అధిక ఋతుస్రావం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అధిక ఋతుస్రావం
Menorrhagia
ICD-10N92.0
ICD-9627.0
DiseasesDB22575
eMedicinemed/1449
MeSHD008595

ఋతుచక్రంలో ఎక్కువగా రక్తస్రావం (bleeding) అవడాన్ని 'అధిక ఋతుస్రావం' (menorrhagia) అంటారు. ఇవి 3-5 రోజులలోనే మామూలుగా కంటే ఎక్కువగా పోవచ్చు లేదా ఇంకా ఎక్కువ రోజులు జరగవచ్చును. దీనికి రక్తం గడ్డకట్టంలో దోషాలు, హార్మోనులకు సంబంధించిన పొరపాట్లు లేదా గర్భాశయంలోపలి పొరకు సంబంధించిన వ్యాధులు ముఖ్యమైన కారణాలు. కొందరిలో నొప్పి కూడా ఉండావచ్చు.

కారణాలు

[మార్చు]
  • గర్బాశయంలో లేదా అండాశయంలో గడ్డలు :
  • కుటుంబ నియంత్రణ సాధనాలు : కొంతమందిలో ఐ.యు.సి.డి. గర్భాశయాన్ని అస్థిరంచేసి రక్తస్రావం జరిగేలా చేస్తాయి.
  • థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన వ్యాధులు : థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేస్తున్నవారిలో కనిపిస్తుంది.
  • గర్భస్రావం : గర్భధారణ తరువాత అధిక రక్తస్రావం అవుతుంటే అబార్షన్ కి లేదా అబార్షన్ జరగబోతుందనడానికి సంకేతం. గర్భం కొనసాగడానికి లేదా గర్భాన్ని పూర్తిగా తొలగించడానికి తొందరగా చర్యలు తీసుకోవాలి.
  • గర్భాశయంలో తిత్తులు :
  • గర్భాశయంలో కాన్సర్ : బహిష్టులు ఆగిపోయిన కొంతకాలం తరువాత తిరిగి కనిపిస్తే దీని గురించి అనుమానించాలి.
  • కటివలయంలో వాపు : బహిష్టుస్రావం, కడుపునొప్పి, జ్వరంతో కలిసిన జననేంద్రియాలలో వాపును సూచిస్తుంది.
  • రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులు : కొంతమంది పక్షవాతం వచ్చినవారు రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులను వాడుతుంటారు. ఇందువలన స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

Menorrhagia CDC

నష్టాలు

[మార్చు]

అధిక రక్తస్రావం ఎక్కడనుండి జరిగినా కొంతవరకు మన శరీరంలోని ఎముకమజ్జ నుండి కొత్తగా రక్తం ఉత్పత్తి అయి ఆలోటును భర్తీ చేస్తుంది. కానీ ఇది బాగా ఎక్కువగా గానీ లేదా ఎన్నో నెలలు వరుసగా జరిగినప్పుడు ఎముకమజ్జ ఆ లోటును పూడ్చలేకపోవడం వల్ల రక్తహీనత కలుగుతుంది. దీనిమూలంగా నీరసం, తలనొప్పి మొదలైన ఇబ్బందులు కలుగుతాయి.

ఇది కూడా చూడండి

[మార్చు]

ఎండోమెట్రియోసిస్