Jump to content

అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ

వికీపీడియా నుండి
(అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ నుండి దారిమార్పు చెందింది)

'అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి.'తెలుగు చలన చిత్రం,2007, ఏప్రిల్,6 న విడుదల.ఇ.వి.వి.సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, విదిశ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం శ్రీకృష్ణ సమకూర్చారు.

అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం ఇ.వి.వి.సత్యనారాయణ
కథ ప్రసాద్‌వర్మ
చిత్రానువాదం ఇ.వి.వి.సత్యనారాయణ,
[[వేగెశ్న సతీష్]
తారాగణం అల్లరి నరేష్‌,
విదిశ,
కౌశ,
సునీల్‌,
కృష్ణభగవాన్‌,
ఆలీ,
వేణుమాధవ్‌,
బ్రహ్మానందం,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
చలపతిరావు,
ఎల్బీ శ్రీరాం,
మల్లికార్జునరావు,
సత్య కృష్ణన్,
అభినయశ్రీ
సంగీతం శ్రీకృష్ణ
సంభాషణలు వేగెశ్న సతీష్
ఛాయాగ్రహణం వి.జయరామ్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఇ.వి.వి. సినిమా
విడుదల తేదీ 6 ఏప్రిల్, 2007
భాష తెలుగు

కథా గమనం

[మార్చు]

ఇది చక్కని హాస్యభరిత చిత్రం. దీనికి చిన్న సెంటిమెంటునుకూడా జోడించారు. అత్తిలి వెంకట రత్నం అనే ఆయన ఎన్నో ప్రజొపయోగ కార్యక్రామాలు చేసి మంచి పేరుప్రఖ్యతులు సంపాదిస్తాడు. ఆయన సంతానం ముగ్గురు కొడుకులు. ఒకడొక మందుబాబు, మరొకడు పేకబాబు, ఆఖరువాడు సత్తిబాబు, చదువుకున్నది ఎల్కేజీయే. సత్తిబాబు వడ్డీ వ్యాపారి అర్జెంటుగా అపర కుబేరుడైపోవాలన్నది అతని ఆశ. అలవికాని వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి వసూలు చేస్తుంటాడు. డబ్బు విషయంలో తమపర భేదం చూసుకోడు. అలాంటి సత్తిబాబుని అమ్ములు అనే అమ్మాయి ప్రేమిస్తుంది. అమ్ములు తండ్రికి అప్పుఇచ్చినందుకు తనకు వలవేస్తుందని అనుకుంటాడు సత్తిబాబు. ఆమెను ఆమె తండ్రి ఎదుటే అవమాన పరుస్తాడు. అలాంటి సత్తిబాబుని మార్చేందుకు వెంకటరత్నంగారి సహాయంతో చదువుకున్న ఒక లాయర్ తన కూతురుతో కలసి నాటకమాడి సత్తిబాబులో పరివర్తన తీసుకొస్తాడు. తరువాత నిజాన్ని గ్రహించి సత్తిబాబు అమ్ములును పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

సినిమాలో ఒక సన్నివేశము.

తారాగణం

[మార్చు]
  • అల్లరి నరేష్_అత్తిలి సత్తిబాబు
  • విదిశ శ్రీవాత్సవ _అమ్ములు
  • సునీల్_అత్తిలి సత్తిబాబు బ్రదర్
  • కృష్ణ భగవాన్_చైర్ పర్సన్
  • అలీ
  • వేణు మాధవ్
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం_లాయర్ జగన్నాథం
  • తమ్మారెడ్డి చలపతిరావు_చైర్ పర్సన్ బాడీగార్డ్
  • ఎల్.బి.శ్రీరామ్_అమ్ములు తండ్రి
  • మల్లికార్జునరావు
  • సత్య కృష్ణన్_రఘుబాబు భార్య
  • అభినయశ్రీ_మంగతాయారు
  • కౌశ రాచ్_ప్రణతి
  • బాబూ మోహన్
  • యం.ఎస్.నారాయణ
  • రఘుబాబు_అత్తిలి సత్తిబాబు బ్రదర్
  • కొండవలస లక్ష్మణరావు
  • చిత్తజల్లు లక్ష్మీపతి_మంగతాయారు అసిస్టెంట్
  • కాదంబరి కిరణ్
  • దువ్వాసి మోహన్
  • శ్రీనివాసరెడ్డి
  • ఉత్తేజ్_అత్తిలి సత్తిబాబు స్నేహితుడు
  • కళ్ళు కృష్ణారావు
  • గుండు సుదర్శన్
  • మహర్షి రాఘవ
  • ఉమాదేవి
  • కాకినాడ మల్లి
  • లతాశ్రీ
  • భార్గవి
  • అరుణ
  • అర్చన
  • ఎస్.ఎల్.భార్గవి
  • మౌనిక

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఇ.వి.వి.సత్యనారాయణ
  • సంగీతం: శ్రీకృష్ణ
  • కథ: ప్రసాద్ వర్మ
  • చిత్రానువాదం: వెగ్నేశ సతీష్, ఇ.వి.వి.సత్యనారాయణ
  • మాటలు: వెగ్నేశ సతీష్
  • ఛాయా గ్రహణం: వి.జయరామ్
  • కూర్పు: గౌతంరాజు
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ , సాయి శ్రీహర్ష, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • నేపథ్య గానం: ఉదిత్ నారాయణ, శ్రేయా ఘోషల్,సుచిత్ర, కె.ఎస్.చిత్ర, టిప్పు, నోయెల్ జేమ్స్, జెస్సీగిఫ్ట్, కార్తిక్, హరీష్ రాఘవేంద్ర
  • నిర్మాత: ఇ.వి.వి.సత్యనారాయణ
  • నిర్మాణ సంస్థ: ఇ.వి.వి.సినిమా
  • విడుదల:06:04:2007.

పాటల జాబితా

[మార్చు]

1.ఈ చలిగాలుల్లోన, రచన:సుద్దాల అశోక్ తేజ, గానం.ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్

2.నీపై మనసు, రచన: సాయిశ్రీహర్ష, గానం.సుచిత్ర, టిప్పు

3.అమృత వర్షంలా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె.ఎస్.చిత్ర, హరీష్ రాఘవేంద్ర

4.అమృత వర్షంలా, 2. రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె . ఎస్.చిత్ర, హరీష్ రాఘవేంద్ర

5.షేక్ బ్రేక్, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.నోయెల్ జేమ్స్, జెస్సీ గిఫ్ట్

6.రారా అంటే, రచన:సుద్దాల అశోక్ తేజ, గానం.శ్రేయా ఘోషల్, కార్తీక్.

విశేషాలు

[మార్చు]

సత్తిబాబా... కుక్క నోట్లో మాంసం ముక్క లాక్కొని పలావొండుకొనే రకం' ఇదొక డవిలాగు. జంద్యాల తరువాత హాస్యానికి జవాబు ఎవరనే ప్రశ్నకు టక్కున స్పురించే పేరు ఇవివి. హింస శృంగారం మితిమీరుతూ సకుటుంబముగా సినిమా చూడాలంటే బయపడే రోజుల్లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది.