అడిగుప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడిగుప్ప

Adiguppa

అడిగుప్ప
గ్రామం
దేశంభారత దేశము
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
జనాభా
(2011)
 • మొత్తం470
భాషలు
 • అధికారతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
సమీప గ్రామంగుమ్మగట్ట

అడిగుప్ప, అనంతపురం జిల్లా, గుమ్మగట్ట మండలానికి చెందిన గ్రామం[1][2] ఈ గ్రామం వందల యేళ్ళుగా మద్యం, మాంసం పై నిషేధం ఉంది.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో ఉంది. రాయదుర్గానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 95 ఇళ్లు ఉన్నాయి. 470 మంది నివసిస్తున్నారు. ఎవరూ కూడా మద్యం, కోడి మాంసం ముట్టరు. ఇది పూర్వం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయమని గ్రామస్థులు చెబుతున్నారు.

మధ్య, మాంస నిషేధం[మార్చు]

‘వందేళ్ల క్రితం ఈ ప్రాంతం సామంత రాజుల పాలనలో ఉండేది. చిత్రదుర్గం రాజులు తరచూ ఈ గ్రామంపై దాడి చేసి అందినకాడికి దోచుకుపోయేవారు. చిత్రదుర్గాన్ని పాలించే బుడిగే చిన్నయ్య అనే రాజు అడిగుప్ప మీద అర్ధరాత్రి దండ యాత్ర చేసేందుకు కుట్ర పన్నుతాడు. గ్రామంలోని సొమ్ము, బంగారు దోచుకోవాలని చూస్తాడు. దీనికోసం గ్రామంలో ఉన్న వారందరికీ మద్యాన్ని ఎరగా వేసి, కోడి మాంసాన్ని తినిపించి, మత్తులో మునిగేలా చేస్తాడు. రాజు అచ్చువళ్లి కాటనాయక్‌ రాజ్యంలో లేనప్పుడు బుడిగే చిన్నయ్య ఈ ప్రయత్నం చేస్తాడు. మను దాడుల నుంచి రక్షించాలంటూ ప్రజలందరూ సమీపంలోని కొండపై ఉన్న రాజుల దేవర గుడి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తికి దేవుడు పూని.. మీ గ్రామ కాపలాదారులకు కోడి మాంసం, మద్యం ఎరగా చూపి దాడులు చేస్తున్నారని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ గ్రామంలో ఎవరూ కోడి మాంసం, మద్యం ముట్టరాదని నియమం.[3] ఈ గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డుకు బదులు పండ్లు ఇస్తున్నారు. ఎవరైనా మద్యం తాగివస్తే వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు.

సమస్యా పరిష్కారాలు[మార్చు]

అడిగుప్ప గ్రామంలో ఇప్పటివరకూ పోలీసు కేసు నమోదు కాలేదు. అత్యాచారాలు, హత్యా ఉదంతాలే లేవు. గ్రామ కట్టుబాటును అందరూ గౌరవించాల్సిందే. చిన్నపాటి గొడవలు తలెత్తినా పోలీస్‌ స్టేషన్‌ వరకూ విషయాన్ని తీసుకెళ్లకుండా పెద్దలే రాజీ కుదుర్చుతారు. గ్రామ కట్టుబాటును ధిక్కరించే ప్రయత్నం చేస్తే ప్రజలంతా కలిసి గ్రామ బహిష్కరణ చేస్తారు.[4]

తొలిబిడ్డకు రాజుల పేర్లు[మార్చు]

పూర్వకాలం నుంచీ మా ఊర్లో వస్తున్న ఆచారం ప్రకారం ఇంట్లో మొదటి కాన్పులో పుట్టిన బిడ్డకు రాజుల దేవుని పేరును పెట్టుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో రాజులదేవుని పేరులేని సంతానం ఉండదు. ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ గ్రామంలో 102 మంది.. రాజమ్మ, రాజయ్య, రాజులయ్యలు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-05-08. Cite web requires |website= (help)
  2. అడిగుప్ప గ్రామ ఉనికి
  3. కోడి కూయని పల్లె! Sakshi |January 21, 2014
  4. మాంసం తినరు... మద్యం ముట్టరు 08-05-2016

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అడిగుప్ప&oldid=2892231" నుండి వెలికితీశారు