Jump to content

అనంత (సినిమా)

వికీపీడియా నుండి
అనంత (సినిమా)
(2026 తెలుగు, తమిళం, హిందీ సినిమా)
దర్శకత్వం సురేష్ కృష్ణ
నిర్మాణం గిరీష్ కృష్ణమూర్తి
రచన సురేష్ కృష్ణ
కథ సురేష్ కృష్ణ
తారాగణం జగపతి బాబు, సుహాసిని, నిజల్గళ్ రవి, తలైవజల్ విజయ్
సంగీతం దేవా
సంభాషణలు పి. రాజేంద్ర కుమార్ - తెలుగు
పి. విజయ్ - తమిళం
ఛాయాగ్రహణం బి. ఎల్. సంజయ్
కూర్పు ఎస్. రిచర్డ్
దేశం భారతదేశం
భాష తెలుగు, తమిళం, హిందీ

'అనంత' (సినిమా) పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రేమతత్త్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న తెలుగు సినిమా. ఇది 2026లో విడుదలైంది. జగపతిబాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్‌కృష్ణ రచయిత, దర్శకుడు. ఇన్నర్‌వ్యూ పతాకంపై టాటా మెడికల్ అండ్ డైయాగ్నస్టిక్ లిమిటెడ్ కు ప్రధాన కార్యనిర్వహణాధికారి (CEO), సంచాలకుడు (MD) అయిన గిరీష్‌ కృష్ణమూర్తి నిర్మించాడు.[1]

సినిమా ఆరంభం

[మార్చు]

2009లో సత్యసాయిబాబా జీవిత చరిత్రను చిత్రంగా చేయాలని ఒక మిత్రుడు చెప్పినట్లు సురేష్ కృష్ణ చెప్పాడు. దీని కొరకు తాను పుట్టపర్తి వెళ్ళినప్పుడు బాబా చెప్పినట్లుగా మాటలు వినపడ్డాయని కూడా చెప్పాడు. ఆయన తనను చూసి 'ఇంతకాలం ఎందుకు రాలేదు' అని అడిగారు, అది తన మనసుని ఎంతో కదిలించింది అని సురేష్ కృష్ణ పేర్కొన్నాడు. 2011లో బాబా చనిపోయారు. తరువాత ఒక రోజు తెల్లవారుఝామున 3.30కి తన కలలోకి వచ్చి విబూది ఇచ్చారని తన దర్శకత్వంతో సినిమా చేయడం గురించి రత్నాకర్ తో చర్చించినట్లు ఒక మిత్రుడు చెప్పాడు అని సురేష్ కృష్ణ చెప్పాడు. ఆ చిత్ర నిర్మాత గిరీష్ కృష్ణమూర్తి తనకు కూడా కలలో చిత్ర నిర్మాణం గురించి ఆదేశం వచ్చిందని, ఆవిధంగా తాను సాయిబాబా శతజయంతి సందర్భంగా చిత్రాన్ని ఆరంభించినట్లు పేర్కొన్నాడు[2][3]

నిర్మాణ విశేషాలు

[మార్చు]

అనంత చిత్రం సత్యసాయి బాబా గురించిన ఆధ్యాత్మిక సినిమా, చెన్నై మెట్రో నగరంలో ఆవిష్కృతమైంది. దీని అధికారిక టీజర్, ఆడియో ఆవిష్కరణ 2025 నవంబరు 10న జరిగింది. ఈ కార్యక్రమం మ్యూజిక్ అకాడమీ ప్రాంగణంలో జరిగింది. తేనిసాయి తెంద్రల్ దేవా సంగీతం సమకూర్చారు. ఇందులో ఇతర పాత్రలలో వైజి మహేంద్రన్, తలైవాసల్ విజయ్ ఇంకా కళాకారుల బృందం ఉంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, దర్శకుడు సురేష్ కృష్ణ “ఐదు అసాధారణ కథలను, ఐదు జీవితాలను దైవ కృపతో కలిపి తీసుకున్న కధ ఈ చిత్రం, అని పేర్కొన్నాడు.”

”ది మ్యూజిక్: నోట్స్ ఆఫ్ డివోషన్ సంగీత దర్శకుడు దేవా "ఈ అవకాశాన్ని అరుదైన వరం", “పూర్వ జన్మ ఫలం,” గత జన్మలో సంపాదించిన పుణ్య ఫలం అని అభివర్ణించారు. ఒక కూర్పు సెషన్‌లో, “అన్నై నీయే, తంతై నీయే” అనే పాట అంతర్గత ప్రార్థన నుండి పుట్టిన రాగం అని, అనంతలోని ప్రతి పాట భక్తి భావన కలిగి ఉంటుంది, ఇది ఆత్మను కదిలించే సంగీతం అని చెప్పాడు. అనంత తన హృదయంలో ఒక సజీవ సమర్పణ - కదలికలు ఉన్న ప్రార్థన అని గిరీష్ పేర్కొన్నాడు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్, ఈ చిత్రం బృందానికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేశారు. భగవాన్ బోధనలను కథనంలో వేయమని ఆయన రచయితలను ప్రోత్సహించారు. ‘సుందరం’ (చెన్నైలోని భగవాన్ నివాసం) వద్ద ప్రారంభ ప్రార్థనలు చేసిన తర్వాత, భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారిగా, ఆడియో లాంచ్ ప్రారంభానికి ముందు సాయి భజనలు పాడారు.[4]

దర్శకుడు సురేష్‌కృష్ణ చిత్ర విశేషాలు తెలియజేస్తూ "పుట్టపర్తి సాయిబాబా మహిమల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బాబా ప్రేమను మరింత మందికి చేరువచేయాలనే ప్రయత్నమిది. ఇందులో ఆధ్యాత్మిక అంశాలతో పాటు వాణిజ్య అంశాలు కూడా ఉంటాయి. కాశీ, చెన్నై, హైదరాబాదు, పుట్టపర్తి వంటి స్థానాల్లో చిత్రీకరణ జరిపాం’" అని అన్నారు. "ఇంత గొప్ప సినిమాలో పాట రాసే అదృష్టం దక్కిందని" రామజోగయ్య శాస్త్రి అన్నారు.[5]

చిత్ర నిర్మాణంలో పాల్గొన్నవారు

[మార్చు]
  • దర్శకుడు - సురేష్ కృష్
  • సంగీతం - దేవా
  • సినిమాటోగ్రఫీ - బి. ఎల్. సంజయ్
  • ఎడిటర్ - ఎస్. రిచర్డ్

నిర్మాతలు

[మార్చు]
  • ఎం.చిదంబరం - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
  • కె. ఆర్. కవిన్ - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
  • గిరీష్ కృష్ణమూర్తి - ప్రొడ్యూసర్

సంభాషణలు

[మార్చు]
  • సురేష్ కృష్ణ - రచయిత
  • పి. రాజేంద్ర కుమార్ - తెలుగు సంభాషణలు
  • పి. విజయ్ - తమిళ సంభాషణలు

తారాగణం

[మార్చు]
  • జగపతి బాబు
  • రామారావు జాదవ్
  • సుహాసిని
  • వై. జి. మధువంతి
  • వై. జి. మహేంద్రన్
  • అర్జున్ రామన్
  • శ్రీ రంజని
  • నిజల్గళ్ రవి
  • టెంపర్ వంశీ
  • అభిరామి వెంకటాచలం
  • తలైవజల్ విజయ్ [6]

చిత్రం విడుదల

[మార్చు]

‘అనంత’ చిత్రం ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ (OTT ) ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో 2026 జనవరి 13న విడుదలైంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ప్రసారం అవుతోంది.[7]

మూలాలు

[మార్చు]
  1. సాయికిరణ్, వేలాండి (2025-11-13). "కమర్షియల్ సినిమాలో భాషా ... డివైన్ ఫిలిమ్స్ లో అనంత". దిశ. Retrieved 2026-01-13.
  2. "బాబా కలలోకి వచ్చి విబూది ఇచ్చారు". సాక్షి. 2025-11-12. Retrieved 2026-01-14.
  3. "Suresh Krishna: కమర్షియల్ సినిమాల్లో 'బాషా'... డివైన్ మూవీస్ లో 'అనంత'". చిత్రజ్యోతి. ABN ఆంధ్రజ్యోతి. 2025-11-13.
  4. "Teaser and Audio Launch of 'Anantha' Movie at the Music Academy, Chennai | Nov 10, 2025". Sri Sathya Sai Central Trust. 2025-11-11. Retrieved 2026-01-14.
  5. "పుట్టపర్తి సాయిబాబా మహిమలు". నమస్తే తెలంగాణా. 2025-11-14. Retrieved 2026-01-14.
  6. "Anantha". IMDB. Retrieved 2026-01-15.
  7. "నేరుగా ఓటీటీలోకి వచ్చిన 'అనంత'.. స్ట్రీమిగ్ ఎందులో అంటే..?". 123Telugu.com. 2026-01-13. Retrieved 2026-01-14.