Jump to content

అగ్గి తెగులు

వికీపీడియా నుండి

అగ్గి తెగులు ప్రధానంగా వరి పంటలో కనిపిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 60 మిలియన్లకు పైగా ప్రజలకు ఆహారం ఇవ్వడానికి తగినంత బియ్యాన్ని నాశనం చేస్తుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో ఫంగస్ సంభవిస్తుందని అంటారు.[1]

అగ్గి తెగులు సోకిన పంట

లక్షణాలు

[మార్చు]

అగ్గి తెగులు వరి పైరుకు ఏ దశలోనైన ఆశించవచ్చును . ముఖ్యంగా ఈ తెగులు వరి ఆకులపైన, మొక్క కణుపులపైన, వరివెన్ను పైన ఆశిస్తుంది. అగ్గి తెగులు నారు మడిలో వచ్చినట్లయితే నారు మడి పూర్తిగా ఎండిపోతుంది .

ఆకులపై తెగులు

[మార్చు]

వరి నాట్లు పూర్తి అయిన తరువాత అగ్గి తెగులు సోకినట్లయితే తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఉఉంటాయి. పిలకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది . పిలకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది . ఆకుల పైన చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలుకండి ఆకారంలో గల మచ్చలు ఏర్పడతాయి . మచ్చల అంచు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగు కట్టి ఉంటుంది తెగులు పెరిగే కొలదీ మచ్చల సంఖ్య, పరిమాణం పెరిగి ఒకదానితో ఒకటి కలిసి వరి మొక్కల ఆకులు ఎండిపోయి, చూడటానికి ఈ పైరును నిప్పుతో తగలపెడితే ఏవిధంగా ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది .

కణుపులపై తెగులు

[మార్చు]

ఈ తెగులు వరి మొక్క కణుపులకు సోకినప్పుడు కణుపుల పైన గోధుమరంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుంది . సాధారణంగా ఈ తెగులుకు కారణమైన శిలీంద్రం మొదటగా రెండవ లేదా మూడవ కణుపు మొదలు దగ్గర ఆశించి మొక్క కాండం విరిగేలా చేస్తుంది .

వెన్ను పై తెగులు

[మార్చు]

వరి మొక్క వెన్ను పైకి వచ్చే దశలో ఈ తెగులు పోకినట్లయితే వెన్ను దగ్గర గోధుమరంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి . దీని వల్ల వరివెన్ను మెడ దగ్గర విరిగి వ్రేలాడడం కానీ, లేక పడిపోవడం కానీ జరుగుతుంది . అందువల్లనే దీనిని " మెడ విరుపు తెగులు " అంటారు . వ్యాధిసోకిన వెన్నులోనీ గింజలు తాలుగా మారి ఉంటాయి.[2]

వ్యాప్తి

[మార్చు]

ఈ శిలీంద్రము మొక్కల అవశేషాల్లోను, విత్తనాలలోను, కలుపు మొక్కల పై కూడా జీవిస్తుంది . గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది . ఈ తెగులు ఒక వారం రోజులు అనుకూల పరిస్థితులు ఉంటే వ్యాధి త్వరగా వృద్ధి చెంది పంటను నాశనం చేస్తుంది . రాత్రి ఉష్ణోగ్రత 20-23సెం.గ్రే. మధ్యలో ఉండి గాలిలో తేమ 90 శాతము ఉండి మంచు కానీ వర్షపు జల్లులు పడటం వల్లనా ఈ వ్యాధి అధికంగా వృద్ధి చెందుతుంది . ఈ తెగుళ్లు అనుకూల వాతావరణం మన రాష్ట్రంలో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది . వరి నాట్లు దగ్గరి దగ్గరగా వేయటము, నత్రజని ఎరువులను అధికంగా వేయటం వలన కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది.[3]

యాజమాన్య పద్ధతులు

[మార్చు]

1.నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి.

2.పొలాల గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.

3.నత్రజని ఎరువులను అధికంగా వేయకూడదు.

4.విత్తనశుద్ధి చేయకుండా విత్తనాలను విత్తకూడదు.[4]

నివారణ

[మార్చు]

సేంద్రీయ నివారణ

[మార్చు]

1. 10శాతం గోమూత్రాన్ని 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

2.10 లీ. మారేడు ఆకుల కషాయాన్ని 200లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.

3.4 లీ. శొంఠి పాల కషాయాన్ని 200 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.

రసాయన నివారణ

[మార్చు]

1.0.6 గ్రాముల ట్రైసైక్లాజోల్ లేదా 1మిల్లీ లీటర్ల ఎడిఫెన్ఫాస్ రసాయనాన్ని 1 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

మూలాలు

[మార్చు]
  1. "తెగుళ్ల నివారణ". వ్యవసాయ శాఖ తెలంగాణ. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-18.
  2. "అగ్గి తెగులు నివారణ పద్దతులు". ఈనాడు feb 9, 2021, warangal district edition.
  3. "వరిలో అగ్గి తెగులు". సాక్షి sep 30, 2014.
  4. వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.