Jump to content

అజారుద్దీన్

వికీపీడియా నుండి
మహమ్మద్ అజారుద్దీన్
మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి[2][3]
Assumed office
2025 అక్టోబర్ 31[1]
లో‍క్‍సభ సభ్యుడు
In office
16 మే 2009 (2009-05-16) – 16 మే 2014 (2014-05-16)
అంతకు ముందు వారుషఫీకుర్ రెహమాన్ బార్క్
తరువాత వారుకున్వర్ సర్వేష్ కుమార్ సింగ్
నియోజకవర్గంమొరాదాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 27వ అధ్యక్షుడు
In office
2019 సెప్టెంబర్ 27 – 2022
అంతకు ముందు వారుగడ్డం వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
Assumed office
2014 జూన్ 2
వ్యక్తిగత వివరాలు
జననం (1963-02-08) 1963 February 8 (age 62)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఎత్తు179 cm (5 ft 10 in)[4]
జీవిత భాగస్వామి
  • నౌరీన్
    (m. 1987; విడాకులు 1996)
  • (m. 1996; విడాకులు 2010)
  • షానన్ మేరీ
    (m. 2017)
సంతానంమొహమ్మద్ అసదుద్దీన్
మారుపేరుఅజార్, అజ్జు[5]
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి వాటం మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 169)1984 డిసెంబర్ 31 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2000 2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 51)1985 జనవరి 20 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 జూన్ 3 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981–2000హైదరాబాద్
1983–2001సౌత్ జోన్
1991–1994డెర్బీషైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే ఎఫ్‌సి లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 99 334 229 433
చేసిన పరుగులు 6,215 9,378 15,855 12,941
బ్యాటింగు సగటు 45.03 36.92 51.98 39.33
100లు/50లు 22/21 7/58 54/74 11/85
అత్యుత్తమ స్కోరు 199 153* 226 161*
వేసిన బంతులు 13 552 1,432 827
వికెట్లు 0 12 17 15
బౌలింగు సగటు 98.44 46.23 47.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/19 3/36 3/19
క్యాచ్‌లు/స్టంపింగులు 105/0 156/0 220/0 200/0
Medal record
పురుషుల క్రికెట్
Representing  భారతదేశం
ఆసియా కప్
Winner 1988 బంగ్లాదేశ్
Winner 1990–91 భారతదేశం
Winner 1995 యుఎఇ
Runner-up 1997 శ్రీలంక
మూలం: [1], 2009 ఫిబ్రవరి 13

మహమ్మద్ అజారుద్దీన్ (జననం 8 ఫిబ్రవరి 1963) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్, భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఆయన భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆయన కెప్టెన్‌గా 1990–91, 1995 ఆసియా కప్‌లలో జట్టును విజయాలకు నడిపించాడు, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. అజారుద్దీన్ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా, అతని యుగంలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. ఆయన 1990లలో భారతదేశానికి మూడు క్రికెట్ ప్రపంచ కప్‌లకు నాయకత్వం వహించాడు, ఇది ఏ భారతీయ కెప్టెన్ చేయని అత్యధికం. ఆయన 1985 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు.

మహమ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతని ప్రమేయం కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అతనిపై జీవితకాలం నిషేధం విధించిన తర్వాత 2000లో అతని క్రికెట్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. ఆయన 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పీల్ తర్వాత జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. అజారుద్దీన్ సెప్టెంబర్ 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

మహమ్మద్ అజారుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నాడు.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అజారుద్దీన్ 1987లో నౌరీన్‌ను వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు కుమారులు మొహమ్మద్ అసదుద్దీన్ & మొహమ్మద్ అయాజుద్దీన్ ఉన్నారు. ఆయన 1996లో నౌరీన్‌కు విడాకులు ఇచ్చి నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నాడు.[7] అజారుద్దీన్ అనేక మందితో ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో సంబంధాలున్నాయని పుకార్లు వచ్చిన తర్వాత, సంగీత 2010లో విడాకులకు దరఖాస్తు చేసుకుంది.[8][9][10][11] ఆయన చిన్న కుమారుడు అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు.[12][13][14] అతని పెద్ద కుమారుడు అసదుద్దీన్ దేశీయ క్రికెటర్, 2019లో సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను వివాహం చేసుకున్నాడు.[15][16]

క్రికెట్ జీవితం

[మార్చు]

ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇతనికి జతగా రవిశాస్త్రి 111 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు.

1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

[మార్చు]

2000 లో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.[17] సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనేకి బుకీలకు పరిచయం చేసింది అజారుద్దీనే.[18] సిబిఐ తరఫున కె. మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి, బిసిసిఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ లో ఆడకుండా నిషేధించారు.[19][20]

2012 నవంబరు 8 న హైదరాబాదులోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అతనిపై నిషేధం అక్రమమని తీర్పు చెప్పింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి అజహర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి అజహర్ వయసు 49 సంవత్సరాలు.[21][22][23]

రాజకీయ జీవితం

[మార్చు]

ముహమ్మద్ అజహరుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్‌పై 49,107 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా చేతిలో 1,35,506 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ముహమ్మద్ అజహరుద్దీన్ 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయలేదు,[24] ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా ప్రకటించింది.[25][26][27] ఆయన ఈ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[28]

మహమ్మద్ అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా,[29][30] నవంబర్ 4న మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయించగా,[31] ఆయన నవంబర్ 10న హైదరాబాద్‌ సచివాలయంలోని తన కార్యాలయంలో భాద్యతలు చేపట్టాడు.[32][33]

ఇతర పదవులు

[మార్చు]

మొహమ్మద్ అజహరుద్దీన్ 2013 జూలై 14న ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[34]

ఇవి కూడా చూడండి

[మార్చు]

*మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ సెంచరీల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "Ex-cricketer Mohammad Azharuddin sworn in as minister in Telangana cabinet" (in ఇంగ్లీష్). Hindustan Times. 31 October 2025. Retrieved 31 October 2025.
  2. "మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు". Eenadu. 4 November 2025. Retrieved 4 November 2025.
  3. "Azharuddin gets Minorities Welfare and Public Enterprises portfolios" (in Indian English). The Hindu. 4 November 2025. Retrieved 4 November 2025.
  4. "Mohammad Azharuddin's profile". Sportskeeda. Retrieved 4 November 2023.
  5. "Of comparisons and imitations". The Hindu. 1 March 2011. Retrieved 14 July 2023.
  6. "Biography of Azhar". azhar.co.in. Archived from the original on 8 ఏప్రిల్ 2016. Retrieved 12 May 2016..
  7. "Azhar: Here's all the real-life drama from Mohammad Azharuddin's life". Indian Express. 13 May 2016. Retrieved 14 May 2016.
  8. "Jwala in, Bijli out of Azharuddin's life?". The Times of India. 24 July 2010. Retrieved 15 May 2016.
  9. "Azhar dating badminton player Jwala Gutta". India tv News. Archived from the original on 15 జూలై 2018. Retrieved 12 May 2016.
  10. "From love at first sight to divorce: The tragic love story of ex-India captain Md Azharuddin and Sangeeta Bijlani". DNA India (in ఇంగ్లీష్). Retrieved 6 June 2022.
  11. "Mohammad Azharuddin birthday special: Know Indian cricketer Azhar, his love life and three wives!". india.com (in ఇంగ్లీష్). Retrieved 6 June 2022.
  12. "Azharuddin's teenage son dies 5 days after bike crash". Times of India (in ఇంగ్లీష్). 17 September 2011. Retrieved 6 June 2022.
  13. "Azharuddin's son dead". The Hindu. 16 September 2011. Retrieved 6 June 2022.
  14. "Speed thrilled, killed 200 kmph Ayaz". 18 September 2011. Archived from the original on 16 January 2017. Retrieved 6 June 2022.
  15. "Sania Mirza's sister Anam marries Mohd Azharuddin's son Asaduddin in Hyderabad". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 15 December 2019.
  16. "Mohammad Azharuddin's son Asad marries Sania Mirza's sister Anam; see pics and videos". Deccan Chronicle (in ఇంగ్లీష్). 12 December 2019. Retrieved 15 December 2019.
  17. The CBI Report in Full – Part 26 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  18. The CBI Report in Full – Part 25 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  19. Full text of the CBI (Report). Central Bureau of Investigation, New Delhi. 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  20. "Azharuddin confesses all". Archived from the original on 11 January 2022.
  21. "AP high court lifts ban on Azharuddin". Wisden India. 8 November 2012. Archived from the original on 12 మే 2016. Retrieved 14 May 2016.
  22. "Match fixing scandal". The Hindu. 8 November 2012. Retrieved 21 March 2015.
  23. "Match fixing charges: Andhra court says life ban on Azharuddin illegal". NDTV. 8 November 2012. Archived from the original on 9 June 2016. Retrieved 21 March 2015.
  24. BBC News తెలుగు (31 October 2023). "Telangana Elections: కేసీఆర్‌పై పోటీకి సైతం సిద్ధమన్న అజహరుద్దీన్‌కు జూబ్లీహిల్స్‌లో అదృష్టం వరించేనా?". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  25. Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  26. Sakshi (27 October 2023). "కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  27. Andhrajyothy (28 October 2023). "విష్ణును పక్కనెట్టి అజారుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ ఎందుకు..?". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  28. "Telangana Assembly Election Results 2023: Jubilee Hills". Election Commission of India. 3 December 2023. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
  29. "మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌". Eenadu. 31 October 2025. Retrieved 31 October 2025.
  30. "తెలంగాణ మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం". Sakshi. 31 October 2025. Retrieved 31 October 2025.
  31. "మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం". TV9 Telugu. 4 November 2025. Retrieved 10 November 2025.
  32. Jukanti (10 November 2025). "మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్". Disha Daily. Retrieved 10 November 2025.
  33. "అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ". Andhra Prabha. 10 November 2025. Retrieved 10 November 2025.
  34. http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]