అనిత (సహాయ నటి)
అనిత | |
---|---|
జననం | రామాకుమారి 1954 డిసెంబరు 8 మచిలీపట్నం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | భారతీయ చలనచిత్ర నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1968-1996 |
మతం | హిందూ మతం |
పిల్లలు | తనూజ |
తండ్రి | నందనరావు |
తల్లి | వాణీబాల |
అనిత తెలుగు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా తల్లి, చెల్లి వంటి క్యారెక్టర్ పాత్రలలో నటించి రాణించింది.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె అసలు పేరు రామాకుమారి. ఈమె 1954, డిసెంబరు 8న మచిలీపట్నంలో జన్మించింది. ఈమె తల్లి వాణీబాల ప్రఖ్యాత రంగస్థల కళాకారిణి. ఆమె తేనెమనసులు వంటి కొన్ని చలనచిత్రాలలో కూడా నటించింది. అనిత తండ్రి నందనరావు. ఈమె బాల్యంలో సాంప్రదాయ నృత్యం నాగేశ్వర శర్మ వద్ద నేర్చుకుంది.[1] ఈమె భర్త 2002లో మరణించాడు. ప్రస్తుతం ఈమె తన కుమార్తె వద్ద బెంగళూరులో నివసిస్తున్నది.
సినిమారంగం
[మార్చు]ఈమె తండ్రి, నటి నిర్మలమ్మ భర్త కృష్ణారావు స్నేహితులు. కృష్ణారావు ప్రోద్బలంతో అనిత సినిమా రంగంలో ప్రవేశించింది. ఈమె సి.ఎస్.రావు దర్శకత్వంలో 1968లో వచ్చిన నిండు సంసారం చిత్రంలో ఎన్.టి.రామారావుకు అవిటి చెల్లెలి పాత్రలో మొట్టమొదటిసారి నటించింది. తరువాత 1996 వరకు అనేక తెలుగు, కన్నడ చిత్రాలలో సహాయ నటిగా, కథా నాయికగా నటించింది. ఈమె నటించిన ఆఖరి సినిమా పెళ్ళిసందడి. ఈమె కలవారి కోడలు వంటి కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. నటి రాధకు కొన్ని సినిమాలలో గాత్రసహకారం అందించింది.
సినిమాల జాబితా
[మార్చు]ఈమె నటించిన సినిమాల పాక్షిక జాబితా:
మూలాలు
[మార్చు]- ↑ కంపల్లె, రవిచంద్రన్ (21 October 2012). "చెల్లి, తల్లిగానే ఆదరించారు". ఆంధ్రజ్యోతి. Retrieved 21 March 2017.