అజిత్ ప్రసాద్ జైన్
అజిత్ ప్రసాద్ జైన్ | |
|---|---|
| 3వ [[కేరళ గవర్నర్]] | |
| In office 1965 ఏప్రిల్ 2 – 1966 ఫిబ్రవరి 6 | |
| ముఖ్యమంత్రి | రాష్ట్రపతి పాలన |
| అంతకు ముందు వారు | వి. వి. గిరి |
| తరువాత వారు | భగవాన్ సహాయ్ |
| కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి | |
| In office 1954 నవంబర్ 25 – 1959 ఆగస్టు 24 | |
| ప్రధాన మంత్రి | జవహర్ లాల్ నెహ్రూ |
| అంతకు ముందు వారు | రఫీ అహ్మద్ కిద్వాయ్ |
| తరువాత వారు | ఎస్.కె. పాటిల్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 6 October 1902[1] సహరాపూర్ ఉత్తరప్రదేశ్ భారత దేశం |
| మరణం | 1977 జనవరి 2 |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కళాశాల | లక్నో విశ్వవిద్యాలయం |
అజిత్ ప్రసాద్ జైన్ ( 1902 అక్టోబర్ 6- 1977 జనవరి 2) భారతీయ రాజకీయ నాయకుడు, అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సహారన్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కేరళ గవర్నర్ గా వివిధ హోదాలలో పనిచేశారు.[2][3]
ప్రారంభ జీవితం
[మార్చు]అజిత్ ప్రసాద్ జైన్ 1902లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి లో పట్టా అందుకున్నాడు. అజిత్ ప్రసాద్ జైన్ 1926లో న్యాయవాద వృత్తిని చేపట్టారు..[4] ఆ తరువాత అజిత్ ప్రసాద్ జైన్ కు రాజకీయాల మీద ఆసక్తి పెరగడంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
రాజకీయ జీవితం
[మార్చు]అజిత్ ప్రసాద్ జైన్ 1930 లలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాడు. అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు, అలాగే ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అజిత్ ప్రసాద్ జైన్ యునైటెడ్ ప్రావిన్సెస్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు.[3] 1937లో అజిత్ ప్రసాద్ జైన్ పార్లమెంటరీ కార్యదర్శిగా చాలా కాలం పాటు పనిచేశాడు. ఆయన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. .
1954 డిసెంబర్ నుంచి 1959 ఆగస్టు వరకు అజిత్ ప్రసాద్ జైన్ జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. 1961 మే నెలలో అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం దాస్ టాండన్ సైద్ధాంతిక విభేదాల కారణంగా రఫీ అహ్మద్ కిద్వాయ్ అఖిల భారత కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, అజిత్ ప్రసాద్ జైన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. కానీ ఆ రాజీనామాను జవహర్ లాల్ నెహ్రూ తిరస్కరించాడు.
ఆయన వి. వి. గిరి తరువాత కేరళ మూడవ గవర్నర్గా 1965 ఏప్రిల్ 2 నుంచి 1966 ఫిబ్రవరి 6 వరకు పనిచేశాడు. ఆయన కేరళ గవర్నర్గా పనిచేసిన సమయంలో కేరళ రాష్ట్రం రాష్ట్రపతి పాలన లో ఉంది.[5] 1966లో భారతదేశ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి కావడానికి అజిత్ ప్రసాద్ జైన్ తన మద్దతు ప్రకటించాడు. అంతేకాకుండా అజిత్ ప్రసాద్ జైన్ కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు. ఆయన కాంగ్రెస్ లోని వామపక్ష వర్గానికి చెందినవారు, మొరార్జీ దేశాయ్ ని వ్యతిరేకించడం ద్వారా ఈ వర్గాన్ని బలోపేతం చేయాలని అజిత్ ప్రసాద్ జైన్ భావించాడు.
తరువాత 1967లో రాజ్యసభ కు ఎన్నికైన అజిత్ ప్రసాద్ జైన్ 1975 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
అజిత్ ప్రసాద్ జైన్ నీటిపారుదల కమిషన్ చైర్మన్ గా పనిచేశాడు. అప్పట్లో అజిత్ ప్రసాద్ నేతృత్వంలోని నీటిపారుదల కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది.
అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జమీందారు వ్యవస్థ నిర్మూలన కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. భారతదేశంలోని నదులను అనుసంధానించే ప్రణాళికలో అజిత్ ప్రసాద్ జైన్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రాజెక్టులో అజిత్ ప్రసాద్ జైన్ చూపిన దూర దృష్టి, హరిత విప్లవం కు దారితీసింది.
అజిత్ ప్రసాద్ జైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సేవా నిధి ట్రస్టును స్థాపించారు. ఈ ట్రస్ట్ ఇల్లు లేని పేదవారికి కంటి చూపు లేని వారికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తుంది. ఈ సంస్థలకు ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్యుడు, ఆయన కుమారుడు డాక్టర్ కె. పి. జైన్ (గంగా రామ్ హాస్పిటల్ మాజీ చైర్మన్) నిర్వహిస్తున్నాడు.[6] అజిత్ ప్రసాద్ జైన్ 1952 భారత పార్లమెంట్ ఎన్నికలలో సహారన్పూర్ (ఉత్తర ప్రదేశ్) నుండి తొలిసారి గెలిచాడు. 1957 భారత సాధారణ ఎన్నికలలో తూముకూరు(కర్ణాటక) నుండి రెండవసారి ఎంపీగా గెలిచాడు .[7]
మరణం.
[మార్చు]అజిత్ ప్రసాద్ జైన్ 1977 జనవరి 2న 75 సంవత్సరాల వయసులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha, India. Parliament (2003). "Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha".
- ↑ "Vijai Pratap Singh vs Ajit Prasad And Ors. on 20 September, 1965".
- 1 2 "LIST OF MEMBERS OF THE CONSTITUENT ASSEMBLY". ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "LIST OF MEMBERS OF THE CONSTITUENT ASSEMBLY" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "SM College Alumni". Archived from the original on 27 September 2013. Retrieved 27 July 2012.
- ↑ "KERALA LEGISLATIVE ASSEMBLY". Archived from the original on 9 April 2009. Retrieved 10 December 2008.
- ↑ "IBN Politics". IBN India.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Two outsiders sent to Rajya Sabha from State". The Hindu. 2004-06-29. Archived from the original on 2005-01-26.