Jump to content

అటామిక్ బ్యాటరీ

వికీపీడియా నుండి

ఒక అణు బ్యాటరీ, రేడియోఐసోటోప్ బ్యాటరీ లేదా రేడియో ఐసోటోప్ జనరేటర్, రేడియోఏక్టివ్ ఐసోటోప్ యొక్క క్షయం వలన కలుగు శక్తిని మార్చి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. అణు రియాక్టర్ లాగా, అణుశక్తి నుండి విద్యుత్తు ఉత్పత్తి చేసినా, ఇది చైన్ రియాక్షన్ ఉపయోగించక పోవడం చేత అణు రియాక్టర్లకు భిన్నంగా పని చేస్తుంది. సాధారణంగా వీటిని బ్యాటరీలు అని పిలిచినా, అణు బ్యాటరీలు సాంకేతికంగా ఎలెక్ట్రోకెమికల్ కావు, కావున వీటిని ఛార్జ్ లేదా రీఛార్జ్ చేయలేము. ఇవి చాలా ఖరీదైనవి అయినప్పటికీ, చాలా ఎక్కువ కాలం పనిచేస్తాయి ఇంకా అత్యధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి. దీనివలన వీటిని సాధారణంగా అంతరిక్ష నౌకల లో, పేస్ మేకర్లులో, నీటి అడుగున ప్రయోగింపబడే పరికరములు మొదలగు సిస్టంలు ఇంకా సుదూర ప్రాంతాలలో స్వయంచాలక శాస్త్రీయ స్టేషన్లు వంటి ఎక్కువ కాలం పనిచేయు వాటికి శక్తి మూలాలుగా ఉపయొగబడతాయి .[1][2][3]

అణు బ్యాటరీలు 1913లో హెన్రీ మోస్లే, చార్జ్ కణాలు-వికిరణం ద్వారా ఉత్పత్తి చేయబడిన కరెంట్ను మొదటిసారి ప్రదర్శించిన తరుణంలో ప్రారంభమయ్యాయి .1950లు ఇంకా 1960లలో, అంతరిక్ష నౌక మొదలగు దీర్ఘ కాలిక శక్తి వనరులు అవసరమయ్యే ప్రయొగాల కొరకు ఈ రంగం చాలా దృష్టిని ఆకర్షించింది. 1954లో, RCA చిన్న రేడియో రిసీవర్లు ఇంకా వినికిడి పరికరాల కోసం ఒక చిన్న అణు బ్యాటరీని పరిశోధించింది.[4] 1950లో RCA నిర్వహీంచిన ప్రారంభ పరిశోధనల అభివృద్ధి ద్వారా, అణు పదార్థములు నుండి విద్యుత్ శక్తిని సేకరించడానికి అనేక రకాలు పద్ధతులును రూపొందించింది. వీటి యొక్క శాస్త్రీయ సూత్రాలు బాగా స్థాపింపబడినా, ఆధునిక నానో-స్కేల్ టెక్నాలజీ ఇంకా కొత్త వైడ్-బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ల యొక్క అభివృద్ధి వలన గతంలో అందుబాటులో లేని ఆసక్తికరమైన భౌతిక లక్షణాల గల కొత్త పరికరాలు యొక్క తయారీకి తోడ్పడింది.

అణు బ్యాటరీలను వాటి శక్తి మార్పిడి ద్వారా రెండు ప్రధాన సమూహాలుగా విభజించవచ్చు: థర్మల్ (ఉష్ణం) కన్వర్టర్లు ఇంకా నాన్ థర్మల్ కన్వర్టర్లు . థర్మల్ (ఉష్ణం) కన్వర్టర్లు అణు క్షయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొంత వేడిని విద్యుత్తుగా మారుస్తాయి-రేడియోఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ (ఆర్టీజీ) తరచుగా అంతరిక్ష నౌకలో ఉపయోగింపబడుతుంది. బీటా వోల్టాయిక్ సెల్స వంటి నాన్-థర్మల్ కన్వర్టర్లు, విడుదలయ్యే రేడియేషన్ను వేడిగా క్షీణించక ముందే నేరుగా శక్తిని విద్యుత్ గా మారుస్తుంది. దీని వలన వీటినీ, చిన్న పరిమాణాల్లో చేయటం సులభకరం అవుతుంది . ఇవి పనిచేయడానికి థర్మల్ గ్రేడియంట్ కూడా అవసరం ఉండదు. అందుచేత వీటిని చిన్న యంత్రాలలో ఉపయోగించవచ్చు.

అటామిక్ బ్యాటరీలు కు సాధారణంగా 0.1-5% ఎఫిష్యన్సీ(క్షమత) ఉంటుంది. అధిక-సామర్థ్య బీటావోల్టాయిక్ పరికరాలు 6-8% సామర్థ్యాన్ని చేరుకోగలవు.[5]

  1. "A nuclear battery the size and thickness of a penny". Gizmag, 9 October 2009. http://www.gizmag.com/smaller-nuclear-battery/13076/
  2. "Tiny 'nuclear batteries' unveiled" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2009-10-08. Retrieved 2025-03-24.
  3. "NanoTritium™ Battery Technology". City Labs. Retrieved 25 May 2023.
  4. "Atomic Battery Converts Radioactivity Directly into Electricity". Popular Mechanics, April 1954, p. 87.
  5. "Thermoelectric Generators". electronicbus.com. Archived from the original on 10 January 2016. Retrieved 23 February 2015.