అట్లూరి పిచ్చేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్లూరి పిచ్చేశ్వర రావు
Atluri Pitcheswara Rao.jpg
జననం(1925-04-12) 1925 ఏప్రిల్ 12
చౌటపల్లి, కృష్ణా జిల్లా
మరణం1966 సెప్టెంబరు 26 (1966-09-26)(వయసు 41)
మరణానికి కారణంగుండెపోటు
నివాసంచెన్నై
వృత్తికథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త
జీవిత భాగస్వామిచౌదరాణి
పిల్లలుఅనిల్ అట్లూరి
తల్లిదండ్రులు
 • సీతారామస్వామి (తండ్రి)
 • శేషారత్నం (తల్లి)

అట్లూరి పిచ్చేశ్వర రావు (ఏప్రిల్ 12, 1925 - సెప్టెంబర్ 26, 1966), తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత.

జీవితం[మార్చు]

ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా యందు చౌటపల్లి గ్రామంలో ఏప్రిల్ 12, 1925 న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పులపర్రు గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కాలేజ్ లో పూర్తి చేశారు.[1] ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ, కె.సి.జి. పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కనిష్ఠ పుత్రికైన చౌదరాణిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.

రచనా జీవితం[మార్చు]

ఆయన తెలుగు దినపత్రిక అయిన విశాలాంధ్రలో కొంత కాలం పాటు పనిచేశారు. 1962 లో ఆయన మద్రాసు (ప్రస్తుతం చెన్నై)కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డాడు. ఆయన హిందీ భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, మరియు గాడిద ఆత్మ కథ. ఆ అనువాదంలో భాగంగా ఆయన అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో మనసులో మనిషీ ప్రాధాన్యత పొందింది.

"గౌతమ బుద్ద" మరియు "వీరేశ లింగం" అనే స్క్రీప్ట్స్ ఆయన రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమైనవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందారు.

మరణం[మార్చు]

ఆయన సెప్టెంబర్ 26, 1966లో గుండె పోటుతో మరణించారు.

పనులు[మార్చు]

ఆయన రచనలు కొన్ని:

 • జీవచ్ఛవాలు
 • నెత్తురు కథ
 • చిరంజీవి
 • గడవని నిన్న
 • ఆగస్టు 15 న
 • వెర్రి కాదు వేదాంతం
 • డొంకల వంకల మనసులు
 • శాస్త్రి
 • సబద్ధం
 • విముక్తి
 • గడచిన దినాలు
 • బ్రతకటం తెలియనివాడు
 • ఒక అనుభవం
అట్లూరి పిచ్చేశ్వర రావు కథనంతో వెలువడ్డ కొన్న చలన చిత్ర నవలలు
 • కృష్ణలీలలు,
 • వాగ్దానం
 • బాటసారి
 • ఆత్మ బంధువు
 • అనుబంధాలు
 • కొడుకులు కోడళ్ళు
 • చివరకు మిగిలేది
 • వీరి సంభాషణతో వెలువడ్డ చిత్రాలు:
 • వివాహబంధం,
 • కాంభోజరాజు కథ,
 • భార్య భర్తలు మొదలైనవి

సూచికలు[మార్చు]

 1. Unattributed (2011). "History of Machilipatnam". About Machilipatnam. Manakrishanazilla.com. Retrieved 4 January 2012.