అనిరుద్ధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనిరుద్ధుడు హిందూ పురాణాలలో వ్యక్తి.

  • 1. కల్పాదియందు బ్రహ్మను పుట్టించుటకై నారాయణు డెత్తిన యవతారము.
  • 2. (చం. పం.) యాదవకులజుడు. శ్రీ కృష్ణుని కుమారు డైన ప్రద్యుమ్నునకును, రుక్మికూతురైన రుక్మవతికిని కుమారుడు. ఇతడు నాగాయుతబలుడు, మహారథుడు. రుక్మిరాజు పౌత్రి యైన రోచన యీతని భార్య. ఈ వివాహకాల మందు ఘోరమైన పోరు జరిగెను. ఈమె వలన నితనికి వజ్రు డను పుత్రుడు పుట్టెను (భాగ, 10. 90). బాణాసురుని కన్య ఉష యనునామె యీతని ద్వితీయ భార్య. ఈమెను గురించు యాదవులకును బాణాసురునకును పోరు జరిగెను.