అతికాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతికాయుడు
అతికాయుడు
రావణుడి కుమారుడు అతికాయుడు
తోబుట్టువులునరాంతక
దేవాంతక
త్రిశిర
పాఠ్యగ్రంథాలురామాయణం
తండ్రిరావణుడు
తల్లిధాన్యమాలిని

అతికాయుడు, రామాయణ ఇతిహాసంలో రావణుడి రెండవ భార్య ధాన్యమాలిని కుమారుడు.[1][2]

ఒకరోజు అతికాయుడు కైలాస పర్వతం మీద ఉన్న శివునికి కోపం తెప్పించాడు. దాందో శివుడు తన త్రిశూలాన్ని అతికాయుడిపై విసిరాడు. అప్పుడు అతికాయుడు ఆ త్రిశూలాన్ని గాలిలో పట్టుకుని దేవుడికి నమస్కరించాడు. శివుడు ప్రసన్నుడై అతికాయడికి విలువిద్య రహస్యాలు, దివ్య ఆయుధాలఉ అందించాడు.

ఇంద్రుడు ఆజ్ఞపై వాయుదేవుడు బ్రహ్మాస్త్రం ద్వారా మాత్రమే ఛేదించగల బ్రహ్మదేవుని అజేయమైన కవచం అతికాయకు లభించిందనే రహస్యాన్ని లక్ష్మణుడికి తెలియజేయశాడు. అసాధారణ నైపుణ్యాలు కల అతికాయుడిని బ్రహ్మ దేవుని శక్తివంతమైన ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి లక్ష్మణుడు చంపచవలసి వచ్చింది.

అతికాయుడు, అతని పినతండ్రి కుంభకర్ణుడు ఇద్దరూ మధు - కైటభ అనే రాక్షసుల అవతారాలుగా నమ్ముతారు. వీరు విష్ణువుచే మోసగించి చంపబడ్డారని అంటారు. మరొక నేపథ్యంలో కుంభకర్ణుడు విష్ణువుచే శపించబడిన ద్వారపాలకుడు జయవిజయుల అవతారంగా భావిస్తారు.

మూలాలు[మార్చు]

  1. James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M.
  2. Nāyuḍū, Su Śaṅkara Rājū; Shankar Raju Naidu, S. (1971). "A Comparative Study of Kamba Ramayanam and Tulasi Ramayan".