అచ్చెన్నాయడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అచ్చెన్నాయడు 2014 సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఇతను కేంద్ర మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నాయకుడైన ఎర్రన్నాయుడుకి సోదరుడు. ఇతను 1971లో కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించాడు. విశాఖ వీఎస్ కృష్ణా కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 1997లో శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రాపురం ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తరువాత 1999, 2004లలో అక్కడినుంచే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి ఎన్నికై తొలిసారి మంత్రి అయ్యారు.


మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక - 9-6-2014