అతుల్య ఘోష్
| అతుల్య ఘోష్ | |||
| పదవీ కాలం 1957 – 1967 | |||
| తరువాత | దేబెన్ సేన్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | అసన్‌సోల్ | ||
| పదవీ కాలం 1952 – 1957 | |||
| తరువాత | సుబిమాన్ ఘోష్ | ||
| నియోజకవర్గం | బుర్ద్వాన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1904 ఆగస్టు 28 జెజూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1986 ఏప్రిల్ 18 (వయసు: 81) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | బిభాబతి దేవి | ||
| నివాసం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అతుల్య ఘోష్ (28 ఆగస్టు 1904 - 18 ఏప్రిల్ 1986) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అతుల్య ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1948లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి, రెండు సంవత్సరాల తరువాత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన 1950లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేరి, 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బుర్ద్వాన్, 1957 & 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అసన్సోల్ నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
అతుల్య ఘోష్ 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా, నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిగా ఎంపిక చేయడానికి & ఆ తరువాత ఇందిరా గాంధీని ఎంపిక చేయడానికి ఆయన మద్దతు ఇచ్చాడు. కాంగ్రెస్ తో ఇందిరా గాంధీతో తెగతెంపులు చేసుకున్నప్పుడు, ఆయన 'సిండికేట్' అని పిలువబడే దానిలో భాగంగా వారితో ఉన్నారు & తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్)ను స్థాపించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on October 8, 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.