అనంతుల మదన్ మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతుల మదన్ మోహన్
శాసనసభ సభ్యుడు
సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
In office
1970–1985
అంతకు ముందు వారువి.బి.రాజు
తరువాత వారుకె.చంద్రశేఖర రావు
వ్యక్తిగత వివరాలు
జననం(1932-11-16)1932 నవంబరు 16
మైలారం, వరంగల్ జిల్లా
మరణం2004 నవంబరు 1(2004-11-01) (వయసు 71)
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నివాసంకొండపాక, గజ్వేల్, సిద్ధిపేట జిల్లా

అనంతుల మదన్ మోహన్ (నవంబర్ 16, 1932 - నవంబర్ 1, 2004) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1970 నుండి 1983 మధ్యకాలంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అనంతుల మదన్ మోహన్ 1932, నవంబర్ 16న వరంగల్ జిల్లా, మైలారం లోని తన అమ్మమ్మ గారింట్లో జన్మించాడు. ఈయన తండ్రి చక్రపాణి నిజాం కాలములో కరీంనగర్ జిల్లాలో నాయబ్ తహసిల్దారుగా (డిప్యూటీ ఎమ్మార్వో) పనిచేసేవాడు. కొండపాకలో ప్రాథమిక విద్యాభ్యాసాన్నిపూర్తి చేసిన మదన్ మోహన్, హైస్కూల్, మెట్రిక్యూలేషన్ చదువుని వరంగల్లులో, హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. 1955 నుండి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యేసరికి జనగాం, వరంగల్లులో, హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసుచేస్తూ సమకాలీన రాజకీయాలను పరిశీలిస్తూ, అధ్యయనము చేస్తుండేవాడు.

రాజకీయరంగం[మార్చు]

1956, నవంబర్ 1న హైదారాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రములో కలుపగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణా ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేధావులు, యువకులు, సామాజిక కార్యకర్తల కలయికతో బషీర్‌ బాగ్ ప్రెస్ క్లబ్ లో 1969, ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్పడింది. యువకుడు, విద్యావంతుడు, మేధావి, న్యాయవాదైన అనంతుల మదన్ మోహన్ తెలంగాణా ప్రజా సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.అతను 1970లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందాడు. తరువాత 1972, 1978, 1983 ఎన్నికలలో సిద్దిపేట స్థానంనుండి గెలుపొంది శాసనసభ్యునిగా తన సేవలనందించాడు.[2]

మరణం[మార్చు]

మదన్ మోహన్ 2004, నవంబర్ 1న హైదరాబాద్లో మరణించాడు. 2008లో కొండపాక గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డిచే మదన్ మోహన్ విగ్రహం ఆవిష్కరించబడింది.

మూలాలు[మార్చు]

  1. ది హిందూ, Andhra Pradesh (2 November 2017). "Former Minister Madan Mohan passes away". Retrieved 16 November 2017.
  2. Sakshi (8 November 2018). "ఎన్టీఆర్‌ ప్రభంజనానికి ఎదురొడ్డి." Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.