాదు, అసలు రోగమే లేకుండా చేయగలడు (పునరూహ దక్షం, నిరూహ దక్షం). ఇంకా ఇతడు ఉమా తంత్రంలోను, సంగ్రహ పరిచ్ఛేద క్రియలోను కౌశల్యం కలవాడుగాను, శస్త్ర శాస్త్ర విషయంలో ప్రావీణ్యుడుగా కీర్తించబడ్డాడు.

శాసనపాఠం

[మార్చు]

శాసనపాఠం ఈ క్రింది విధంగా ఉంది.[2]

 1. ఓ ని (ర్దాహా) య సతాం హితాయ విదుషాం (రోగాభిభూ)
 2. తాత్మనా మారోగ్యాయ నృణాం సుఖాయ సుహృదాం తు
 3. ష్టై గురూణాం సదా రక్షాయై జినశాసనస్య భిష
 4. జాం శాస్త్రక్రియా సంశయాద్యుచ్ఛేదాయ చ ప
 5. ద్మభూస్స (స) హజ: శ్రీవైద్యరత్నాకర: (ఓ)
 6. ఆయుర్వేదవిదాం సదా పటుధియాం యే శాస్త్ర
 7. కర్మక్రమే ప్రౌఢా (:) శ్రీజగదేకమల్ల
 8. నృపతే.. య్యే శాస్త్రపారంగతాస్తేషాం
 9. సంసది శస్త్రశాస్త్రకుశల:శ్రీ
 10. వైద్యరత్నాకర: జేతా
 11. వ (..ల) రగలో బు
 12. ధనిధిశ్శస్త్రేణ శాస్త్రేణ వ
 13. యద్యత్ర శాస్త్రాదిషు కర్మ
 14. కరోతి లోక: త్వం తు ప్రవేత్సి నరవై
 15. ద్యకం అగ్గలార్య (0) దివ్రం (తీవ్రం) తథాపది
 16. దథాపి సుఖం విధాతుం సింహస్య తస్య చ
 17. తథా మహి (మా) గణస్య అశక్యవ్యాధే (ర)
 18. పి పరైర్భిషగ్భిర్వ్యాధి (ప్రకర్షే) తదు
 19. పక్రమే చ. తమగ్గలార్యం పునరూమ
 20. దక్షం నిరూ (దక్షం) కథయంతి దిక్షు
 21. ఉమాతంత్రమాద్యం.. సంగ్రహపరిచ్ఛేద
 22. క్రియాకౌశలోద్దామ ప్రథితశస్త్రశాస్త్ర
 23. విషయప్రాగ (ణ్య) మరూర్జితప్ర (దం)
 24. (కర్మిగ) చక్రవర్తి జయసింగ

సిరూర్ శాసనం

[మార్చు]

అగ్గలయ్యకు సంబంధించిన మరింత సమాచారం మనకు మెదక్‌జిల్లాలోని సిరూర్‌ శాసనంద్వారా తెలుస్తుంది. ఈ శాసనం పశ్చిమచాళుక్యచక్రవర్తి 2వ సోమేశ్వరుడి (భువనైకమల్లదేవుడు) కాలంలో సా.శ..1074లో వేయించింది. ఇందులో అగ్గలయ్య ప్రధాన నాథుడుగా, జగదేక వైద్యుడుగా, వితరణగుణశీలుడుగా పేర్కొనబడ్డాడు. వరంగల్లు పద్మాక్షి గుట్టకు ఎదురుగా ఉన్న ఎత్తైన కొండను అగ్గలయ్య గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్టమీద పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు జైనమతం సంప్రదాయానికి చెందిన అనేక విగ్రహాలను కనుగొన్నారు. ఇక్కడ అగ్గలయ్య విగ్రహం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గుట్టకు ఆయన పేరు పెట్టడానికి ముఖ్య కారణం వైద్యునిగా ఆయనకు ఉన్న ప్రాచుర్యమే.

అగ్గలయ్య తన వైద్య నిపుణత్వం ద్వారా అనేక శస్త్ర చికిత్సలు చేసినట్లు, ఆ విద్య అతని కీర్తిని నాటి చాళుక్యరాజ్యంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించేట్లు చేసిందని చెప్పవచ్చు. ఇతడు ఎల్లప్పుడు ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్య పరిరక్షణకోసం పరితపిస్తూ ఉండేవాడు. అంతే కాదు తాను చేసే సత్కార్యాలతో రాజులను మెప్పించి వారితో కూడా దానధర్మాలు చేయించేవాడు.

అగ్గలయ్య గుట్ట అభివృద్ది పనులు

[మార్చు]

హన్మకొండలోని అగ్గలయ్య గుట్టను 'హృదయ్‌' పథకం కింద అభివృద్ధి

మూలాలు

[మార్చు]
 1. Reddy, P. Laxma. "Aggalayya Gutta in Warangal set to turn tourism spot". Telangana Today. Retrieved 2020-10-16.
 2. Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.6

బయటి లంకెలు

[మార్చు]