అధికార మార్పిడి - 1942-47
| రచయిత(లు) | క్లెమెంట్ ఆట్లీ (చర్చిల్ యుద్ధ మంత్రివర్గంలో డిప్యూటీ ప్రధానమంత్రి) |
|---|---|
| దేశం | యునైటెడ్ కింగ్‌డమ్ |
| భాష | ఇంగ్లీషు |
| Series | బ్రిటన్, భారతదేశాల మధ్య రాజ్యాంగ సంబంధాలు |
| విషయం | బ్రిటన్-భారత రాజ్యాంగ సంబంధాలు, వలస పాలన, భారత స్వాంత్ర్య ఉద్యమం |
| శైలి | చారిత్రిక పత్రాలు, రాజకీయ చరైత్ర, వలసవాద అధ్యయనాలు |
| Set in | బ్రిటిషు భారతదేశం (1942–1947) |
| ప్రచురణ సంస్థ | 1970–1982 |
| ప్రచురణ కర్త | స్టేషనరీ ఆఫీసు, లండన్ |
ప్రచురించిన తేది | 1970–1982 |
| మీడియా రకం | ముద్రణలో (బౌండు అట్టతో) |
| పుటలు | 12 సంపుటాలు (ఒక్కొక్కటీ 1,000+ పేజీలకు పైనే) |
| OCLC | 59085856 |
| 954.03 | |
| LC Class | DS480.45 .G74 |
| Website | https://archive.org/details/transferofpower10006unse |
| సంపాదకుడు P. N. S. మాన్‌సెర్గ్, సహాయకుడు E. W. R. లంబీ; బ్రిటన్-భారత రాజ్యాంగ సంఘటనలను అక్షరబద్ధం చేసిన అధికారిక ప్రచురణ, 1942–1947. | |
అధికార బదిలీ - 1942–47 అనేది బ్రిటను, భారతదేశాల మధ్య రాజ్యాంగ సంబంధాలు, వలస విధానాలు, స్వాతంత్ర్యానికి ముందు పరిపాలనా నిర్ణయాలపై ఆధారపడిన ఒక విస్తృతమైన డాక్యుమెంటరీ సంకలనం. పన్నెండు సంపుటాలుగా విభజించబడిన ఈ ప్రచురణలో, 1942 జనవరి నుండి 1947 ఆగస్టు 15 వరకూ ఉన్న కాలానికి సంబంధించిన ముఖ్యమైన అధికారిక పత్రాలు, వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలు, పరిపాలనా నివేదికలు, దౌత్య రికార్డులను సంకలనం చేసారు. భారతదేశ రాజకీయ చరిత్రను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా మొత్తం దక్షిణాసియా ప్రాంత చరిత్రకు కూడా ఒక ప్రాథమిక మూలంగా దీన్ని పరిగణించబడుతుంది.[1][2][3]
సంకలనం, ప్రచురణ
[మార్చు]స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా విధానాలు, నిర్ణయాలు, రాజకీయ ప్రక్రియలను నమోదు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తద్వారా భవిష్యత్ పరిశోధకులు, చరిత్రకారులు, విధాన రూపకర్తలు సమకాలీన రికార్డుల పూర్తి సముదాయాన్ని నేరుగా పొందగలుగుతారు.[4]
ఈ ధారావాహిక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ పాలన సంక్షోభం, భారత స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రతరం కావడం, ఉపఖండపు పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వగైరాలను అన్వేషిస్తుంది. సామ్రాజ్యవాద శక్తి క్షీణత, జాతీయవాద రాజకీయాల పెరుగుదల, వలస నుండి సార్వభౌమ రాజ్యంగా అవతరించడంలో జరిగిన చారిత్రక పరివర్తనను ఇది ప్రతిబింబిస్తుంది.[5]
హౌస్ ఆఫ్ కామన్స్‌లో హెరాల్డ్ విల్సన్ చేసిన ప్రకటన తరువాత 1967 జూన్‌లో ఈ సంకలనం ప్రారంభమైంది. 1970, 1982 మధ్య, లండన్ స్టేషనరీ ఆఫీసు పన్నెండు సంపుటాలను వరుసగా ప్రచురించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రిటిష్ కామన్వెల్త్ చరిత్ర పండితుడు ప్రొఫెసర్ పి.ఎన్.ఎస్. మాన్సెర్గ్ సంపాదకత్వం వహించగా, ఇ.డబ్ల్యు.ఆర్. లంబీ సహాయ సంపాదకుడిగా పనిచేసాడు.[6]
చారిత్రక ప్రాముఖ్యత
[మార్చు]1942–47 అధికార బదిలీ, దక్షిణాసియా రాజకీయ చరిత్రలో ఒక పరివర్తన కాలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సిరీస్‌లోని పత్రాల ద్వారా బ్రిటిషు వలస విధానం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దౌత్య సందర్భం, సామ్రాజ్య పాలన నుండి స్వీయ-నిర్ణయాధికారానికి జరిగిన పరివర్తన తదితరాలపై సాక్ష్యాధారిత విశ్లేషణ లభిస్తుంది. దక్షిణాసియా వలస చరిత్ర, భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ స్వాతంత్ర్య ప్రక్రియలనూ, బ్రిటిషు పరిపాలన విధానాలనూ అధ్యయనం చేయడానికి ఇది ఒక ప్రాథమిక మూలం. ఈ సిరీస్‌లోని వివరణాత్మక వ్యాఖ్యానాలు, కాలక్రమ పట్టికలు, వ్యక్తుల సూచికలు దీని పాండిత్య విలువను పెంచుతాయి.[7]
బెంగాల్ కరువుపై ఒక సంపుటి
[మార్చు]నాలుగవ సంపుటి ప్రత్యేకంగా 1943–44 నాటి బెంగాల్ కరువుపై దృష్టి పెడుతుంది. రాజకీయ పత్రాలపై దృష్టి సారించే ఇతర సంపుటాల వలె కాకుండా, ఇది ఆహార కొరత, పరిపాలనా వైఫల్యాలు, కరువు కాలం నాటి మానవతా విపత్తుకు సంబంధించిన రికార్డులున్నాయి. గవర్నరు, వైస్రాయిలు ఆహార సంక్షోభం గురించి పదేపదే హెచ్చరించినప్పటికీ, యుద్ధకాలపు బ్రిటిషు మంత్రివర్గం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించడంలో విఫలమైందని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. కరువుకు సంబంధించిన అదనపు సామగ్రి భారత జాతీయ ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి, పరిశోధనకు విలువైన వనరుగా ఉపయోగపడుతుంది.[8]
కంటెంటు, నిర్మాణం
[మార్చు]కాలక్రమానుసారంగా అమర్చినప్పటికీ, ఈ శ్రేణిలోని ప్రతి సంపుటి ఒక నిర్దుష్ట రాజకీయ లేదా పరిపాలనా దశపై దృష్టి పెడుతుంది. సంపుటాల శీర్షికలు, ప్రచురణ సంవత్సరాలూ ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- ది క్రిప్స్ మిషన్, జనవరి– 1942 ఏప్రిల్ (1970లో ప్రచురించబడింది)
- క్విట్ ఇండియా ఉద్యమం, ఏప్రిల్ 30–సెప్టెంబరు 211942 (1971లో ప్రచురించబడింది)
- అధికార పునరుద్ధరణ, గాంధీ నిరాహార దీక్ష, 1942 సెప్టెంబరు 21 – 1943 జూన్ 12 (1971లో ప్రచురించబడింది)
- బెంగాల్ కరువు, వైస్రాయల్టీ, 1943 జూన్ 15 – 1944 ఆగస్టు 31 (1973లో ప్రచురించబడింది)
- సిమ్లా సమావేశం: నేపథ్యం, కార్యకలాపాలు, 1944 సెప్టెంబరు 1 – 1945 జూలై 28 (1975లో ప్రచురించబడింది)
- యుద్ధానంతర దశ, లేబరు ప్రభుత్వపు చర్యలు, 1945 ఆగస్టు 1 – 1946 మార్చి 22 (1976లో ప్రచురించబడింది)
- క్యాబినెట్ మిషన్, 1946 మార్చి 23 - జూన్ 20 (1977లో ప్రచురించబడింది)
- తాత్కాలిక ప్రభుత్వం, 1946 జూలై 3–నవంబరు 1 (1979లో ప్రచురించబడింది)
- కాలపరిమితిని నిర్ణయించడం, 1946 నవంబరు 4 – 1947 మార్చి 22 (1980లో ప్రచురించబడింది)
- మౌంట్‌బాటెన్ వైస్రాయల్టీ: ప్రణాళికల రూపకల్పన, 1947 మార్చి22 – మే 30 (1981లో ప్రచురించబడింది)
- మౌంట్‌బాటెన్ వైస్రాయల్టీ: జూన్ 3 ప్రణాళిక – ప్రకటన, ఆమోదం, 1947 మే 31– జూలై 7 (1982లో ప్రచురించబడింది)
- వివరణాత్మక గమనికలు, అనుబంధాలు, అదనపు అధికారిక పత్రాలను కలిగి ఉన్న అనుబంధ పత్రాలు, అజెండాలు .
తుది సంపుటిలో వివరణాత్మక ఫుట్‌నోట్‌లు, ఒక అనుబంధం, మొత్తం సిరీస్‌కు సమగ్రమైన పూరకంగా పనిచేసే మూడు అనుబంధ పత్రాలూ ఉన్నాయి.[9]
మూలాలు, ప్రామాణికత
[మార్చు]ఈ శ్రేణిలో సంకలనం చేయబడిన పత్రాలను ప్రధానంగా ఇండియా ఆఫీస్ రికార్డ్స్, ఇండియా ఆఫీస్ లైబ్రరీలో భద్రపరచబడిన వైస్రాయ్‌ల వ్యక్తిగత సేకరణల నుండి తీసుకున్నారు. ప్రధాన వనరులలో ఇవి ఉన్నాయి:
- గవర్నర్లు, వైస్రాయ్‌ల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు
- వైస్రాయ్, భారత విదేశాంగ కార్యదర్శి మధ్య జరిగిన సంప్రదింపులు
- రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో క్యాబినెట్ కమిటీ సమావేశాల మినిట్స్
- ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారిక నివేదికలు, మెమోరాండాలు, కమ్యూనికేషన్లు
ఈ సేకరణలో భారత విధానానికి సంబంధించి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, బ్రిటిష్ డొమినియన్ల మధ్య జరిగిన సంభాషణల ఆధారాలు కూడా ఉన్నాయి.[10][11]
ఇవి కూడా చూడండి
[మార్చు]- రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం
- భారతదేశ విభజన
- 1943 నాటి బెంగాల్ కరువు
మూలాలు
[మార్చు]- ↑ P. N. S. Mansergh, ed. (1970). The Transfer of Power 1942–7. Volume 1: The Cripps Mission, January–April 1942. Constitutional Relations between Britain and India. London: HMSO. Retrieved 9 October 2025.
- ↑ P. N. S. Mansergh; Penderel Moon, eds. (1980). The Transfer of Power, 1942–47. Volume 9: The Fixing of a Time Limit, 4 November 1946–22 March 1947. London: HMSO. ISBN 0115800840. Retrieved 9 October 2025.
- ↑ Umar, Badruddin (1994). "British Conquest and Transfer of Power in India". Communalism (in Bengali) (9th, 2015 ed.). Dhaka, Bangladesh: Mawla Brothers. pp. 37–42. ISBN 9844100453.
- ↑ P. N. S. Mansergh, ed. (1982). India: The Transfer of Power, 1942–47, Vol. 11. London: HMSO. Retrieved 9 October 2025.
- ↑ The Transfer of Power 1942–7 (12 vols) — Full Set Listing & Scans (in ఇంగ్లీష్). 1970. ISBN 978-0-11-580016-0. Retrieved 9 October 2025.
{{cite book}}:|work=ignored (help) - ↑ "Constitutional Relations between Britain and India: The Transfer of Power 1942–7, Vol. IX". Indian Culture (Government of India) (in ఇంగ్లీష్). Retrieved 9 October 2025.
- ↑ . "The Transfer of Power 1942–47, Volume VI… and Volume VII… (Review)". Cambridge University Press.
- ↑ "Britain's India Policy". The National Archives (UK) (in ఇంగ్లీష్). Retrieved 9 October 2025.
- ↑ "British Sources — Modern India and South Asia Guide". Harvard Library Research Guides (in ఇంగ్లీష్). 11 September 2025. Retrieved 9 October 2025.
- ↑ Lancaster, J.. "The Archives in the India Office Records". Wiley.
- ↑ Ankit, Rakesh. "Towards the Publication of The Transfer of Power Documents". Taylor & Francis.