అడివి శంకరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడివి శంకరరావు
జననంఆగస్టు 7, 1948
సత్యనారాయణపురం, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
ప్రసిద్ధితెలుగు నాటకరంగ నటుడు, మేకప్ ఆర్టిస్టు.
భార్య / భర్తసుబ్బలక్ష్మి
పిల్లలుప్రేమసాయి, హేమమాలిని

అడివి శంకరరావు తెలుగు నాటకరంగ నటుడు, మేకప్ ఆర్టిస్టు.

జననం[మార్చు]

శంకరరావు 1948, ఆగస్టు 7న వేంకట చలపతి, కాశీవిశాలాక్షి అన్నపూర్ణ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్, విజయవాడలోని సత్యనారాయణపురంలో జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

1965లో విజయవాడ సత్యనారాయణపురంలోని ఎ.కె.టి.పి.హెచ్. పారశాలలో ఎస్.ఎస్.ఎల్.సి., 1968లో విజయవాడలోని ఐటిఐ కళాశాలలో మెషినిస్ట్ లో ఉత్తీర్ణత పొందాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1968, ఆగస్టు నెలలో స్క్రిప్టు రచయితగా నాటకరంగంలోకి ప్రవేశించి వివిధ నాటక సమాజాల్లో నటుడిగా, సాంకేతిక నిపుణుడుగా, సభ్యుడిగా కొనసాగాడు. కళాకారులు కె.ఎస్. శాస్త్రి దగ్గర మేకప్ లో శిక్షణ తీసుకున్న శంకరరావు అనేక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు. 1975నుండి పూర్తిస్థాయి మేకప్ ఆర్టిస్టుగా మారాడు.[1] ఆకాశవాణిలో శ్రవ్యనాటిక కళకారుడిగా కొనసాగుతూ, విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు.

నటుడిగా[మార్చు]

మేకప్ ఆర్టిస్టుగా[మార్చు]

  1. పరమాత్మ వ్యవస్థీతహః
  2. చివరి గుడిసె[2]

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

  1. కళామిత్ర బిరుదు (హనుమంతరాయ గ్రంథాలయం, విజయవాడ)
  2. కందుకూరి పురస్కారం - 2018 - (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం) [3][4]
  3. నంది పురస్కారం (2005) [5]
  4. ఉత్తమ ఆహార్యం - జగమే మాయ (నాటకం) - అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5.[6]

ఇతర వివరాలు[మార్చు]

  1. నాటకరంగానికి సంబంధించి వివిధ పత్రికలకు వ్యాసాలను రాశాడు.
  2. ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోలవరపు సూర్యప్రకాశరావు దగ్గర న్యాయనిర్ణయంపై అనుభవం గడించి నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

మూలాలు[మార్చు]

  1. ప్రపంచాన్ని చదవగలగడమే ఆహార్యం, ఆంధ్రజ్యోతి, చిత్తూరు ఎడిసన్, 25 జనవరి 2016, పుట. 16
  2. ప్రజాశక్తి, కర్నూలు కల్చరల్‌ (17 May 2016). "యానాది జాతుల యదార్థగాథ 'చివరి గుడిసె'". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
  3. The Hans India, Andhra Pradesh (17 April 2018). "Kandukuri theatre awards presentation on Apr 21". Retrieved 7 August 2019.
  4. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2018" (PDF). web.archive.org. Archived from the original on 7 మే 2018. Retrieved 7 August 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  5. నవరసం పలికించి.. నటనతో అలరించి, ఈనాడు, కర్నూల్ ఎడిషన్, 23 జనవరి 2017
  6. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.