అడవిదేవులపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అడవిదేవులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అడవిదేవులపల్లి  గ్రామం మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలోని దామరచర్ల మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అడవిదేవుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, తిరిగి మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+5 (ఆరు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా- మొత్తం 7,556 - పురుషుల సంఖ్య 3,843 - స్త్రీల సంఖ్య 3,713 - గృహాల సంఖ్య 1,891

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. ముదిమానికం
  2. అడవిదేవులపల్లి
  3. ఉల్షాయపాలెం
  4. ముల్కచర్ల
  5. బాలీన్‌పల్లి
  6. చిట్యాల

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

వెలుపలి లంకెలు[మార్చు]