అదితి అశోక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అదితి అశోక్
వ్యక్తిగత సమాచారం
జననం29 మార్చి1998 [1]
బెంగళూరు
ఎత్తు173
క్రీడ
దేశం173
క్రీడగోల్ఫ్
సాధించినవి, పతకాలు
ప్రపంచస్థాయి ఫైనళ్ళుఎల్ఇటి రూకీ ఆఫ్ ద ఇయర్ 2016

లేడీస్ యూరోపియన్ టూర్: 3 లేడీస్ యూరోపియన్ టూర్

ఏల్పీజీఏ టూర్
అదితి అశోక్

అదితి అశోక్ భారత దేశానికి చెందిన గోల్ఫ్ క్రీడాకారిణి 1998 మార్చి 29న జన్మించారు. 2016లో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్‌లో పాల్గొన్నారు. అదే ఏడాది జరిగిన లేడీస్ యూరోపియన్ టూర్‌లో విజయం సాధించిన తొలి భారతీయ గోల్ఫ్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా కెరియర్ ప్రారంభించిన తొలి ఏడాదే ఈ ఘనత సాధించారు అదితి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి మొత్తం 114 మంది గోల్ఫ్ క్రీడాకారిణులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు.[2]

కేవలం 18 ఏళ్ల ప్రాయంలోనే భారతీయ క్రీడారంగంలో తనదైన ముద్ర వేశారు అశోక్. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌లో పాల్గొన్న ఏకైక గోల్ఫ్ క్రీడాకారణి ఆమె.[3]

2006లో దిల్లీ వేదికగా మహిళల గోల్ఫ్ టోర్నమెంట్‌ జరిగింది. భారతీయ మహిళలు ఈ క్రీడలో అడుగుపెట్టడం అదే తొలిసారి.[2]

వ్యక్తిగతజీవితం-నేపథ్యం[మార్చు]

బెంగళూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు అశోక్. తన ఆరేళ్ల వయసులో తొలిసారిగా గోల్ఫ్ క్రీడ పట్ల ఆకర్షితులయ్యారు. కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్‌కి చెందిన పచ్చని గోల్ఫ్  కోర్స్‌పై ఆమె సాధన చేసేవారు. మొదట్లో తన తండ్రి వద్దే ఈ క్రీడలో మెళుకువలు నేర్చుకున్నారు. అదితి తండ్రి పండిట్ గుడ్లమణి అశోక్ ఓ రకంగా ఆమె కెరియర్ ప్రారంభంలో కోచ్‌గా వ్యవహరించారని చెప్పవచ్చు.[4]

ఓ వైపు ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో చదువు మరోవైపు గోల్ఫ్ పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమ.. రెండింటి మధ్య సతమతమవుతూనే ఆమె క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనేవారు.

తన విషయంలో క్రెడిట్ అంతా తన తల్లిదండ్రులదే అంటారు అశోక్. వారు తనకు అన్ని సమయాల్లోనూ తగిన మద్దతు ఇచ్చారని చెబుతుంటారు. లెపెల్ పిన్స్ సేకరించడం ఆమె హాబీ.[5]

సేవ్ బెలస్తెరోస్..[2] ఆమెకు ఇష్టమైన గోల్ఫ్ క్రీడాకారుడు. సెయింట్ ఆండ్రూస్‌లోని ఓల్డ్ కోర్స్ ఆమెకు ఇష్టమైన గోల్ఫ్ మైదానం.

వృత్తిలో విజయాలు[మార్చు]

13 ఏళ్ల వయసులోనే అశోక్ రాష్ట్ర స్థాయిలో తన సత్తా చాటారు.  2011లో జరిగిన కర్నాటక జూనియర్, [6]  సౌత్ ఇండియన్ జూనియర్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచారు. అదే ఏడాది జాతీయ అమెచ్యూర్ టైటిల్‌ కూడా సాధించారు.

ఆ తరువాత 2012 నుంచి వరుసగా 3 ఏళ్ల పాటు జాతీయ జూనియర్ ఛాంపియన్ షిప్స్ సాధించారు. 2014లో జూనియర్స్, సీనియర్ రెండు విభాగాల్లోనూ ఆమె విజేతగా నిలిచారు.

2013లో జరిగిన ఏసియన్ యూత్ గేమ్స్, 2014లో జరిగిన యూత్ ఒలంపిక్స్, అలాగే అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఏకైక గోల్ఫర్‌గా అశోక్[7]  నిలిచారు.

2015లో లేడిస్ బ్రిటిష్ అమెచ్యూర్ స్ట్రోక్ ప్లే ఛాంపియన్ షిప్ సాధించారు. 2016 జనవరి 1న ఆమె ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా తన కెరియర్లో మరో అంకాన్ని ప్రారంభించారు.

2016లో రియో ఒలంపిక్స్‌లో పాల్గొనేనాటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు. అతి పిన్న వయసులోనే ఒలంపిక్స్‌లోని గోల్ఫ్ క్రీడలో ప్రాతినిద్యం వహించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు భారతదేశం తరపున అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొన్న తొలి మహిళా క్రీడాకారిణిగా కూడా ఘనత సాధించారు అశోక్.[4][6]

అక్టోబరులో మొదటిసారి లేడిస్ యూరోపియన్ టూర్‌లో విజయం రుచి చూసిన అశోక్, ఆ తరువాత స్వదేశంలో జరిగిన విమెన్స్ ఇండియన్ ఓపెన్‌ను కూడా కైవసం చేసుకున్నారు.[4]

ఆ తరువాత ఖతార్‌లో జరిగిన లేడిస్ ఓపెన్‌లో విజయం సాధించిన ఆమె ‘LET Rookie of the Year’ అవార్డు సాధించారు. ఆ తరువాత 2017లో అమెరికా టూర్‌లో భాగంగా ద లేడిస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టూర్ కార్డ్ కూడా సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి అశోక్ కావడం విశేషం.[8] 2018లో 24, 2019లో 22 ఈవెంట్లలో పాల్గొన్న అశోక్, వలంటీర్స్ ఆఫ్ అమెరికా, ఎల్పీజీఏ టెక్సస్ క్లాసిక్‌లలో టాప్ టెన్ ఫినిషెస్ చేసి రికార్డు సృష్టించారు .[5]

మూలాలు[మార్చు]

  1. EENADU (7 August 2021). "పతకం రాకుంటే ఏంటి? అందరికీ ముద్దుబిడ్డ అయింది! - everything you need to know about young golfer aditi ashok". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  2. 2.0 2.1 2.2 Ris, M. M.; Deitrich, R. A.; Von Wartburg, J. P. (1975-10-15). "Inhibition of aldehyde reductase isoenzymes in human and rat brain". Biochemical Pharmacology. 24 (20): 1865–1869. doi:10.1016/0006-2952(75)90405-0. ISSN 0006-2952. PMID 18.
  3. "Aditi Ashok Biography, Olympic Medals, Records and Age". Olympic Channel. Retrieved 2021-02-19.
  4. 4.0 4.1 4.2 "Olympics 2016: 5 Things To Know About Indian Golfer Aditi Ashok". Golf (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-19.
  5. 5.0 5.1 "Bio | LPGA | Ladies Professional Golf Association". LPGA. Retrieved 2021-02-19.
  6. 6.0 6.1 "18 की उम्र में कामयाबी जिसके कदम चूमती है". BBC News हिंदी (in హిందీ). Retrieved 2021-02-19.
  7. "Aditi Ashok Profile: Women's golf". The Indian Express (in ఇంగ్లీష్). 2016-08-01. Retrieved 2021-02-19.
  8. "India's women golfers start to make presence felt". Olympic Channel. Retrieved 2021-02-19.

భాగంగా ద లేడిస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టూర్ కార్డ్ కూడా సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి అశోక్ కావడం విశేషం.[1]

2018లో 24, 2019లో 22 ఈవెంట్లలో పాల్గొన్న అశోక్, వలంటీర్స్ ఆఫ్ అమెరికా, ఎల్పీజీఏ టెక్సస్ క్లాసిక్‌లలో టాప్ టెన్ ఫినిషెస్ చేసి రికార్డు సృష్టించారు .[2]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; best Indian female golfer అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు