Jump to content

అనగనగా ఒక రోజు

వికీపీడియా నుండి
అనగనగా ఒక రోజు
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నడిమింటి నర్శింగ రావు
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
కె. ఎల్. ఎన్. రాజు
తారాగణంజె. డి. చక్రవర్తి,
ఊర్మిళ
రఘువరన్
బ్రహ్మానందం
కోట శ్రీనివాస రావు
ఛాయాగ్రహణంవాసు
కూర్పుభానోదయ
సంగీతంశ్రీ కొమ్మినేని
పంపిణీదార్లువర్మ క్రియేషన్స్
విడుదల తేదీ
జనవరి 1996
దేశంభారతదేశం
భాషతెలుగు

అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా.[1] ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.

కథ

చక్రి (జె. డి. చక్రవర్తి), మధు (ఊర్మిళ) పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు.

మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. మధ్యలో ఒక కారు ఆపి ఎక్కుతారు. కారు డ్రైవరు మధ్యలోనే చనిపోతాడు. వీళ్ళు హత్య కేసులో ఇరుక్కుంటారు. ఓ పక్క పోలీసులు, ఓ పక్క రౌడీలు వీరిని తరుముకుంటూ వస్తుంటారు. వీటన్నింటినీ అధిగమించి చివరకు ఎలా బయటపడతారన్నదే మిగతా కథ.

తారాగణం

నటన

ఈ సినిమాలో బ్రహ్మానందం మైఖేల్ జాక్సన్ అనే దొంగగా నటించాడు. పోలీసులను తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు మంచి హాస్యాన్ని సృష్టించింది. ఈ సినిమాలో నటనకు బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.

మూలాలు

  1. "అనగనగా ఒక రోజు సినిమా సమీక్ష". thecinebay.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 September 2017.