అతిశయోక్త్యలంకారము

వికీపీడియా నుండి
(అతిశయోక్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఒక వస్తువును మిగుల నతిశయముగా వర్ణించిన అది అతిశయోక్తి అలంకారము. కొన్ని సందర్భాల్లో కవులు ఒక వస్తువును వర్ణిస్తూ నిజానికి సాధ్యం కాని ఎన్నో సంగతులు ఆ వస్తువుకి ఆపాదిస్తారు. అది కేవలం కల్పనను హెచ్చించటం కోసమే కానీ నిజంగా అలా ఉందని కవుల భావన కాదు.

ఉదాహరణ : మా పాఠశాల భవనములు ఆకాశము నంటుచున్నవి. ఇక్కడ పాఠశాల భవనం ఆకాశాన్ని అంటడం అనేది అసాధ్యం కానీ ఆ ఊహ మాత్రం చేత వాక్యానికి చాలా అందం వచ్చింది. ఇదే అతిశయోక్తి అలంకారం.