అనంత శ్రీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత శ్రీరామ్
165x219px
జననంచేగొండి అనంత శ్రీరామ్
(1984-04-08) 1984 ఏప్రిల్ 8 (వయస్సు: 35  సంవత్సరాలు)
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లుఅనంత శ్రీరామ్
వృత్తిసాహితీకారుడు
క్రియాశీలక సంవత్సరాలు2005 - ఇప్పటివరకు

అనంత శ్రీరామ్ (జననం 1984 ఏప్రిల్ 8) ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయిత కాగలిగాడు. మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతాడు.

 1. ఏ మాయ చేశావె (2010)
 2. కుర్రాడు (2009)
 3. ఓయ్ (2009)
 4. పిస్తా (2009)
 5. మిత్రుడు (2009)
 6. ఆకాశమంత (2009)
 7. అరుంధతి (2009)
 8. సత్యమేవ జయతే (2009)
 9. శశిరేఖా పరిణయం (Jan 1st 2009)
 10. బలాదూర్ (2008)
 11. కొత్త బంగారు లోకం (2008)
 12. పరుగు (2008)
 13. కంత్రి (2008)
 14. చందమామ (2007)
 15. యమదొంగ (2007)
 16. మున్నా (2007)
 17. మాహారథి (2007)
 18. స్టాలిన్ (2006)
 19. బొమ్మరిల్లు (2006)
 20. అందరివాడు (2005)
 21. ఒక ఊరిలో ( 2005)

పురస్కారాలు[మార్చు]

 1. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.[1]

మూలాలు[మార్చు]