అనన్య (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనన్య
జననం
అయిల్య గోపాలకృష్ణన్ నైర్

(1987-03-29) 1987 మార్చి 29 (వయసు 37)
కొచ్చి, కేరళ,భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తి
  • నటి
  • గాయని
  • షూటర్
క్రియాశీల సంవత్సరాలు2008 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆంజనేయన్
(m. 2012)

అనన్య (జననం 29 మార్చి 1987), ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె మలయాళ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో కేవలం ఒకటి, రెండు సినిమాల్లోనే నటించింది అనన్య. ఆమె అసలు పేరు అయిల్య నాయర్. 2008లో మొట్టమొదటిసారి పాజిటివ్ అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది అనన్య. ఆ తరువాతి సంవత్సరం ఈ చిత్రాన్ని తమిళంలోకి నాడొడిగళ్ గా డబ్బింగ్ చేశారు. రెండు భాషల్లోనూ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక, కమర్షియల్ గా కూడా మంచి విజయవంతం అయింది.[1] ఆమె చాలా  తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఎంగేయుం ఎప్పోతుం అనే తమిళ సినిమాకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకుంది.


తొలినాళ్ళ జీవితం[మార్చు]

అనన్య అసలు పేరు అయిల్య. కేరళలోని కొత్తమంగళంలో మలయాళ కుటుంబంలో జన్మించింది అనన్య. ఆమె తల్లి ప్రసీతా, తండ్రి గోపాలకృష్ణన్  నాయర్. గోపాలకృష్ణన్ ప్రముఖ సినీ నిర్మాత.[2] ఆమె తమ్ముడి పేరు అర్జున్.1995లో ఆమె తండ్రి సహ నిర్మాతగా తీసిన పై బ్రదర్స్ సినిమాలో బాల నటిగా తెరంగేట్రం చేసింది.[3] అళువాలోని సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో బిఏ డిగ్రీ పూర్తి చేసింది ఆమె.[2][3] ఆమె చిన్నతనంలో విలువిద్య నేర్చుకుంది. విలువిద్యకు చెందిన రాష్ట్ర పోటీల్లో పురస్కారం గెలుచుకుంది అనన్య.[4] ఆమె కాలేజిలో చదువుకునేటప్పుడు స్టార్ వార్స్ అనే టీవీ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమెను చూసిన కొందరు దర్శకులు అనన్యను నటించమని అడిగారు. కానీ ఆమె దాదాపు 5 సినిమా అవకాశాలను నిరాకరించాకా, పాజిటివ్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "ml:സിനിമയല്ലാതെ മറ്റൊന്നും മോഹിപ്പിക്കുന്നില്ല". Archived from the original on 2011-03-03. Retrieved 2017-05-26.
  2. 2.0 2.1 "MediaMatiqx". MediaMatiqx. Archived from the original on 2011-09-10. Retrieved 2017-05-26. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "mediamatiqx1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 Shilpa Nair Anand (2011-09-16). "Life & Style / Metroplus : Arching towards success". The Hindu. Retrieved 2011-11-09.
  4. Keerthy Ramachandran DC Kochi (2011-09-03). "Name to fame". Deccan Chronicle. Archived from the original on 2011-09-04. Retrieved 2011-11-09.