Jump to content

అజేంద్ర సింగ్ లోధి

వికీపీడియా నుండి
అజేంద్ర సింగ్ లోధి

పదవీ కాలం
2024 - ప్రస్తుతం
ముందు పుష్పేంద్ర సింగ్ చందేల్
నియోజకవర్గం హమీర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-08-09)1970 ఆగస్టు 9
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
తల్లిదండ్రులు చంద్ర నారాయణ్ సింగ్, సీతా రాణి
జీవిత భాగస్వామి రేఖ సింగ్ (వి. 1991 జూన్ 24)
నివాసం కంకువా పోస్ట్, కంకువా పన్వాడి, మహోబా , ఉత్తరప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

అజేంద్ర సింగ్ లోధి (జననం 1970 ఆగస్టు 9) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అజేంద్ర సింగ్ లోధి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చంద్రనారాయణ్ సింగ్ రాజ్‌పుత్ అడుగుజాడల్లో సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేయగా 2022 శాసనసభ ఎన్నికల్లో చరఖారీ శాసనసభ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా ప్రకటించి ఆ తరువాత ఆయన స్థానంలో రామ్‌జీవన్ యాదవ్‌కు టికెట్ కేటాయించారు.[4]

అజేంద్ర సింగ్ లోధి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుష్పేంద్ర సింగ్ చందేల్‌పై 2,629 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 4,90,683 ఓట్లతో విజేతగా నిలవగా, పుష్పేంద్ర సింగ్ చందేల్ 4,88,054 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Ajendra Singh Lodhi: Grassroot Leader's Win From Hamirpur" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  2. "Hamirpur Election Results 2024: SP's Ajendra singh Lodhi wins with over 4.9 lakh votes". The Times of India. 5 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  3. "Grassroots workers | Rooted in the masses" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  4. "हमीरपुर लोकसभा सीट से जीतने वाले समाजवादी पार्टी के अजेंद्र सिंह लोधी कौन हैं, जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  5. "Hamirpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  6. "2024 Loksabha Elections Results - Hamirpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.