Jump to content

అజోయ్ ముఖోపాధ్యాయ

వికీపీడియా నుండి
అజోయ్ ముఖోపాధ్యాయ

పదవీ కాలం
1989  1999
ముందు రేణు పద దాస్
తరువాత సత్యబ్రత ముఖర్జీ
నియోజకవర్గం కృష్ణానగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1928-08-27)1928 ఆగస్టు 27
రారులి, ఖుల్నా జిల్లా, (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)
మరణం 2019 ఆగస్టు 21
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
వృత్తి రాజకీయ నాయకుడు

అజయ్ ముఖోపాధ్యాయ (1928 ఆగస్టు 27 - 2019 ఆగస్టు 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అజోయ్ ముఖోపాధ్యాయ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భట్టాచార్య జ్యోతిర్మయిపై 16153 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భట్టాచార్య జ్యోతిర్మయిపై 59575 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

అజోయ్ ముఖోపాధ్యాయ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భట్టాచార్య జ్యోతిర్మయిపై 38,910 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సత్యబ్రత ముఖర్జీపై 40,672 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మరణం

[మార్చు]

అజోయ్ ముఖోపాధ్యాయ 90 సంవత్సరాల వయసులో బిధాన్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2019 జూలై 24న మరణించాడు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  2. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  3. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  4. "Krishnanagar Lok sabha Election Result 2024". TV9 Hindi. 4 June 2024. Archived from the original on 10 July 2025. Retrieved 10 July 2025.
  5. "Krishnanagar Lok Sabha Election Result". Result University. 2024. Archived from the original on 10 July 2025. Retrieved 10 July 2025.
  6. "প্রয়াত অজয় মুখোপাধ্যায়". Aajkal (in Bengali). 24 July 2019. Archived from the original on 21 August 2019. Retrieved 21 August 2019.