అతిమూత్రవ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతిమూత్రవ్యాధి
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 4326
MeSH {{{m:en:MeshID}}}

ఊహ తెలిసిన వయసులోనూ కొంత మంది పిల్లలకు మూత్రం మీద నియంత్రణ ఉండదు. అందుకే పడకమీదే మూత్రం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పక్క తడిపే ఈ అలవాటు కేవలం పిల్లల్లోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అయితే పెద్దవాళ్లలో అంటే 25 నుంచి 65 ఏళ్ల వయస్కుల్లో దాదాపు 10 శాతం మందిలో ఈ అలవాటు ఉందని ఇటీవలి అధ్యయనంలో బయటపడింది. పక్క తడిపే ఈ అలవాటు కేవలం ఒక ఆరోగ్య సమస్యగానే కాకుండా తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురిచేస్తుంది. అందుకే సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి.

నేపధ్యము[మార్చు]

స్త్రీలైనా పురుషులైనా వారికి తె లియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా పడిపోవడం గానీ, లేదా కొంత మొత్తంలో మూత్రం పడిపోవడం గానీ జరిగితే దాన్ని ఎనూరెసిస్ అంటారు. మూత్ర నియంత్రణ కోల్పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. వాటిలో మూత్రాశయ కండరాలు దెబ్బ తినడం ఒక కారణం. స్త్రీలలో ప్రత్యేకించి ప్రసవ సమయంలో ఆయా భాగాలు దెబ్బతినడం ఇందుకు కారణం కావచ్చు. వీరికి తుమ్మినా, గట్టిగా దగ్గినా బట్టల్లో మూత్రం పడుతుంది. లేదా బాత్‌రూమ్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. మధుమేహం లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, నడుముకు బలంగా దెబ్బతగిలిన వాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే, స్పాండిలైటిస్, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం, పార్కిన్‌సన్ వ్యాధి, ప్రొస్టేట్ గ్రంధిలో వాపు రావడం వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ పక్క తడిపే లక్షణం ఉంటుంది.

రకాలు[మార్చు]

స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్, అర్జ్ ఇన్‌కాంటినెన్స్ వంటి సమస్యలు కొందరిలో ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ఎక్కువ సార్లు మూత్రం వచ్చినట్టే అనిపిస్తుంది. బాత్‌రూమ్‌కు పరుగెత్తడమే తప్ప పెద్దగా రాదు. ఇందులో ఫంక్షనల్ ఇన్ కాంటినెన్స్ అనే మరో సమస్య ఉంది. మూత్రాశయం నిండిపోయి విసర్జనకు వెళదామని అనుకుంటూ ఉండగానే మూత్రం బట్టల్లో పడిపోతుంది. టెన్షన్‌లోనూ డిమెన్షియా సమస్య ఉన్నవారిలోనూ ఈ సమస్య ఉంటుంది. రాత్రి పూట పక్క తడిపే అలవాటు కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది.

డబుల్ ఇన్‌కాంటినెన్స్[మార్చు]

కొంత మందిలో మూత్రంతో పాటు మలం మీద కూడా నియంత్రణ ఉండదు. దీన్నే డబుల్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. 50 ఏళ్లు దాటిన స్త్రీలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ[మార్చు]

పక్కతడిపే ఈ వ్యాధిని ముఖ్యంగా లక్షణాల ఆధారంగానే నిర్ధారిస్తాం. మరికొన్ని సార్లు కొన్ని రకాల ఫిజికల్ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు అవసరమైతే స్ట్రెస్ టెస్ట్, యూరినరీ అనాలసిస్, ఆల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్ వంటి పరీక్షలద్వారా వ్యాధి నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది.

హోమియో వైద్యం[మార్చు]

ఈ సమస్యకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. మూత్రాశయ కండరాలను తిరిగి శక్తివంతంగా మార్చి మూత్రం మీద పూర్తి నియంత్రణ వచ్చేలా చేయడంలో అవి బాగా తోడ్పడతాయి. అయితే మందులతో పాటు కొన్నిరకాల వ్యాయామాలు కూడా చేయవలసి ఉంటుంది. వాటిలో కీగెల్ ఎక్సర్‌సైస్, పెల్విక్ ఎక్సర్‌సైస్ వంటివి ఈ సమస్యా నివారణలో కీలక భూమిక వహిస్తాయి. వీటితో పాటు కోనియం మాక్, సెలేనియం, పల్సటిల్లా, సేథియా, సబైనా వంటి మందులు ఈ సమస్యా నివారణలో ఎంతో తోడ్పతాయి. కాకపోతే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ తప్పకపోవచ్చు.

పక్క తడిపే అలవాటు[మార్చు]

ఎవరైతే తమకు తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తారో దాన్ని పక్కతడపడం లేదా బెడ్‌వెటింగ్ అంటారు. దీనిలో ప్రైమరీ నాక్‌టర్నల్ ఎనూరిసిస్, సెకండరీ నాక్‌టర్నల్ ఎనూరిసిస్ అంటూ రెండు ర కాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ సహజంగానే యాంటీడయూరిటిక్ హార్మోన్ అనేది ఉత్పన్నమవుతుంది. ఇది రాత్రివేళ మూత్ర ఉత్పత్తిని ఆపుతుంది. దీనితో పాటు పిరమిడల్ ట్రాక్ట్ డెవలప్‌మెంట్ కూడా ఈ పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇది సహజంగా రెండు నుంచి నాలుగేళ్ల పిల్లల్లో తయారుకావాలి. అలా తయారు కానప్పుడు సమస్య ఉన్నట్లు భావించాలి. ఏ వయసులో పిల్లలు మూత్రాన్ని ఆపుకోగలుగుతారో, రాత్రిపూట వచ్చిన తనంతట తాను లేచి బాత్‌రూమ్‌కు వెళ్లగలిగి ఉన్నపుడు, ఈ సమస్యతో బాధపడుతున్న వారు రాత్రిపూట మెలకువ రాక పక్కలోనే మూత్రం విసర్జించడాన్ని పీఎన్ఎస్ అని అంటారు. ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నెలలో రెండు సార్లు మూత్రం పోసినా సరే పక్క తడిపే అలవాటు ఉన్నట్లే. ఒక్కోసారి పక్క తడిపే అలవాటు తగ్గిపోయాక మళ్లీ మొదలుపెట్టడాన్ని ఎస్ఎన్ఆర్ అంటారు. ఆరు నెలలు మానేసి మళ్లీ మొదలు పెట్టడం. ఇది ఎక్కువగా పెద్దవాళ్లలో చూడవచ్చు.

పక్క మీద మూత్ర విసర్జన

కారణాలు[మార్చు]

వంశపారంపర్యంగా పక్క తడిపే అలవాటు వస్తుంది. పెద్దవాళ్లలో మద్యం ఎక్కువగా తాగటం, కాఫీ ఎక్కువగా తాగడం, కొన్ని సార్లు మూత్రం ఇన్ఫెక్షన్‌లు, మానసిక వైకల్యం, ఇతర సమస్యలు, టెన్షన్, సైకలాజికల్ సమస్యలు దీనికి కారణాలు. సరైన రీతిలో టాయ్‌లెట్ ట్రైనింగ్ ఇవ్వక పోవడం, ఫుడ్ అలర్జీలు, పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గటం, ఆత్మన్యూనత భావం పెరగటం జరుగుతుంది. ఈ సమస్య ఉన్న పిల్లలను కొట్టడం, బెదిరించడం వల్ల వారిని మరింత కుంగదీస్తుంది.

హోమియో చికిత్స[మార్చు]

పిల్లలకు హార్మోన్‌ల థెరపీ ఇచ్చినట్లయితే హార్మోన్స్, అభివృద్ధి సమస్యలు కచ్చితంగా తొలగించడమే కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఈ సమస్యకు హోమియో మందులు పరిష్కారం చూపిస్తాయి. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.