అచ్ఛోద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అచ్ఛోద ఒక పుణ్య నది.

విశేషాలు[మార్చు]

తొలుత మరీచి నందనులగు పితృగణముల యొక్క మానస కన్యకగా పుట్టి తన పితలచే నిర్మితమగు అచ్ఛోదము అను సరోవరతీరమున సహస్ర దివ్యవర్షములు తపస్సు చేసి పితరుల మెప్పింపగా వారలు దివ్యాలంకారభూషితులయి పొడసూపిరి. అంత ఆపె తన తండ్రులగు వారలలో మావసుఁడు అనువానిని తన పతిఁగా కోరె. ఈ వ్యభిచారముచే ఆమె యోగభ్రష్టయై స్వర్గమునుండి క్రిందికి పడెనుగాని భూమినంటక మధ్యమున నిలిచె. అది దుర్మతియై కోరినను ధీరతచే మావసుఁడు తన మనమును చలింపనీయకుండుటంజేసి యక్కార్యము ప్రవర్తిల్లిన దినము అమావాస్య అని పరంగె. పితృ సంబంధమగునది కావున ఆదినము పితరులకు ముఖ్యము. ఆదినమునందు వారలకు చేసెడి స్వల్పక్రియలనైనను వారు అక్షయములుగ భావించి తృప్తిఁజెందుదురు. అట్లు అచ్ఛోద తలక్రిందుగా పడి పితరులను అందఱను పలుచందముల వినుతించి నా వ్యభిచారమును మన్నించి నాకు మరల గతులు కలుగునటులు కరుణింపుఁడని వేఁడఁగా ఆ పితరులు దానిం జూచి నీవిపుడు దేవతలు చేసెడు కర్మఫలములను అనుభవించుచుండి యిరువదియెనిమిదవ ద్వాపరమున మీనయోనియందు పుట్టి సత్యవతి అని పేర్కొనంబడి తొలుత పరాశరమహాముని తేజమున వ్యాసమహామునిని కని పిదప శంతనుని భార్యవై విచిత్రవీర్యుఁడు చిత్రాంగదుఁడు అను నిరువురు పుత్రులను కాంచి కడపట అచ్ఛోద అను పుణ్యనదివి అయ్యెదవని చెప్పి అంతర్థానులయిరి.

"https://te.wikipedia.org/w/index.php?title=అచ్ఛోద&oldid=2298634" నుండి వెలికితీశారు