అజయ్ నిషాద్
| అజయ్ నిషాద్ | |||
| పదవీ కాలం 2014 మే 16 – 2024 జూన్ 4 | |||
| ముందు | జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ | ||
|---|---|---|---|
| తరువాత | రాజ్ భూషణ్ చౌదరి | ||
| నియోజకవర్గం | ముజఫర్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1966 October 2 హాజీపూర్, బీహార్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | (2 ఏప్రిల్ 2024 - ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ జనతాదళ్
| ||
| తల్లిదండ్రులు | జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ | ||
| జీవిత భాగస్వామి | రామ నిషాద్ | ||
| నివాసం | ముజఫర్‌పూర్ | ||
| పూర్వ విద్యార్థి | బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అజయ్ కుమార్ నిషాద్ (జననం 2 అక్టోబర్ 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అజయ్ నిషాద్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అఖిలేష్ ప్రసాద్ సింగ్‌పై 2,22,422 ఓట్ల మెజారిటీతో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి విఐపి అభ్యర్థి రాజ్ భూషణ్ చౌదరిపై 4,09,988 ఓట్ల మెజారిటీతో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
అజయ్ నిషాద్ 2024లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి,[2] 2024 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజ్ భూషణ్ చౌదరి చేతిలో 2,34,927 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Ajay Nishad" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 22 August 2025. Retrieved 22 August 2025.
- ↑ "BJP MP from Bihar's Muzaffarpur Ajay Kumar Nishad joins the Congress" (in Indian English). The Hindu. 2 April 2024. Archived from the original on 22 August 2025. Retrieved 22 August 2025.
- ↑ "Muzaffarpur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2024. Archived from the original on 22 August 2025. Retrieved 22 August 2025.