అనిల్ అంబానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనిల్ అంబానీ
2012లో అనిల్ అంబానీ
జననం (1959-06-04) 1959 జూన్ 4 (వయసు 65)[1]
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థముంబై విశ్వవిద్యాలయం
ద వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
వృత్తివ్యాపారవేత్త
నికర విలువయుఎస్$1.8 బిలియన్లు (2019 ఫిబ్రవరి నాటికి)[2]
బిరుదుఛైర్మన్, రిలయన్స్ గ్రూప్
జీవిత భాగస్వామిటీనా అంబానీ
పిల్లలు2
తల్లిదండ్రులుధీరూబాయ్ అంబానీ
కోకిలాబెన్ అంబానీ
బంధువులుముఖేష్ అంబానీ (అన్నయ్య)

అనిల్ ధీరూబాయ్ అంబానీ (జననం 1959 జూన్ 4) ఒక భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ గ్రూప్ (దీన్నే రిలయన్స్ ఎడిఎ గ్రూప్ అంటారు)కి ఇతను ఛైర్మన్. రిలయన్స్ క్యాపిటల్,[3] రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,[4] రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్.[5] వంటివాటితో కూడిన రిలయన్స్ ఎడిఎ గ్రూప్ 2005 జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడింది. ఇతని ప్రధానమైన వ్యాపార ఆసక్తుల్లో 44 ఎఫ్ఎం స్టేషన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీటీహెచ్ వ్యాపారం, యానిమేషన్ స్టూడియో, భారతదేశమంతటా ఉన్న పలు మల్టీప్లెక్సులు ఉన్నాయి.[6]

ఏ లిస్టెడ్‌ కంపెనీలోనూ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాల మేరకు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేసినట్టు 2022 మార్చిలో ఆయా సంస్థలు బీఎస్‌ఈకి వెల్లడించాయి.[7]

జీవిత చరిత్ర

[మార్చు]

అనిల్ అంబానీ ధీరూబాయ్ అంబానీ రెండవ కుమారుడు. ప్రస్తుతం భారతదేశంలోకెల్లా ధనవంతుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు. శారీరక దారుఢ్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. మారథాన్లలో పరుగెత్తుతాడు. ప్రతీ రోజు ఉదయం అయిదు గంటలకే లేచి రన్నింగ్ కి వెళ్తాడు. యోగా కూడా చేస్తారు. ఫిట్ నెస్ విషయంలో తనకు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ స్ఫూర్తి అని చెప్తాడు.

అనిల్ ముంబయి యూనివర్సిటీలోని కిషన్ చంద్ చెల్లారామ్ కళాశాల నించి బీఎస్సీ డిగ్రీ పొందాడు. తర్వాత 1983లో అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్ నించి ఎంబీయే(మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీ పొందాడు. వెంటనే తండ్రి స్థాపించిన రిలయన్స్ గ్రూపులో సహ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా (కో- సీఈవో) చేరారు. ఆ పదవిలో ఉంటూ భారత ఆర్థిక సేవలు, మార్కెట్ల రంగంలోకి పలు కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టారు. అందులోముఖ్యమైనవి. విదేశీ పెట్టుబడుల మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయంగా బాండ్లు, ఇతర ఆర్థికపత్రాలను విడుదల చెయ్యడం , అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల నించి తమ కంపెనీకి బిలియన్ల డాలర్ల పెట్టుబడులు సంపాదించడం తదితరాలు.

వార్టన్ కళాశాలలో ఆసియాకు చెందిన ఓవర్సీర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అనిల్ సభ్యుడు. 2006లో ముంబయిలోని వార్టన్ గ్లోబల్ అల్యుమ్నీ ఫోరంకు ఛైర్మన్ గా ఉన్నారు. అదే ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని పొందారు.

ధీరూబాయ్ మరణం (2002-2005)

[మార్చు]

2002లో అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణించాక, అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థల్లో టెలికాం, వినోద రంగం, ఆర్థిక సేవలు, విద్యుత్తు, మౌలిక వసతులు వంటి విభాగాల పగ్గాలు చేపట్టాడు.[8] 2008లో అనిల్ రిలయన్స్ పవర్ సంస్థ షేర్లు పబ్లిక్ ఇష్యూ విడుదల చేసినప్పుడు అది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించింది. అది కేవలం 60 సెకన్లలో ఆశించిన మేరకు సబ్ స్క్రిప్షన్ సాధించి ఆ రకంగా కూడా చరిత్ర సృృష్టించింది.

అనిల్ అంబానీ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ కు చెందిన డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ సంస్థలో 2009 లో 825 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాడు. దాంతో అంతర్జాతీయ వినోద రంగంలో భారీ పెట్టుబడిదారుగా రూపొందాడు. భారత్ లో కూడా బాలీవుడ్ సినిమాల్లో పెద్ద Okewla: Link Alternatif Terbaru Archived 2022-12-28 at the Wayback Machine పెట్టుబడిదారుల్లో ఆయన ఒకరు. 44 ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు, దేశవ్యాప్త డీటీహెచ్ కనెక్షన్లు, యానిమేషన్ స్టూడియోలు, పలు మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను ఆయన సంస్థలు నిర్వహిస్తున్నాయి.

తన అన్న ముఖేష్ అంబానీ సంస్థ అయిన జియో ఇన్ఫోకాం 4జీ టెలికాం సేవలు ప్రవేశపెట్టే ముందు 2013 లో అనిల్ తన రిలయన్స్ కమ్యూనికేషన్స్. సంస్థ ద్వారా రెండు భారీ టెలికాం టవర్లు లీజుకివ్వడానికి 2.1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అప్పటికే అనిల్ సంస్థలన్నీ దాదాపుగా అప్పుల్లో కూరుకుపోయాయి.

అనిల్ అంబానీకిి ఒక సొంత జెట్ విమానం , ( ఫాల్కన్ 7ఎక్స్ ) ఉంది. లాంబోర్గినీతో సహా పలు లగ్జరీ కార్లున్నాయి. తన భార్య , గతంలో సినిమా నటి అయిన టీనా మునిమ్ కు ఒక సూపర్ లగ్జరీ యాట్ (విలాసవంతమైన పెద్ద పడవ) ని బహుమానంగా ఇచ్చాడు.

అనిల్ అంబానీ భార్య టీనా మునిమ్ 1980 వ దశాబ్దంలో సినిమా హీరోయిన్. అనిల్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడి పేరు జై అనుమోల్ అంబానీ, కుమార్తె జై అన్షుల్ అంబానీ.

అన్నతో వివాదం, ఆస్తుల పంపకం

[మార్చు]

అన్నతో వివాదం, ఆస్తుల విభజన (2005)

[మార్చు]

ధీరూబాయ్ అంబానీ తన ఆస్తులను అనిల్ అంబానీ, అతని సోదరుడు ముఖేష్ అంబానీలు ఎలా పంచుకోవాలన్న విషయం మీద సరైన వీలునామా రాయకుండా చనిపోయాడు. దీనితో 2005లో అనిల్ కీ, అతని సోదరుడు ముఖేష్ కీ వివాదాలు చెలరేగి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని విభజించారు. విభజన వెంటనే 2007లో అనిల్, ముఖేష్ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అగ్రభాగాన నిలిచారు.[9]

తొలినాటి వ్యాపారం (2005-2010)

[మార్చు]

రిలయన్స్ పవర్

[మార్చు]

భారతదేశపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ రికార్డు నెలకొల్పినది అనిల్ అంబానీయే. 2008లో రిలయన్స్ పవర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి వెళ్ళినప్పుడు 60 క్షణాలలోపే షేర్లన్నీ అమ్ముడుకావడం భారతీయ మార్కెట్లలో అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది.[10] ఈ షేర్లు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు దాటిపోతాయని, తద్వారా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని మించిపోతాడని అంచనాలు వేశారు. 2008 ఫిబ్రవరిలోనే షేర్లు దెబ్బతినడం, వాటాదారులు నష్టపోవడంతో ఈ పరిణామాలు తిరగబడి అనిల్ కు నష్టాలు తెచ్చిపెట్టాయి.

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్

[మార్చు]

ఫిల్మ్ ప్రాసెసింగ్, నిర్మాణం, ప్రదర్శన, డిజిటల్ సినిమా వంటివాటిలో ఆసక్తులు కలిగిన యాడ్ లాబ్స్ ఫిల్మ్స్ కొనుగోలు చేయడం ద్వారా 2005లో అనిల్ అంబానీ వినోద రంగంలో అడుగుపెట్టాడు. 2009లో కంపెనీని రిలయన్స్ మీడియా వర్క్స్ గా పేరు మార్చారు.[11][12][13] 2008లో స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నిర్మాణ సంస్థ డ్రీమ్ వర్క్స్ తో కలిసి ప్రారంభించిన 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల సంయుక్త వ్యాపార ప్రయత్నం ద్వారా అనిల్ అంబానీ అంతర్జాతీయ వినోద పరిశ్రమలో ప్రవేశించాడు.[14] ఈ ప్రయత్నం ద్వారా అకాడమీ పురస్కారం అందుకున్న లింకన్ సహా పలు స్పీల్ బర్గ్ చిత్రాల నిర్మాణానికి తనవంతు పెట్టుబడి పెట్టాడు.[15][16]

రిలయన్స్ కమ్యూనికేషన్స్

[మార్చు]

ఆస్తుల విభజన నాటికి అతని అతిపెద్ద ఆస్తి అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (67శాతం వాటాతో) ఆస్తులు ఏటా 16.6 శాతం తగ్గుతూ రాగా, అప్పులు ఏటా 8.7 శాతం పెరుగుతూ పోయాయి. 2008లో రిలయన్స్ కమ్యూనికేషన్ ను దక్షిణాఫ్రికా టెలికాం సంస్థ ఎంటిఎంలో కలిపడం ద్వారా భారతదేశపు అతిపెద్ద ఓవర్ సీస్ డీల్ చేయాలని Togel Terbesar Archived 2022-12-22 at the Wayback Machine అనిల్ భావించాడు. ఈ డీల్ ని అడ్డుకుంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో వాటా ఉన్న ముఖేష్ తొలుత తిరస్కరించే తన హక్కును వాడుకుంటున్నాననీ, డీల్ చేస్తే కోర్టుకు వెళ్ళాల్సివుంటుందని హెచ్చరించడంతో అది ఆగిపోయింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తర్వాత 2012 నాటి 2జీ కుంభకోణంలోనూ ఇరుక్కుంది.[17]

ఎరిక్సన్ వివాదం నించి కాపాడిన ముఖేష్

[మార్చు]

స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ తో అనిల్ కి చెందిన ఆర్ కాం సంస్థ2013లో వాణిజ్యం జరిపింది. అప్పుడు ఎరిక్సన్ కు చెందిన నెట్వర్క్ ను భారత్ లో ఏడేళ్ల పాటు నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం దానికి ఇవ్వవలసిన బాకీలను ఆర్ కాం చెల్లించలేకపోయింది.అందువల్ల ఎరిక్సన్ అనిల్ ను 2017 లో కోర్టుకు లాగింది. ఆ కేసులో ఎరిక్సన్ నెగ్గింది. దాంతో అనిల్ ఆ సంస్థకు అప్పులతో పాటు భారీ ఎత్తున 1500 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించవలసి వచ్చింది. ఒకటి రెండు విడతలుగా 2019 జనవరి నాటికి ఆర్ కాం సంస్థ ఎరిక్సన్ కు 579.77 కోట్ల రూపాయలు చెల్లించింది. మరో 550 కోట్ల రూపాయలను 2018 డిసెంబర్ లోగా ఆర్ కాం సంస్థ ఎరిక్సన్ కు చెల్లించాలనీ , లేకపోతే వాటిపై 12 శాతం వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి వస్తుందనీ కోర్టు హెచ్చరించింది. అందుకు అనిల్ అంగీకరించాడు.

కానీ అలా అనిల్ సంస్థ ఆర్ కాం చెల్లించలేకపోయింది. దాంతో ఎరిక్సన్ సంస్థ సుప్రీం కోర్టుకు ఎక్కి కోర్టు చెప్పినట్టుగా అప్పులు (వడ్డీతో సహా ) తీర్చనందుకు గాను కోర్టు ధిక్కార నేరం మీద విచారణ జరపాలని కోరింది. సుప్రీం కోర్టు దానిపై విచారణ జరిపి అనిల్ ను, ఆర్ కాం కు చెందిన మరో ఇద్దరు డైరక్టర్లను కోర్టు ధిక్కారం కింద తప్పు బట్టి నాలుగు వారాల్లోగా 550 కోట్ల రూపాయలు చెల్లించాలని 2019 ఫిబ్రవరి 20 వ తేదీన ఆదేశించింది. అలా చెల్లించని పక్షంలో అనిల్ కు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఆర్ కాం , ఆర్టీఎల్ , రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థలకు ఒక కోటి రూపాయలు పెనాల్టీ కూడా విధించింది. 

కోర్టు విధించిన గడువు ఆఖరి నిమిషం దాకా వచ్చినా అనిల్ సంస్థలు ఎరిక్సన్ బాకీలు చెల్లించలేకపోయాయి. దాంతో అనిల్ అన్న ముఖేష్ రంగంలోకి దిగి 458.77 కోట్ల రూపాయలను ఎరిక్సన్ సంస్థకు 2019 మార్చి 18 వ తేదీన, గడువుకు ఒక్క రోజు ముందుగా చెల్లించారు. తద్వారా అనిల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది.

మూలాలు

[మార్చు]
 1. "Date of birth". daily.bhaskar.com. Retrieved 6 సెప్టెంబరు 2016.
 2. "Anil Ambani". Forbes. Retrieved 7 ఫిబ్రవరి 2019.
 3. "Reliance Capital". Reliance Capital. 17 ఏప్రిల్ 2014. Retrieved 18 ఏప్రిల్ 2014.
 4. "Reliance Infra". Reliance Infra. 17 ఏప్రిల్ 2014. Retrieved 17 ఏప్రిల్ 2014.
 5. "Reliance Communication". Reliance Communication. 17 ఏప్రిల్ 2014. Archived from the original on 3 ఏప్రిల్ 2019. Retrieved 17 ఏప్రిల్ 2014.
 6. "Ambani & Sons". CNNGO. 12 జూన్ 2012. Archived from the original on 31 అక్టోబరు 2012. Retrieved 16 ఫిబ్రవరి 2014.
 7. "Anil Ambani: రిలయన్స్‌ పవర్‌, ఇన్‌ఫ్రా బోర్డు పదవులకు అనిల్‌ అంబానీ రాజీనామా". EENADU. Retrieved 26 మార్చి 2022.
 8. "The Ambani Achievements". Rediff.com. 7 జూలై 2002. Retrieved 16 ఫిబ్రవరి 2014.
 9. "తమ్ముడూ ఈ డబ్బులు తీసుకో ఆ అప్పు తీర్చేయ్". 19 March 2019. 19 మార్చి 2019. Retrieved 21 మార్చి 2019.
 10. "Anil Ambani". EXHIBIT MAGAZINE. 22 మే 2014. Archived from the original on 6 ఫిబ్రవరి 2015. Retrieved 21 మార్చి 2019.
 11. "Reliance Cap buys 51% in Adlabs for Rs 360 crore". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. 1 జూలై 2005. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 12. "The Reliance-Spielberg Deal: Anil Ambani's Next Blockbuster?". Knowledge@Wharton. The Wharton School, University of Pennsylvania. 2 అక్టోబరు 2008. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 13. "Adlabs Films to be renamed Reliance MediaWorks". Live Mint. HT Media. 4 సెప్టెంబరు 2009. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 14. "DreamWorks to Receive Funds From Reliance". The Wall Street Journal. News Corporation. 10 ఏప్రిల్ 2012. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 15. "Reliance Entertainment [in]". IMBD. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 16. "Lincoln (2012) - Company credits". IMDB. Retrieved 11 ఫిబ్రవరి 2015.
 17. అనిల్ అంబానీ గురించి డెక్కన్ హెరాల్డ్ లో (2019 మార్చి)

బాహ్య లంకెలు

[మార్చు]