Jump to content

అనగనగా

వికీపీడియా నుండి
అనగనగా
దర్శకత్వంసన్నీకుమార్
రచనసన్నీకుమార్
నిర్మాత
  • రాకేష్ రెడ్డి గడ్డం
  • రుద్ర మాదిరెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంపవన్ పప్పుల
కూర్పువెంకటేష్ చుండూరు
సంగీతంచందు రవి
నిర్మాణ
సంస్థలు
కృషి ఎంటర్‌టైన్‌మెంట్, ఈటీవి విన్
విడుదల తేదీ
15 మే 2025 (2025-05-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

అనగనగా 2025లో విడుదలైన తెలుగు సినిమా. కృషి ఎంటర్‌టైన్‌మెంట్. ఈటీవి విన్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సన్నీకుమార్ దర్శకత్వం వహించాడు.[1] సుమంత్, కాజల్ చౌదరి, శ్రీనివాస్ అవసరాల, మాస్టర్ విహార్ష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 10న,[2] ట్రైలర్‌ను మే 9న విడుదల చేసి సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో మే 15న విడుదలైంది.[3]

వ్యాస్ (సుమంత్) యారో వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్‌గా పని చేస్తుంటాడు. ఆ స్కూల్‌కి చైర్మన్ రాజా రెడ్డి (అవసరాల శ్రీనివాస్), ఆ స్కూల్లోనే వ్యాస్ భార్య భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి) ప్రిన్సిపాల్‌గా పని చేస్తుంటుంది. అదే స్కూల్‌లో వ్యాస్, భాగ్యలక్ష్మీ కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్) కూడా చదువుతుంటాడు. ఆ స్కూల్లో కేవలం మార్కులే లక్ష్యంగా, ర్యాంకులే లక్ష్యంగా పిల్లల మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటారు. కానీ వ్యాస్ మాత్రం తన ధోరణిలో వెళ్తూ పిల్లలకు నచ్చినట్టుగా ఉండాలని, ఎవ్వరి మాటలు గుడ్డిగా వినొద్దని చెబుతుంటాడు. ఈ క్రమంలో చదువు ఒత్తిడితో ఒక పిల్లాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఆ తరువాత వ్యాస్‌ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ట్యూషన్ చెప్పడం మొదలు పెడతాడు, ఆ తరువాత పరీక్షల్లో అంతకు ముందు ఫెయిల్ అయిన విద్యార్థులంతా కూడా ఫస్ట్ ర్యాంక్‌ని తెచ్చుకుంటారు. తన కొడుకు సలహాతో రామ్ ఓ స్కూల్‌ను ప్రారంభించాలని అనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు విద్యా వ్యవస్థలో రావాలనుకున్న మార్పుని వ్యాస్ తీసుకు వస్తాడా? అనేదే మిగతా సినిమా కథ.[4][5][6]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చూడు చూడు"రెహమాన్విజయ్ యేసుదాస్3:42
2."చిక్కురు చిక్కు"రెహమాన్సాయి వేద వాగ్దేవి, ప్రధాన, మనోఘ్న, తనిష్క4:10

మూలాలు

[మార్చు]
  1. "బట్టీ పట్టాలా? సబ్జెక్ట్‌ నేర్చుకోవాలా?". Eenadu. 24 February 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  2. "'బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది?' - సుమంత్ 'అనగనగా' టీజర్ చూశారా!." ABP Desham. 22 February 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  3. "నేరుగా ఓటీటీలోకి సుమంత్‌ మూవీ.. 'అనగనగా' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే". Eenadu. 3 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  4. "'Anaganaga' movie review: Sumanth leads a soulful tale of education and relationships" (in Indian English). The Hindu. 15 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  5. "రివ్యూ: అనగనగా.. సుమంత్‌ ఎమోషనల్‌ డ్రామా మెప్పించిందా?". Eenadu. 15 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  6. "అనగనగా రివ్యూ: ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద ETV Win లెక్చర్ - సుమంత్ సినిమా ఎలా ఉందంటే?". A. B. P. Desam. 15 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  7. "OTT ట్రెండింగ్‌లో అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్..!". NTV Telugu. 20 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అనగనగా&oldid=4573151" నుండి వెలికితీశారు