అత్తలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?అత్తలూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°31′53″N 80°14′34″E / 16.531351°N 80.242767°E / 16.531351; 80.242767
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 8 మీ (26 అడుగులు)
జిల్లా(లు) గుంటూరు
తాలూకాలు అమరావతి
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం

• 1.017
• 50.3%
లోక్‌సభ నియోజకవర్గం గుంటూరు
శాసనసభ నియోజకవర్గం పెదకూరపాడు
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 522436
• +08640
అత్తలూరు
—  రెవిన్యూ గ్రామం  —
అత్తలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
అత్తలూరు
అక్షాంశరేఖాంశాలు: 16°34′32″N 80°21′42″E / 16.575614°N 80.361679°E / 16.575614; 80.361679
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం అమరావతి
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 15.24 km² (5.9 sq mi)
జనాభా (2011)[1]
 - మొత్తం 4,783
 - పురుషుల సంఖ్య 2,406
 - స్త్రీల సంఖ్య 2,377
 - గృహాల సంఖ్య 1,188
పిన్ కోడ్ 522 436
ఎస్.టి.డి కోడ్

అత్తలూరు, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

  • అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున ఉంది. శివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితిలో అంతరభాగంగా ఉంది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
  • తూర్పు బజారు
  • నడిమ బజారు
  • పడమటి బజారు
  • పెద్ద పల్లె
  • చిన్న పల్లె
  • ఎరుకల గుడిసెలు

కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది. అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి కృష్ణానది నీటిని సరఫరా చేస్తున్నవి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

పురాతనమైన ఈ ఆలయాలను, అత్తలూరు గ్రామ శివారు గ్రామమైన నూతలపాటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ నూతలపాటి సురేంద్ర మరియు శ్రీ గాడిపర్తి సాయిబాబుల వితరణతో, దాదాపు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామస్థులు పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించారు. హంపీ విరూపాక్ష పీఠాధిపతి, విద్యారణ్యభారతిస్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,825.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,469, స్త్రీల సంఖ్య 2,356, గ్రామంలో నివాస గృహాలు 1,157 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,524 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,783 - పురుషుల సంఖ్య 2,406 - స్త్రీల సంఖ్య 2,377 - గృహాల సంఖ్య 1,188

సమీప గ్రామాలు[మార్చు]

బుచ్చయ్యపాలెం 3 కి.మీ, హుస్సైన్ నగరం 4 కి.మీ, కాశిపాడు 5 కి.మీ, మల్లాది 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన క్రోసూరు మండలం, తూర్పున అమరావతి మండలం, పశ్చిమాన అచ్చంపేట మండలం, ఉత్తరాన చందర్లపాడు మండలం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు గుంటూరు సిటీ; 2015, జూన్-1; 20వపేజీ.

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తలూరు&oldid=2144782" నుండి వెలికితీశారు