అజీజ్ బెల్గామీ
అజీజ్ బెల్గామి (عزیز بلگامی) Azeez Belgaumi | |
---|---|
జననం | 1954 , మే 01 కుడిచి, బెల్గాం జిల్లా, కర్ణాటక |
నివాస ప్రాంతం | బెంగళూరు , కర్ణాటక |
ఇతర పేర్లు | అజీజ్ బెల్గామి |
వృత్తి | రచయిత, సాహిత్యం, ఇస్లామీయ తత్వం |
ప్రసిద్ధి | పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, ఉర్దూ కవి |
మతం | ఇస్లాం (ముస్లిం) |
పిల్లలు | 3 కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తండ్రి | ముహమ్మద్ ఇస్ హాక్ |
తల్లి | ఖుదేజాబి |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
అజీజ్ బెల్గామీ (Azeez Belgaumi) ( ఉర్దూ - عزیز بلگامی ) - (జననం 1954 మే 01.) దక్షిణ భారతదేశంలో ఒక ప్రఖ్యాత ఉర్దూ కవి, సాహితీకారుడు. ఇతని ప్రత్యేకత ముషాయిరా లలో తన కవితలను శ్రావ్యంగా పాడుతూ శ్రోతలకు సాహితీప్రియులకు ఉర్రూత లూగిస్తాడు.
బాల్యం, విద్య
[మార్చు]కర్ణాటక, బెల్గాం జిల్లా లోని కుడిచి గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసం, బి.ఎస్.సి., ఎం.ఎ., ఎం.ఫిల్., వరకూ. ప్రథమంగా స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్స్ ఉద్యోగం. బ్రాంచ్ అకౌంట్స్ మేనేజర్ వరకూ ఎదుగుదల, ఆతరువాత వాలంటరీ రిటైర్మెంటు. ఆతరువాత సాహితీ ప్రస్థానం. ఓ జూనియర్ కాలేజిలో ప్రిన్సిపాల్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.
సాహితీ ప్రస్థానం
[మార్చు]ఉర్దూ సాహిత్యం పట్ల ప్రగాఢమైన అభిమానమే ఈ రంగంలో తీసుకొచ్చింది. పలు రచనలు, ఓ ఉర్దూ పత్రిక "సహారా ఉర్దూ"కు సబ్ ఎడిటర్ గానూ బాధ్యతలు చేపట్టాడు. ఇంటర్వ్యూవర్ గానూ, కాలమిస్టుగాను మంచి గుర్తింపు పొందాడు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ ఉర్దూ దిన వార పత్రికలకు వ్యాసాలు వ్రాసాడు.
యావత్ భారతదేశంలోనూ అనేక కవిసమ్మేళనాలు, సెమినార్లు, చర్చా గోష్టులలో పాల్గొన్నాడు. శాంతి సద్భావన, పరమత సహనం లాంటి విషయాలపై సెమినార్లలో పాల్గొని వక్తగా అనుభవం. అలాగే శ్రీశ్రీ రవిశంకర్ గారి "ఆర్ట్ ఆఫ్ లివింగ్" కార్యక్రమాల్లోనూ అనేక ప్రసంగాలిచ్చాడు.
రచనలు
[మార్చు]మూడు పుస్తకాలు రచించాడు. అవి అన్నీ కవితలే.
- హర్ఫ్-ఒ-సౌత్ (Harf-o-saut) - అక్షరాలూ - శబ్దాలు
- సుకూన్ కే లమ్హోన్ కి తాజగి (Sukun ke lamhouN ki tazagi) - ప్రశాంత క్షణాల తాజాతనం
- జంజీర్-ఎ-దస్త్-ఒ-పా (Zanjeer-e-Dast-o-paa) - కాళ్లుచేతుల సంకెళ్ళు.
ముషాయిరాలలో అజీజ్ బెల్గామి
[మార్చు]ముషాయిరాలలో ఇతడిని వినడానికి శ్రోతలు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇతడి రచనల్లో నాత్, గజల్లు ప్రసిద్ధి. "మేరే ముస్తఫా ఆయే" అనే నాత్ విని శ్రోతలు చాలా ఆనందిచే ముషాయిరాలు సర్వసాధారణం. ఇతరదేశాలనుండి ముషాయిరాలకు ఆహ్వానాలు అందుకున్న్డాడు.
మీడియాలో అజీజ్ బెల్గామీ
[మార్చు]- ఇతడి కవితలను ఇతనే గానం చేస్తూ అనేక ఆడియో కేసెట్లు విడుదల అయ్యాయి. వీటిలో "దుఆ హై హమారే పాస్" అనే కేసెట్, ఐ.పి.ఎస్. అధికారి ఖలీల్ మామూన్ (నేడు కర్నాటక ఉర్దూ అకాడెమీ చైర్మెన్) చే విడుదల చెయ్యబడింది.
- అలాగే అనేక ఆడియో సి.డి.లు విడుదల అయ్యాయి.
- ఇతడి కవితలకు అనేక గజల్ గాయకులూ పాడారు.
- యూట్యూబ్ లో యితడు పాల్గొన్న అనేక ముషాయిరాల ప్రోగ్రామ్లు లభ్యమవుతాయి.
- దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఇతడి కార్యక్రమాలు అనేక ఇంటర్వ్యూలు వచ్చాయి.
ఇతరత్రా
[మార్చు]- ఇతని సాహితీ రచనలపై, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఓ విద్యార్థి ఎం.ఫిల్. రీసెర్చ్ చేసాడు.
నివాసం
[మార్చు]ప్రస్తుతం ఇతను బెంగళూరులో కుటుంబంతో నివాసం. కుమారులు ముహమ్మద్ అత్హర్, ముహమ్మద్ జకారియా, ముహమ్మద్ యూనుస్, కుమార్తెలు సాజిడా, సాదికా లు. ప్రచురణారంగంలో "ప్రింటెక్ పబ్లికేషన్స్" నిర్వహిస్తున్నాడు.
చిత్రమాలిక
[మార్చు]-
మంగళూరు కార్యక్రమంలో అజీజ్
-
పోర్ట్ బ్లెఇర్ లో అజీజ్
-
అండమాన్ లో అజీజ్ గౌరవార్థం ఓ ముషాయిరా
-
బెంగళూరు ముషాయిరా లో
-
ఆడియో సిడి విధాన సభా ప్రాంగణంలో విడుదల
-
నాగపూర్ లోని ఓ సాహితీ కార్యక్రమంలో
-
ఢిల్లీ లోని ఓ కార్యక్రమంలో